భారత్ – మారిషస్ సంయుక్త ప్రకటన: ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ
September 11th, 01:53 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు గౌరవ మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రాం గూలం భారత్‌లో అధికారికంగా పర్యటించారు. విస్తృత శ్రేణి ద్వైపాక్షిక అంశాలపై ప్రధానమంత్రులిద్దరూ ఫలవంతంగా చర్చించారు. మారిషస్ ప్రభుత్వ అభ్యర్థనల ఆధారంగా.. భారత్, మారిషస్ సంయుక్తంగా కింది ప్రాజెక్టుల అమలుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి.