ఢిల్లీలో పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన ఫ్లాట్‌లను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
August 10th, 10:44 am
ఢిల్లీలోని బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన 184 టైప్–VII బహుళ అంతస్తుల ఫ్లాట్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 11న ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు న్యూఢిల్లీలోని తన నివాసంలో సిందూర్ మొక్కను నాటిన ప్రధానమంత్రి
June 05th, 11:50 am
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో సిందూర్ మొక్కను నాటి దానికి నీళ్లు పోశారు. గుజరాత్‌లో కచ్ఛ్‌కు చెందిన సాహసిక మాతృమూర్తులు, సోదరీమణులు కానుకగా ఆయనకు అందజేసిన మొక్క అది. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ కాలంలో కచ్ఛ్‌కు చెందిన మాతృమూర్తులు, సోదరీమణులు మొక్కవోని ధైర్య-సాహసాలతో పాటు గొప్ప దేశభక్తిని ప్రదర్శించారు. ప్రధాని ఇటీవల గుజరాత్‌లో పర్యటించిన సంగతిని గుర్తుచేసుకున్నారు...నాకు బహుమతిగా ఇచ్చిన సిందూర్ మొక్క మన దేశ నారీశక్తి శౌర్యంతో పాటు ప్రేరణకు కూడా ఒక ప్రబలమైన ప్రతీకగా అలరారుతుందని ప్రధానమంత్రి అన్నారు.