టీవీ9 సమ్మిట్-2026లో ప్రధానమంత్రి ప్రసంగం

March 23rd, 08:30 pm

ఇటీవల ఒకటి, రెండు సార్లు టీవీ9 భారత్‌వర్ష్ చూసే అవకాశం వచ్చింది. యుద్ధాలు, క్షిపణి దాడులపై మీరు దృష్టి సారిస్తున్నారు. మీకు కంటెంట్ కూడా విపరీతంగా లభిస్తుంది. టీవీ9కి తగినంత సమాచారాన్ని అందించాలని పెద్ద దేశాలు బలంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రస్తుతం ప్రపంచం, మునుపెన్నడూ లేనివిధంగా ఆందోళనకర, అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచనలకు కీలకమైన వేదికను టీవీ9 వ్యవస్థ సృష్టించింది. ఈ సదస్సులో భారత్, ప్రపంచం అంశంపై మీరంతా చర్చిస్తున్నారు. ఈ సదస్సును నిర్వహిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ.. కార్యక్రమం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా సదస్సుకు విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం.

టీవీ9 నెట్‌వర్క్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం

March 23rd, 08:00 pm

'భారత్ - ప్రపంచం' ఇతివృత్తంతో టీవీ9 నెట్‌వర్క్ ఈ రోజు నిర్వహించిన సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అసాధారణ, క్లిష్ట పరిస్థితులను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి కీలక సమయంలో ఆలోచనల మార్పిడికి ఒక వేదికను సిద్ధం చేసిన టీవీ9 నెట్‌వర్క్‌ను ప్రధాని అభినందించారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులు అసాధారణమైనవి. అత్యంత క్లిష్టమైనవి. ఇలాంటి సమయంలో ఆలోచనల మార్పిడికి టీవీ9 నెట్‌వర్క్ ఒక ముఖ్యమైన వేదికను సిద్ధం చేసింది” అని శ్రీ మోదీ అన్నారు.

అస్సాంలోని సిల్చార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

March 14th, 11:10 am

సంస్కృతి, ధైర్యం, ఉత్సాహం నిండిన బరాక్ లోయ కుటుంబాల మధ్యకు రావడం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభవాన్నిస్తుంది. బరాక్ లోయకు ముఖద్వారంగా సిల్చార్‌ను పిలుస్తారు. చరిత్ర, భాష, సంస్కృతి, వ్యాపారం అన్నీ కలసి ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక్కడ బెంగాలీ మాట్లాడతారు. అస్సామీ ప్రతిధ్వనిస్తుంది. ఇతర గిరిజన సంప్రదాయాలు విరాజిల్లుతున్నాయి. ఈ వైవిధ్యాన్ని బలంగా మార్చుకుంటూ, సోదరభావం, సామరస్యంతో ఈ ప్రాంతాన్నంతా మీరు అభివృద్ధి చేస్తున్నారు. ఇది బరాక్ వ్యాలీకున్న అసమానమైన సామర్థ్యం.

అస్సాంలోని సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 14th, 10:45 am

అస్సాంలోని సిల్చార్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ.. సంస్కృతి, చైతన్యానికి నిలయమైన బరాక్ లోయను సందర్శించడం తనకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుందని పేర్కొన్నారు. సిల్చార్ నగరం ఈ లోయకు ఒక ప్రవేశ ద్వారం వంటిదని.. ఇక్కడ చరిత్ర, భాష ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ గుర్తింపును తీసుకొచ్చాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బెంగాలీ, అస్సామీ, గిరిజన సంప్రదాయాలు సామరస్యంతో వర్ధిల్లే ఈ ప్రాంత వైవిధ్యమే దీని అసలైన బలమని శ్రీ మోదీ తెలిపారు. ‘‘బరాక్ లోయ వైవిధ్యమే దాని గొప్ప ఆస్తి. ఇది పౌరుల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

మార్చి 13-14 తేదీల్లో ప్రధానమంత్రి అస్సాం పర్యటన

March 12th, 05:33 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మార్చి 13-14 తేదీల్లో అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కొక్రాఝర్, గువహటి, సిల్చార్ ప్రాంతాలలో రూ. 47,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమి పూజ, రైళ్ల ప్రారంభోత్సవం చేస్తారు.

సిల్చర్ లో మరియు పరిసర ప్రాంతాల లో జీవన సౌలభ్యాన్ని పెంచుతున్నటువంటి అభివృద్ధి పనులపట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

April 03rd, 09:55 am

పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ శ్రీ రాజ్ దీప్ రాయ్ పలు ట్వీట్ లలో సిల్ చర్ యొక్క అభివృద్ధి ప్రస్థానాన్ని గురించి తెలియజేశారు. అది విద్య గాని, లేదా స్వచ్ఛత గాని, లేదా ఆరోగ్య సంరక్షణ గాని, లేదా నీటి సరఫరా గాని, లేదా పర్యావరణం గాని, లేదా రవాణా గాని, లేదా తక్కువ ఖర్చు లో గృహ‌ నిర్మాణం గాని, లేదా సురక్ష- భద్రత మరియు సార్వజనిక సేవలు గాని, లేదా జీవించడం లో నాణ్యత గాని మెరుగుపడింది అని, అలాగే ఆ ప్రాంతం లో ఆర్థిక సామర్థ్యం కూడా మెరుగైంది అని ఆయన వెల్లడించారు. సిల్ చర్ మరియు పరిసర ప్రాంతాల లో ప్రజల యొక్క జీవనం లో సౌలభ్యాన్ని పెంపొందింప చేస్తున్నటువంటి సిజిహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎమ్ జిఎస్ వై), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పిఎమ్ఎవై-జి) మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాల ను గురించి కూడా ఆయన వివరించారు.