రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిక్కిం ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

May 16th, 01:32 pm

సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సిక్కిం తన 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణం, ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో సిక్కిం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని, ప్రశంసనీయమైనదని ప్రధానమంత్రి కొనియాడారు. ఈ 50వ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఇటీవల తాను సిక్కింలో పర్యటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ... అక్కడి ప్రజలు చూపిన ఆప్యాయత, అభిమానం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని శ్రీ మోదీ అన్నారు.

గాంగ్‌టక్ ఆర్కిడేరియమ్‌ సందర్శన సందర్భంగా సిక్కిమ్‌ అసాధారణ జీవవైవిధ్యాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి

April 28th, 03:15 pm

సిక్కిమ్‌లోని గాంగ్‌టక్ లో ఉన్న ఆర్కిడేరియమ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. అక్కడి శోభతో పాటు, సిక్కిమ్‌లో అసాధారణ జీవవైవిధ్యాన్ని కూడా ఆయన ప్రశంసించారు.

సిక్కిం రాష్ట్ర 50వ ఆవిర్భావ వేడుకల ముగింపు సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 28th, 10:25 am

సిక్కిం గవర్నర్ శ్రీ ఓం మాథుర్, ప్రజలెన్నుకున్న, ఉత్సాహవంతుడైన యువకుడు, నా ప్రియ మిత్రుడైన ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, పార్లమెంటులో నా సహసభ్యులు శ్రీ దోర్జీ షెరింగ్ లెప్చా, డాక్టర్‌ ఇంద్ర హాంగ్ సుబ్బా, శ్రీ దిల్లీ రామ్ థాపా, రాష్ట్రంలోని నా ప్రియ సోదరీసోదరులారా!

PM Modi participates in the closing ceremony of Sikkim’s 50th Year of Statehood celebrations in Gangtok, Sikkim

April 28th, 10:15 am

Addressing the closing ceremony of Sikkim’s 50th Year of Statehood celebrations in Gangtok, Sikkim, PM Modi said the state exemplifies the spirit of ‘Ek Bharat, Shreshtha Bharat’. Highlighting tourism, sporting talent and the role of self-help groups in Sikkim, he termed the Northeast as India’s ‘Asht Lakshmi’ and called for collective efforts to accelerate Sikkim’s development and realise Viksit Bharat.

సిక్కిమ్ లోని గాంగ్‌టక్‌లో యువతతో ఫుట్‌బాల్ ఆటలో పాలుపంచుకున్న ప్రధానమంత్రి

April 28th, 09:46 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం సిక్కిమ్‌లోని గాంగ్‌టక్‌లో యువతీయువకులతో కలసి ఉత్సాహంగా ఫుట్‌బాల్ ఆటలో పాల్గొన్నారు.

గాంగ్‌టక్‌లో పద్మ పురస్కార విజేతలతో, ప్రముఖులతో ప్రధానమంత్రి భేటీ

April 28th, 07:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం సిక్కిమ్ ‌లోని గాంగ్‌టక్‌‌లో పర్యటించిన సందర్భంగా, పద్మ పురస్కార విజేతలతో పాటు వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అయ్యారు.

ఏప్రిల్ 27–28 తేదీల్లో సిక్కింలో ప్రధాని పర్యటన

April 26th, 03:47 pm

2026 ఏప్రిల్ 27, 28 తేదీల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సిక్కింలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 27న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన గ్యాంగ్‌టక్ చేరుకుంటారు. ఏప్రిల్ 28న ఉదయం దాదాపు 9:30 గంటలకు గ్యాంగ్‌టక్‌లోని ఆర్కిడేరియాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. సిక్కిం రాష్ట్ర పర్యావరణ, పుష్ప వైభవాన్ని చాటేలా.. అత్యాధునిక, ప్రపంచ స్థాయి ఆర్కిడ్ అనుభూతి కేంద్రంగా స్వర్ణజయంతి మైత్రీ మంజరి పార్కును అభివృద్ధి చేశారు.

మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ, డిజిటల్ సెన్సస్ 2027లో పాల్గొని దానిని విజయవంతం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

April 26th, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో, అణు, పవన విద్యుత్ రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భగవాన్ బుద్ధుని బోధనలు, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం, ప్రకృతి పరిరక్షణ, వెదురు రంగం, ప్రాచీన గ్రంథాలు, గణిత ఒలింపియాడ్ కార్యక్రమం వంటి పలు ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కొనసాగుతున్న డిజిటల్ సెన్సస్ ప్రచారం గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రిని కలిసిన సిక్కిం ముఖ్యమంత్రి

April 08th, 06:43 pm

సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ (గోలే) ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

“పరీక్షా పే చర్చా 2026” కార్యక్రమంలో విద్యార్థులతో ప్రధానమంత్రి మాటామంతీ

February 06th, 10:21 am

నా పేరు సాన్వి ఆచార్య, నేను గుజరాత్ నుంచి వచ్చాను. నా మొదటి ప్రశ్న: తల్లిదండ్రులు మా గురించి ఆందోళన చెందుతారు. ఉపాధ్యాయులు మాకు మద్దతు ఇస్తారు. కానీ చదివేందుకు ఉపాధ్యాయులు ఒక విధానాన్ని సూచించినప్పుడు, తల్లిదండ్రులు దానికి భిన్నమైన విధానాన్ని అనుసరించాలని పట్టుబడుతుంటారు. విద్యార్థులుగా మాలో మరో ధోరణి ఉంటుంది దీనితోనే అసలు సమస్య మొదలవుతుంది. ఆ సమయంలో ఏ నమూనా సరైనదో తెలియక మేం అయోమయంలో పడతాం

పరీక్షా పే చర్చ – 2026లో విద్యార్ధులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ

February 06th, 10:00 am

పరీక్షా పే చర్చ (పీపీసీ) 9వ సంచికలో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో విద్యార్థులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముచ్చటించారు.

ప్రధానమంత్రితో సిక్కిం గవర్నర్ భేటీ

November 04th, 01:33 pm

సిక్కిం గవర్నర్ శ్రీ ఓం ప్రకాశ్ మాథుర్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఈ రోజు న్యూఢిల్లీలో కలుసుకున్నారు.

Sikkim Chief Minister meets Prime Minister

October 06th, 05:41 pm

The Chief Minister of Sikkim, Shri Prem Singh Tamang met the Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

ప్రధానమంత్రితో సిక్కిం గవర్నర్ భేటీ

June 13th, 09:21 pm

సిక్కిం గవర్నర్ శ్రీ ఓం ప్రకాష్ మాథుర్ ఈరోజు దిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

సిక్కిం@50 కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం

May 29th, 10:00 am

సిక్కిం గవర్నరు శ్రీ ఒ.పి.ప్రకాశ్ మాథుర్ గారూ, ప్రియతమ ముఖ్యమంత్రీ నా మిత్రుడూ ప్రేమ్ సింగ్ తమాంగ్ గారూ, నా పార్లమెంటు సహచరులు డోర్జీ షెరింగ్ లెప్చా గారూ, డాక్టర్ ఇంద్రా హంగ్ సుబ్బా గారూ.. కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులందరూ, సోదరీ సోదరులారా!

‘సిక్కిం@50’ సంబరాల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

May 29th, 09:45 am

గ్యాంగ్‌టక్‌లో నేడు జరిగిన ‘సిక్కిం@50’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ‘లక్ష్యానికి తగిన పురోగతి, వృద్ధిని పెంపొందించే ప్రకృతి’ అన్న ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిక్కిం రాష్ట్ర అవతరణకు 50 ఏళ్లు పూర్తయిన ఈ ప్రత్యేకమైన రోజున ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆనందోత్సాహాలను ప్రత్యక్షంగా చూడాలనుకున్నప్పటికీ, ప్రతికూల వాతావరణం వల్ల కార్యక్రమానికి హాజరు కాలేకపోయానని చెప్పారు. త్వరలోనే సిక్కింలో పర్యటించి వారి విజయాలు, వేడుకల్లో భాగమవుతానని మాటిచ్చారు. గడిచిన 50 ఏళ్లలో వారు సాధించిన విజయాలను చాటే రోజుగా దీనిని ప్రధానమంత్రి అభివర్ణించారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని చిరస్మరణీయం చేయడంలో సిక్కిం ముఖ్యమంత్రి, ఆయన బృందం ఉత్సాహంతో వ్యవహరించారంటూ ప్రశంసించారు. సిక్కిం రాష్ట్ర అవతరణ స్వర్ణోత్సవ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ఆయన మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.

మే 29, 30లలో సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో పర్యటించనున్న ప్రధానమంత్రి

May 28th, 12:10 pm

ఈ నెల 29, 30 తేదీల్లో సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్‌లతో పాటు ఉత్తరప్రదేశ్‌లో కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.

25 మే 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 122 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

May 25th, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం... నేడు యావద్దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘటితమై ఉంది. ఆగ్రహంతో ఉంది. సంకల్పబద్ధంగా ఉంది. నేడు ప్రతి భారతీయుడి సంకల్పం ఉగ్రవాదాన్ని అంతం చేయడమే. మిత్రులారా! 'ఆపరేషన్ సిందూర్' సమయంలో మన సైన్యాలు చూపిన పరాక్రమం ప్రతి హిందుస్థానీ శిరస్సును ఉన్నతంగా నిలిపింది. సరిహద్దు దాటి, ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో మన సైన్యాలు చూపిన ఖచ్చితత్వం, స్పష్టత అద్భుతం. 'ఆపరేషన్ సిందూర్' ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి కొత్త నమ్మకాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది.

ప్రధానితో సిక్కిం ముఖ్యమంత్రి భేటీ

May 20th, 06:19 pm

సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

సిక్కిం 50 వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

May 16th, 10:13 am

సిక్కిం అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సిక్కిం రాష్ట్రంగా అవతరించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది మరింత ప్రత్యేకమైనది! ప్రకృతి రమణీయత, సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలు, కష్టపడే తత్వం ఉన్న ప్రజలతో కూడిన రాష్ట్రమే సిక్కిం’’ అని శ్రీ మోదీ అన్నారు.