Honouring the Sikh community’s faith and progress is our responsibility and privilege: PM on the 350th Shaheedi Samagam of Sri Guru Tegh Bahadur Ji

March 01st, 06:28 pm

PM Modi addressed the 350th Martyrdom Year (Shaheedi Samagam) of ‘Hind di Chadar’ Sri Guru Teg Bahadur Sahib Ji. Paying his respects, the PM stated that today we all remember the great Guru on this significant anniversary and expressed that it is a matter of great fortune to be part of such a historic and sacred event.

PM Modi addresses 350th Shaheedi Samagam of Sri Guru Teg Bahadur Ji; highlights initiatives for the Sikh community and social unity

March 01st, 06:00 pm

PM Modi addressed the 350th Martyrdom Year (Shaheedi Samagam) of ‘Hind di Chadar’ Sri Guru Teg Bahadur Sahib Ji. Paying his respects, the PM stated that today we all remember the great Guru on this significant anniversary and expressed that it is a matter of great fortune to be part of such a historic and sacred event.

పవిత్రమైన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా శ్రీ గురు గోవింద్ జీకి నివాళులర్పించిన ప్రధానమంత్రి

December 27th, 12:06 pm

ఇవాళ పవిత్రమైన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా శ్రీ గురు గోవింద్ జీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. గురు గోవింద్ జీ.. ధైర్యం, కరుణ, త్యాగానికి ప్రతీక అని శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. సత్యం, న్యాయం, ధర్మం కోసం నిలబడేందుకు, మానవాళి గౌరవాన్ని రక్షించేందుకు ఆయన జీవితం, బోధనలు స్ఫూర్తినిస్తాయి. శ్రీ గురు గోవింద్ సింగ్ దార్శనికత.. సేవ, నిస్వార్థ కర్తవ్యం వైపు తరతరాలను నడిపిస్తూనే ఉంటుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఢిల్లీలో వీరబాల దివస్ సందర్భంగా ప్రధాని ప్రసంగం

December 26th, 01:30 pm

దేశానికి గర్వకారణమైన వీర సాహిబ్‌జాదాలను ఈ రోజు మనం స్మరించుకుంటున్నాం. అజేయమైన భారత ధైర్యసాహసాలకు, వీరత్వానికి వారు ప్రతీకలు. వయస్సు, పరిస్థితుల పరిమితులను ఛేదించుకున్న ఈ సాహిబ్‌జాదాలు క్రూర మొఘల్ సామ్రాజ్యం ఎదుట కొండలా అడ్డు నిలిచారు. మతోన్మాదాన్నీ, ఉగ్ర మూలాలనూ పెకలించారు. ఇంతటి మహోజ్వల చరిత్ర ఉన్న, స్ఫూర్తిదాయకమైన ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఈ దేశ యువత సాధించలేనిదంటూ ఏమీలేదు.

న్యూఢిల్లీలో వీరబాల దివస్ కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

December 26th, 01:00 pm

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ‘వీరబాల దివస్’ సందర్భంగా ఈ రోజు నిర్వహించిన జాతీయ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన అతిథులకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి, అక్కడున్న పిల్లలనుద్దేశించి మాట్లాడారు. వీరబాల దివస్ ప్రాముఖ్యతను వారికి వివరించారు. ఈ సందర్భంగా కళాకారుల వందేమాతర ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. వారి అంకితభావం, కృషి ఆ ప్రదర్శనలో స్పష్టంగా కనిపించాయన్నారు.

శ్రీ గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

November 05th, 10:26 am

శ్రీ గురు నానక్ దేవ్ జీ ప్రకాష్ పురబ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ గురు నానక్ దేవ్ జీ జీవితం, సందేశం మానవాళిని అద్భుతమైన జ్ఞానంతో ముందుకు నడిపిస్తున్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. కరుణ, సమానత్వం, వినయం, సేవ గురించిన ఆయన బోధనలు అత్యంత స్ఫూర్తిదాయకం అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌లో ప్రధానమంత్రి ప్రార్థనలు

November 02nd, 10:10 pm

తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్‌లో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం ప్రార్థించారు..

అత్యంత పవిత్రమైన, అమూల్యమైన శ్రీ గురు గోవింద్ సింగ్, మాతా సాహిబ్ కౌర్‌ల ‘జోరే సాహిబ్’

September 19th, 04:28 pm

సిక్కు ప్రతినిధుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. అత్యంత పవిత్రమైన, అమూల్యమైన శ్రీ గురు గోవింద సింగ్, మాతా సాహిబ్ కౌర్‌ల ‘జోరే సాహిబ్’ సంరక్షణ, ప్రదర్శనపై ప్రతినిధులు అందించిన సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. ‘జోర్ సాహిబ్’ వంటి పవిత్ర స్మృతి చిహ్నాలు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనవనీ, విశేషమైన సిక్కు చరిత్రలో ఒక భాగమనీ, దేశ సంస్కృతికి మూలాలనీ పేర్కొన్నారు. ‘‘శ్రీ గురు గోవింద్ సింగ్ చూపిన ధైర్యం, ధర్మం, న్యాయం, సామాజిక సామరస్య మార్గాన్ని అనుసరించేలా భవిష్యత్ తరాలకు పవిత్రమైన ఈ స్మృతి చిహ్నాలు స్ఫూర్తినిస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

శ్రీ గురు గ్రంథ సాహెబ్‌ జీ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

August 24th, 01:02 pm

శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

పవిత్ర ప్రకాశ్ పురబ్ సందర్భంగా శ్రీ గురు తేగ్ బహదూర్‌కు ప్రధాని నివాళి

April 18th, 12:26 pm

పవిత్ర ప్రకాశ్ పురబ్ సందర్భంగా శ్రీ గురు తేగ్ బహదూర్ కు ప్రధానమంత్రి నేడు నివాళి అర్పించారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటంలో అచంచలంగా నిలిచిన శ్రీ గురు తేగ్ బహదూర్ జీవితం ధైర్యానికీ కరుణామయ సేవకూ ప్రతిరూపమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

గురుద్వారా రకాబ్ గంజ్‌ సాహిబ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్

March 17th, 10:26 pm

న్యూజిలాండ్ ప్రధాని శ్రీ క్రిస్టోఫర్ లక్సన్‌తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలోని గురుద్వారా రకాబ్ గంజ్ సాహిబ్‌ను సందర్శించారు. గురుద్వారా సందర్శనకు సంబంధించిన కొన్ని దృశ్యాలను శ్రీ మోదీ షేర్ చేస్తూ సేవ అన్నా, మానవీయ దృక్పథంతో నడుచుకోవడం అన్నా దృఢమైన కట్టుబాటును కలిగి ఉండే సిక్కు సముదాయం నిజంగా ప్రపంచమంతటా ప్రశంసాపాత్రమవుతోందన్నారు.

శ్రీ గురు గోవింద్ సింగ్ జీ కి ఆయన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు

January 06th, 09:33 am

శ్రీ గురు గోవింద్ సింగ్ జీ కి ఆయన ప్రకాశ్ ఉత్సవ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ఆలోచనలు ఒక ప్రగతిశీల, సమృద్ధిసహిత, కరుణామయ సమాజాన్ని నిర్మించడంలో మనకు ప్రేరణనిస్తాయని ప్రధాని అన్నారు.

మూడో వీర బాల దినోత్సవం సందర్భంగా 17 మంది రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో ప్రధాని సంభాషణ

December 26th, 09:55 pm

నేను మూడు పుస్తకాలు రాశాను. నాకు చదవడమంటే ఇష్టం.. అందుకే నేను పుస్తకాలు రాయడం మొదలుపెట్టాను. నాకో అరుదైన వ్యాధి ఉంది.. నేనింకో రెండేళ్లే జీవిస్తానని చెప్పారు. కానీ మా అమ్మ, మా అక్క, మా బడి... నేను పుస్తకాలు ప్రచురించే సంస్థల సహకారంతోనే నేనిప్పుడిలా ఉన్నాను.

రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో సంభాషించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

December 26th, 09:54 pm

ముఖాముఖి సందర్భంగా, పిల్లల నేపథ్యాలను విన్న ప్రధానమంత్రి.. జీవితంలో మరింత కృషిచేయాలంటూ వారిని ప్రోత్సహించారు. పుస్తకాలు రాసిన ఓ బాలికతో సంభాషించారు. తన పుస్తకాలకు ఎలాంటి స్పందన వచ్చిందో అడగగా.. మిగతా పిల్లలు కూడా సొంతంగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టారని ఆ బాలిక బదులిచ్చింది. ఇతర చిన్నారుల్లో కూడా ప్రేరణ కలిగించిన ఆ బాలికను శ్రీ మోదీ ప్రశంసించారు.

Our constitution embodies the Gurus’ message of Sarbat da Bhala—the welfare of all: PM Modi

December 26th, 12:05 pm

The Prime Minister, Shri Narendra Modi participated in Veer Baal Diwas today at Bharat Mandapam, New Delhi.Addressing the gathering on the occasion of the 3rd Veer Baal Diwas, he said their Government had started the Veer Baal diwas in memory of the unparalleled bravery and sacrifice of the Sahibzades.

న్యూఢిల్లీలో జరిగిన వీర బాల దివస్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

December 26th, 12:00 pm

ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన వీర బాల దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మూడో వీర బాల దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. సాహిబ్‌జాదాల అసమాన సాహసం, త్యాగాలకు గుర్తుగా వీర బాల దివస్‌ను తమ ప్రభుత్వం ప్రారంభించిందని తెలియజేశారు. కోట్లాది మంది భారతీయులకు జాతీయ స్ఫూర్తిని కలిగించే పండుగగా ఇది మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఉత్సవం చిన్నారులు, యువతలో ధైర్యాన్ని నింపుతోందని అన్నారు. సాహసం, ఆవిష్కరణలు, శాస్త్ర-సాంకేతికత, క్రీడలు, కళల్లో వీర బాల పురస్కారం అందుకున్న 17 మంది చిన్నారులను ప్రశంసించారు. ఈ దేశపు చిన్నారులు, వివిధ రంగాల్లో రాణించేలా యువతలో నిండిన సామర్థ్యాన్ని ఈ పురస్కారాలు తెలియజేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో గురువులు, వీర సాహిబ్‌జాదాలకు ప్రధానమంత్రి నివాళులు అర్పించారు. పురస్కార గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

శ్రీ గురు నానక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

November 15th, 08:44 am

ఈ రోజు శ్రీ గురు నానక్ జయంతి. ఈ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణ, దయ, వినయం.. ఈ భావనలను పెంపొందింప చేసుకోవడానికి మనకు శ్రీ గురు నానక్ దేవ్ జీ బోధనలు ప్రేరణను అందిస్తూనే ఉంటాయని ప్రధాని అన్నారు.

శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాశ్ పర్వ్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

September 04th, 03:00 pm

ఈ రోజు (బుధవారం) శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ తాలూకు ప్రకాశ్ పర్వ్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

సిఖ్కుల నూతన సంవత్సరం సందర్భం లో శుభాకాంక్షలను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

March 14th, 12:11 pm

సిఖ్కుల నూతన సంవత్సరాది ఈ రోజు న కావడం తో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రేమ పూర్వక శుభాకాంక్షల ను తెలియ జేశారు.

శ్రీ గురు గోవింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ ఉత్సవ్ సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి

January 17th, 08:13 am

శ్రీ గురు గోబింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ ఉత్సవ్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించడం తో పాటు గా ఆయన యొక్క ధైర్య సాహసాల ను మరియు కరుణ ను స్మరించుకొన్నారు. శ్రీ గురు గోబింద్ సింహ్ జీ ని గురించి న తన ఆలోచనల తో ఒక వీడియో ను కూడా ప్రధాన మంత్రి శేర్ చేశారు.