డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి... నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
July 06th, 12:21 pm
డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. దేశ నిర్మాణానికి కారకులైన ప్రముఖులలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఒకరని ప్రధాని గుర్తు చేసుకున్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రఖ్యాత విద్యావేత్త, దార్శనికత కలిగిన నేత అని, భారత్ ఏకత, గౌరవం, ప్రగతి కోసం జీవితాన్ని అంకితం చేశారని ప్రధానమంత్రి ప్రశంసించారు.ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకల త్రివిధ ప్రారంభోత్సవ వేడుకలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
June 21st, 12:51 pm
ఈ రోజు అనేక విధాలుగా ప్రత్యేకమైనది. యావత్ ప్రపంచమూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఇలాంటి విశిష్ట సందర్భంలో పవిత్ర బెంగాల్ భూమికి వచ్చే అవకాశం లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. భారత దేశ ఆలోచనలకు కొత్త దిశను అందించిన, భారత దేశ పునరుజ్జీవాన్ని వేగవంతం చేసిన, సముద్ర మార్గాల ద్వారా శతాబ్దాలుగా దేశాన్ని ప్రపంచంతో అనుసంధానించిన భూమి ఇది. ఈ రోజు ఇదే మట్టిపై ఆత్మనిర్భర్ భారత్, సురక్షిత భారత్, వికసిత భారత్ లక్ష్యాలతో ముడిపడి ఉన్న ఓ ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోంది. కొంతసేపటి క్రితమే ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టాం. జూన్ 21ని ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవంగా నిర్వహించుకోవడం యాదృచ్ఛికం. అదే రోజున భారతదేశపు అత్యంత అధునాతన హైడ్రోగ్రఫీ నౌక ఐఎన్ఎస్ సంశోధక్‌ను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టడం కాకతాళీయం. ఈ సందర్భంగా భారత నౌకాదళానికి, ఈ ప్రాజెక్టులకు పనిచేసిన శాస్త్రవేత్తలకూ, ఇంజనీర్లకూ, కార్మికులకూ, నా ప్రియమైన దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రే యుద్ధ నౌకలను నావికాదళంలోకి ప్రవేశపెట్టిన ప్రధాని
June 21st, 12:50 pm
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, నిర్మించిన మూడు యుద్ధనౌకలను అధికారికంగా నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. వీటిలో అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ 'ఐఎన్ఎస్ దూనగిరి', పెద్ద సర్వే నౌక 'ఐఎన్ఎస్ సంశోధక్’, జలాంతర్గామి నిరోధక నౌక 'ఐఎన్ఎస్ అగ్రే'లు ఉన్నాయి. ఈ నౌకల చేరిక భారత కార్యాచరణ సామర్థ్యాలను గణనీయంగా పెంచడమే కాకుండా సముద్రాలపై నిఘాను బలోపేతం చేస్తుంది. అలాగే భౌగోళిక రాజకీయ ముప్పుల నుంచి మన తీరప్రాంత జలాలకు రక్షణను మరింత పటిష్ఠం చేస్తుంది. ఈ మూడు నౌకలను భారత నావికాదళానికి చెందిన 'వార్‌షిప్ డిజైన్ బ్యూరో' రూపొందించగా కోల్‌కతాలోని 'గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఇంజనీర్స్' (జీఆర్ఎస్‌ఈ) సంస్థ నిర్మించింది. వీటి నిర్మాణంలో 200కు పైగా ఎంఎస్ఎంఈలతో కూడిన భారతీయ పరిశ్రమలు విస్తృతంగా భాగస్వామ్యమయ్యాయి. 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానం లేదా పరికరాలను కలిగి ఉన్న ఈ నౌకలు 'ఆత్మనిర్భరత' పట్ల భారత్‌కు ఉన్న నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి.టీఎంసీ కేవలం దూషిస్తుంది, బెదిరిస్తుంది, అబద్ధాలు ప్రచారం చేస్తుంది: పశ్చిమ బెంగాల్‌లోని బ్యారక్‌పూర్‌లో ప్రధాని మోదీ
April 27th, 12:00 pm
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశకు ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్యారక్‌పూర్‌లో జరిగిన భారీ సభలో ప్రసంగించి, తన శక్తివంతమైన, భావోద్వేగపూరిత ప్రసంగంతో జనసమూహంలో ఉత్సాహాన్ని నింపారు. చరిత్ర నుండి వర్తమానం వరకు ప్రస్తావిస్తూ, 1857 నాటి భారతదేశపు మొదటి స్వాతంత్ర్య యుద్ధానికి పుట్టినిల్లు అయిన బ్యారక్‌పూర్ వారసత్వాన్ని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు, దానిని మరోసారి మార్పుకు ప్రతీకగా నిలిపారు. బెంగాల్‌లో మార్పుకు బ్యారక్‌పూర్ మార్గం సుగమం చేస్తోంది అని ఆయన అన్నారు.ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగం బ్యారక్‌పూర్‌ను ఉత్తేజపరిచింది
April 27th, 11:30 am
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశకు ముందు, ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు బ్యారక్‌పూర్‌లో జరిగిన భారీ ర్యాలీలో ప్రసంగించి, తన శక్తివంతమైన, భావోద్వేగభరితమైన ప్రసంగంతో జనసమూహాన్ని ఉత్తేజపరిచారు. చరిత్ర నుండి వర్తమానం వరకు ప్రస్తావిస్తూ, 1857 నాటి భారతదేశపు మొదటి స్వాతంత్ర్య యుద్ధానికి పుట్టినిల్లు అయిన బ్యారక్‌పూర్ వారసత్వాన్ని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు, దానిని మరోసారి మార్పుకు ప్రతీకగా నిలబెట్టారు. బెంగాల్‌లో మార్పుకు బ్యారక్‌పూర్ మార్గం సుగమం చేస్తోంది అని ఆయన అన్నారు.