సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి, తయారీ విస్తరణకు ప్రేరణ కానున్న జీఎస్టీ సంస్కరణలు: ప్రధానమంత్రి

September 04th, 08:51 pm

ఉపాధి కల్పన, ఆవిష్కరణ, ఆర్థిక విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్న భారతదేశ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రుణ లభ్యతను సులభతరం చేయడానికి, మార్కెట్ అనుసంధానాలను విస్తరించడానికి, ఎంఎస్ఎంఈల నిర్వహణ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. తదుపరి తరం జీఎస్టీ చొరవ కింద కొత్త సంస్కరణలు ఈ ప్రయాణంలో గణనీయమైన ముందడుగును సూచిస్తాయి.