తన 100 ఏళ్ల ప్రస్థానంలో, ఎస్ఆర్సీసీ తరతరాలను తీర్చిదిద్ది, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించింది: ప్రధాని మోదీ
September 05th, 07:30 pm
శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్ఆర్సీసీ) శతాబ్ది ఉత్సవాల్లో, ప్రధాని మోదీ విధాన స్తబ్దత నుండి విధాన చైతన్యం వైపు భారతదేశం సాగించిన ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ, ఆర్థిక వృద్ధి, ఆర్థిక సమ్మిళితం, మేక్ ఇన్ ఇండియా, యువతకు పెరుగుతున్న అవకాశాలను ప్రముఖంగా పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయుల బలం, సంకల్పంతో నడిచే వికసిత, ఆత్మనిర్భర్ భారత్ కోసం ఒక ఉన్నతమైన దార్శనికతను కూడా ఆయన పంచుకున్నారు.శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 05th, 07:00 pm
శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, విధానపరమైన స్తబ్దత నుండి విధానపరమైన చైతన్యం వైపు భారతదేశం సాగించిన ప్రయాణాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్థిక వృద్ధి, ఆర్థిక సమ్మిళితం, మేక్ ఇన్ ఇండియా, యువతకు పెరుగుతున్న అవకాశాలు వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. 14 కోట్ల మంది భారతీయుల బలం, సంకల్పంతో నడిచే వికసిత, ఆత్మనిర్భర్ భారత్ కోసం తనకున్న ఉన్నతమైన దార్శనికతను కూడా ఆయన పంచుకున్నారు.శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ప్రధానమంత్రి ఈ నెల 5 నుంచి ఉత్సవాలు
September 04th, 05:35 pm
శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ నెల 5వ తేదీన సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.ప్రధానిని కలిసిన శ్రీరామ్ కామర్స్ కాలేజీ పాలక మండలి సభ్యులు
April 25th, 10:50 pm
శ్రీరామ్ కామర్స్ కాలేజీ పాలక మండలి సభ్యుల ప్రతినిధి బృందం ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసింది. విద్యాపరమైన ఉన్నతి, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతున్న సంస్థకు ఈ ఏడాదితో వందేళ్లు పూర్తవుతున్నాయనీ, సంస్థ విశిష్ట ప్రస్థానంలో ఇదొక కీలకమైన మైలురాయి అనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఉన్నత విద్యారంగానికి కళాశాల దీర్ఘకాలిక సేవలనూ, తరతరాలుగా విభిన్న రంగాల్లో నిపుణులను తీర్చిదిద్దడంలో సంస్థ పాత్రను ఆయన కొనియాడారు.