భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 23rd, 02:12 pm
ఈరోజు మనమందరం ఒక ప్రత్యేక సందర్భానికి సాక్షులుగా నిలుస్తున్నాం. భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి 200 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరుగుతున్న ఈ ద్విశతాబ్ది వేడుకలు మనందరికీ దక్కిన అదృష్టం. ఈ పవిత్ర మహోత్సవంలో మనమందరం భాగస్వాములవ్వడం విశేషం. ఈ పుణ్యకాలంలో నేను సాధువులందరికీ ప్రణామం చేస్తున్నాను. ఈ ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా భగవాన్ స్వామినారాయణ్ కోట్లాది మంది భక్తులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.శిక్షాపత్రి ద్విశతాబ్ది మహోత్సవం సందర్బంగా ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 23rd, 02:00 pm
శిక్షాపత్రి ద్విశతాబ్ది మహోత్సవం సందర్బంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సందేశాన్ని ఇవాళ వీడియో ద్వారా పంచుకున్నారు. భగవాన్ స్వామినారాయణ్ రచించిన శిక్షాపత్రి 200 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రత్యేక సందర్భానికి మనమంతా సాక్షులమని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ద్విశతాబ్ది వేడుకలు జరుపుకోవటం, ఈ పవిత్రమైన కార్యక్రమంలో భాగస్వాములు కావటం అందరికీ దక్కిన అదృష్టమన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో సాధువులకు శిరస్సు వంచి నమస్కరించిన ప్రధానమంత్రి శ్రీ మోదీ, ద్విశతాబ్ది వేడుకల సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ బోధనలను అనుసరిస్తున్న కోట్ల మంది భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
December 07th, 05:52 pm
పవిత్రమైన కార్యకర్ సువర్ణ మహోత్సవం సందర్భంగా, భగవాన్ స్వామి నారాయణుని పాదాలకు వినమ్రతతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గురు హరి ప్రగత్ బ్రహ్మ స్వరూపమైన ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి ఈ రోజు. ఆయనకు కూడా భక్తితో నమస్కరిస్తున్నాను. పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్ చేస్తున్న నిర్విరామ కృషి, అంకిత భావం ద్వారానే భగవాన్ స్వామి నారాయణుడి బోధనలు, ప్రముఖ్ స్వామి మహరాజ్ తీర్మానాలు ఈ రోజు నిజరూపం దాలుస్తున్నాయి. లక్ష మంది వాలంటీర్లు, యువత, చిన్నారులు భాగం పంచుకుంటున్న ఈ అద్బుతమైన సాంస్కృతిక కార్యక్రమం విత్తనం, చెట్టు, ఫలం అనే భావనను అందంగా సూచిస్తోంది. నేను అక్కడ ప్రత్యక్షంగా లేనప్పటికీ, ఈ కార్యక్రమ ఉత్సాహాన్ని, శక్తినీ నా హృదయం అనుభూతి చెందుతోంది. ఇంత గొప్ప దైవిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, మహనీయులైన సాధువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వినయంగా నమస్కరిస్తున్నాను.అహమదాబాద్ లో కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 07th, 05:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్‌లో ఏర్పాటైన కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మొదట పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, ఆరాధనీయులైన సాధు సంతులకు, సత్సంగి కుటుంబ సభ్యులకు, ఇతర ప్రముఖులకు, ప్రతినిధులకు స్వాగతం పలికారు. కార్యకర్ సువర్ణ మహోత్సవ్ సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ చరణాలకు శ్రీ మోదీ ప్రణామాన్ని ఆచరించారు. ఈ రోజు ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి సందర్భం కూడా అని ప్రధాని గుర్తుకు తీసుకువచ్చారు. భగవాన్ స్వామి నారాయణ్ ప్రబోధాలు, ప్రముఖ్ స్వామి మహారాజ్ సంకల్పాలు పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్ కఠోర శ్రమతో, అంకితభావం తో నెరవేరుతున్నాయని కూడా శ్రీ మోదీ అన్నారు. సుమారు ఒక లక్షమంది కార్యకర్తలతోపాటు యువతీయువకులు, బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇదెంత భారీ కార్యక్రమమో చెప్పకనే చెబుతోందని, దీనిని చూడడం తనకు సంతోషాన్నిస్తోందని శ్రీ మోదీ అన్నారు. తాను సభాస్థలిలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఈ కార్యక్రమంలో ఉత్సాహాతిరేకం ఏ స్థాయిలో వెల్లువెత్తుతోందీ తనకు తెలుస్తూనే ఉందన్నారు. పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, సాధువులందరికీ ఈ భవ్య దివ్య కార్యక్రమానికిగాను ఆయన తన అభినందనలను అందజేశారు.