2026-27 నుంచి 2030-31 కాలానికి 'చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టుల (ఎస్‌హెచ్‌పీ) అభివృద్ధి పథకానికి' కేబినెట్ ఆమోదం

March 18th, 04:12 pm

2026-27 నుంచి 2030-31 కాలానికి 'చిన్న నీటి విద్యుత్ (ఎస్‌హెచ్‌పీ) అభివృద్ధి పథకానికి' ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు 1500 మెగావాట్ల సామర్థ్యం గల చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ. 2584.60 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.