షోరింజన్ డారుమా-జీ ఆలయ ముఖ్య పూజారి రెవ్ సేషీ హిరోసే చేతుల మీదుగా డారుమా బొమ్మను అందుకున్న ప్రధానమంత్రి
August 29th, 04:29 pm
జపాన్‌లోని గున్మాలోని టకాసాకీ సిటీలోని షోరింజన్ డారుమా-జీ ఆలయ ముఖ్య పూజారి రెవ్ సేషీ హిరోసే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి డారుమా బొమ్మను బహుమతిగా ఈ రోజు అందజేశారు. ఈ బహుమతి భారత్‌కు, జపాన్‌కు మధ్య ఉన్న సన్నిహిత నాగరికత, ఆధ్యాత్మిక బంధాలకు ప్రతీకగా ఉంది.