జపాన్ మియాగి రాష్ట్రంలోని సెండాయ్‌లో ఉన్న సెమీకండక్టర్ కేంద్రాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి
August 30th, 11:52 am
జపాన్ ప్రధానమంత్రి శ్రీ షిగేరు ఇషిబాతో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జపాన్‌కు చెందిన మియాగి రాష్ట్రంలోని సెండాయ్‌లో పర్యటించారు. సెమీకండరక్టర్ రంగంలో ప్రముఖ జపాన్ కంపెనీ అయిన టోక్యో ఎలక్ట్రాన్ మియాగీ లిమిటెడ్‌ను (టీఈఎల్ మియాగీ) వారు సందర్శించారు. ప్రపంచ సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన విలువ గొలుసులో టీఈఎల్ పాత్ర, దాని అధునాతన తయారీ సామర్థ్యాలు.. భారత్‌తో ఆ కంపెనీ ప్రణాళికలో ఉన్న భాగస్వామ్యాల గురించి ప్రధాన మంత్రికి వివరించారు. సెమీకండక్టర్ రంగంలో సరఫరా వ్యవస్థ, తయారీ, పరీక్షలకు సంబంధించిన విభాగాల్లో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేందుకు రెండు దేశాల మధ్య ఉన్న అవకాశాల గురించి ఇరువురు నాయకులకు క్షేత్ర స్థాయి అవగాహనను ఈ సందర్శన కల్పించింది.జపాన్ రాష్ట్రాల గవర్నర్లతో సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 30th, 08:00 am
ఈ సమావేశ మందిరంలో నేను సైతామా నగర వేగాన్నీ, మియాగీ నగర స్థిరత్వాన్నీ, ఫుకోకా నగర చైతన్యాన్నీ, నారా పట్టణపు వారసత్వపు గొప్పతనాన్నీ అనుభూతి చెందుతున్నాను. కుమామోటో నగర వెచ్చదనం, నాగానో నగర తాజాదనం, షిజోకా సౌందర్యం, నాగసాకి ప్రాణనాడిని మీరు కలిగి ఉన్నారు. మీరంతా ఫ్యుజీ పర్వత బలాన్ని, సాకురా పూల మొక్క స్ఫూర్తినీ కలిగి ఉన్నారు. కలిసికట్టుగా మీరు జపాన్‌ను ఎల్లప్పుడూ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు.15th India-Japan Annual Summit Joint Statement: Partnership for Security and Prosperity of our Next Generation
August 29th, 07:06 pm
PM Modi and Japanese PM Ishiba held the delegation-level talks during which they recalled the longstanding friendship between India and Japan. The two Prime Ministers made a series of announcements focusing on three priority areas: bolstering defense and security cooperation, reinforcing economic partnership and deepening people-to-people exchanges.జపాన్ ప్రధానితో కలిసి భారత ప్రధాని సంయుక్త పత్రికా ప్రకటన
August 29th, 03:59 pm
ఈ రోజు మా చర్చ ఫలప్రదంగా, ప్రయోజనకరంగా సాగింది. రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా, శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా.. మన భాగస్వామ్యం ఈ రెండు దేశాలకే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వానికి కూడా చాలా ముఖ్యమైనదని మేమిద్దరం అంగీకరిస్తున్నాం.భారత్-జపాన్ ఆర్థిక ఫోరంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
August 29th, 11:20 am
ఈ ఫోరంలో చేరినందుకు ప్రధానమంత్రి ఇషిబాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన విలువైన ప్రసంగాన్ని అభినందిస్తున్నాను.భారత్- జపాన్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న ప్రధాని
August 29th, 11:02 am
భారత పరిశ్రమల సమాఖ్య, కీడాన్రెన్ (జపాన్ వాణిజ్య సమాఖ్య) టోక్యోలో 2025 ఆగస్టు 29న నిర్వహించిన భారత్ - జపాన్ ఎకనామిక్ ఫోరంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి శ్రీ షిగేరు ఇషిబా పాల్గొన్నారు. భారత్ -జపాన్ వాణిజ్యాధినేతల ఫోరం సీఈవోలు సహా భారత్, జపాన్ నుంచి పారిశ్రామిక ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.జపాన్‌లోని టోక్యోకు చేరుకున్న ప్రధాని మోదీ
August 29th, 06:43 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం జపాన్ చేరుకున్నారు. జపాన్‌లో ప్రధాని మోదీ 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. భారతదేశం & జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాన్ని ప్రధాని మోదీ మరియు జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా సమీక్షిస్తారు మరియు ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు.జపాన్, చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లే ముందు ప్రధాని ప్రకటన
August 28th, 08:40 pm
జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు, 15 వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆ దేశానికి వెళుతున్నాను.జపాన్ మరియు చైనాలలో ప్రధానమంత్రి పర్యటన
August 22nd, 06:15 pm
జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా మరియు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ 2025 ఆగస్టు 29–30 వరకు జపాన్‌లో మరియు 2025 ఆగస్టు 31–1 సెప్టెంబర్‌లో చైనాలో పర్యటిస్తారు. జపాన్‌లో, ప్రధాని 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు మరియు జపాన్ ప్రధాని ఇషిబాతో చర్చలు జరుపుతారు. చైనాలో, ప్రధాని టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు.జీ-7 సమావేశాల నేపథ్యంలో జపాన్ ప్రధానమంత్రితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 18th, 03:00 pm
జూన్ 17న కెనడా కననాస్కిస్ వేదికగా జరిగిన 51వ జీ-7 సమావేశాల నేపథ్యంలో, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని శ్రీ షిగేరు యిషిబాతో సమావేశమై లోతైన చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరిన్ని రంగాలకు విస్తరించాలన్న నిబద్ధతకు ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయని నేతలిద్దరూ పునరుద్ఘాటించారు.జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది
April 24th, 03:29 pm
2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో అమాయకుల ప్రాణాలు బలిగొంది, ప్రపంచ నాయకుల నుండి బలమైన సంఘీభావం లభించింది. ప్రపంచ మద్దతుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు, భారతదేశం ఉగ్రవాదులను మరియు వారి మద్దతుదారులను భూమి చివరల వరకు వెంబడిస్తుంది అని ప్రతిజ్ఞ చేశారు.