శ్రీ ప్రణబ్ ముఖర్జీతో నా అనుబంధాన్ని నేను ఎప్పటికీ నా మనసులో పదిలపరచుకొంటాను: ప్రధానమంత్రి

December 11th, 09:15 pm

శ్రీ ప్రణబ్ ముఖర్జీతో తన అనుబంధాన్ని తాను ఎప్పటికీ తన మనసులో పదిలంగా అట్టిపెట్టుకొంటానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. శ్రీ ప్రణబ్ ముఖర్జీతో తాను మాటామంతీ జరిపిన సందర్భాలకు చెందిన అనేక జ్ఞాపకాలను మరోసారి ముందుకు తెచ్చినందుకు శర్మిష్ఠ ముఖర్జీ గారికి శ్రీ మోదీ ధన్యవాదాలు తెలిపారు. శ్రీ ముఖర్జీకి ఉన్న లోతైన అవగాహన, జ్ఞానం సాటిలేనివంటూ శ్రీ మోదీ ప్రశంసించారు.

శర్మిష్ఠ ముఖర్జీగారి వద్ద నుండి ‘ప్రణబ్ మై ఫాదర్: ఎ డాటర్ రిమమ్‌బర్స్’పుస్తకం యొక్క ప్రతిని అందుకొన్న ప్రధాన మంత్రి

January 15th, 07:01 pm

పూర్వ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ యొక్క కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ గారు వ్రాసిన ‘ప్రణబ్ మై ఫాదర్: ఎ డాటర్ రిమెంబర్స్’ పుస్తకం యొక్క ప్రతి ని ఆమె ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి బహుమతి గా ఇచ్చారు.