కామన్వెల్త్ గేమ్స్-2026లో మహిళల షాట్‌పుట్ ఎఫ్-57 విభాగంలో స్వర్ణం సాధించిన షర్మిలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
July 28th, 02:05 pm
2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ మహిళల షాట్‌పుట్ ఎఫ్-57 విభాగంలో స్వర్ణ పతకం సాధించిన షర్మిలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. షాట్‌పుట్ పరంగా ఈ సీజన్‌లో ఆమె అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందని ప్రధానమంత్రి అన్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పారా అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం కోసం రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని పేర్కొన్నారు.