ఎకనామిక్ రోడ్‌మ్యాప్ వాణిజ్య సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
July 09th, 06:15 am
ఇప్పుడు ఈ సరికొత్త మార్గం ద్వారా పెట్టుబడులు, ఆవిష్కరణలు వృద్ధి చెందుతాయి. ఈ భాగస్వామ్యాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైనే ఉంది.Prime Minister addresses Australia-India CEOs Forum and Economic Roadmap Business event
July 09th, 06:00 am
PM Modi participated in the Australia-India CEOs Forum and the Economic Roadmap Business event in Melbourne. Addressing the CEOs Forum, he highlighted India's strong economic growth, policy reforms, digital transformation and expanding innovation ecosystem. Addressing the Economic Roadmap Business event, he expressed satisfaction at the growth of trade and investment ties based on ECTA and called for early conclusion of the proposed CECA.ఫ్రాన్స్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి అధికారిక చర్చలు
June 14th, 08:37 pm
జూన్ 14, 2026న నీస్‌లోని విల్లా కెరిలోస్ వద్ద ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్-ఫ్రాన్స్ సంబంధాలను విశిష్టమైన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చిన తర్వాత ఇరువురు నేతల మధ్య జరిగిన తొలి సమావేశమిది.‘వికసిత భారత్ యువ సారథుల చర్చాగోష్ఠి-2026’ ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 12th, 06:45 pm
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు, ఎంపీలు, వికసిత భారత్ యువ సారథుల పోటీ విజేతలు, ఇతర ప్రముఖులు, దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి హాజరైన నా యువ మిత్రులందరూ ఇక్కడ ఓ కొత్త అనుభూతిని పొంది ఉంటారు. మీరంతా అలసిపోలేదా? ఇప్పటికి రెండు రోజుల నుంచి అదేపనిగా ప్రసంగాలు వింటూనే ఉన్న మీకు మరోసారి వినడం అలసట అనిపిస్తోందా? ఏదేమైనా, పత్రికా సమావేశం సందర్భంగా నేను చెప్పాల్సిందేమిటో ఇప్పటికే చెప్పేశాను. నేను తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి మీలో చాలామంది పుట్టి కూడా ఉండరని నేను అనుకుంటున్నా. ఇక 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి మీలో అధికశాతం ఇంకా పిల్లలుగానే ఉండి ఉంటారు. అయితే, ముఖ్యమంత్రిగా లేదా ఇవాళ ప్రధానమంత్రిగా యువతరంపై నాకు సదా అపారమైన నమ్మకం. మీ సామర్థ్యం, ప్రతిభ నుంచి నాకెప్పుడూ నవ్యోత్తేజం లభిస్తూంటుంది. ఈ నేపథ్యంలో వికసిత భారత్ స్వప్న సాకార సారథ్యం బాధ్యతను మీరు స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నా.‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చావేదిక - 2026’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 12th, 06:30 pm
న్యూఢిల్లీలో ‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చావేదిక - 2026’ ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. శ్రీ మోదీ ప్రసంగిస్తూ, తాను ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, నేటి యువ పౌరులలో చాలా మంది ఇంకా పుట్టలేదని, అలాగే, 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, వారిలో ఎక్కువ మంది చిన్న పిల్లలుగానే ఉన్నారని తెలిపారు. గడచిన కాలంతో నిమిత్తం లేకుండా యువతరంపై తన నమ్మకం స్థిరంగా, అచంచలంగా ఉందని ఆయన చెప్పారు. “మీ సామర్థ్యం, మీ ప్రతిభ, మీ బలం నుంచే నేను ఎల్లప్పుడూ శక్తిని పొందాను. ఈ రోజు మీరందరూ అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధన పగ్గాలను చేతబట్టారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.‘వైబ్రంట్ గుజరాత్’ కచ్.. సౌరాష్ట్ర ప్రాంతీయ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 11th, 02:45 pm
గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాననీయులు, పారిశ్రామిక ప్రతినిధులు, విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టితో రాజ్‌కోట్‌లో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 11th, 02:30 pm
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం ఏర్పాటు చేసిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ మోదీ మాట్లాడుతూ, 2026 ప్రారంభం తర్వాత తాను మొదటిసారి గుజరాత్‌కు వచ్చానని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం తాను సోమనాథుని దివ్య దర్శనం చేసుకున్నానని, ఇప్పుడు రాజ్‌కోట్‌లో జరుగుతున్న ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్నానని ఆయన అన్నారు. “వికాస్ భీ, విరాసత్ భీ” (అభివృద్ధి - వారసత్వం) మంత్రం ప్రతిచోటా ప్రతిధ్వనిస్తోందని ఆయన అన్నారు. వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సుకు దేశం నలుమూలల నుంచి, ప్రపంచం లోని ఇతర ప్రాంతాల వచ్చిన అందరికీ ప్రధానమంత్రి స్వాగతం పలికారు. శుభాకాంక్షలు తెలిపారు.శాంతి బిల్లుకు పార్లమెంటు ఆమోదం.. ప్రధానమంత్రి హర్షం
December 18th, 09:47 pm
శాంతి బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాంకేతిక విజ్ఞాన రంగ రూపురేఖలను మార్చివేసే సందర్భమిది అని ఆయన వ్యాఖ్యానించారు.