ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనమిక్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 14th, 01:25 pm
ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, కార్యశీలుడైన ప్రజాదరణగల యువ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ నితిన్ గడ్కరీ, శ్రీ అజయ్ టమ్టా, సాంకేతిక మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శ్రీ మహేంద్ర భట్ సహా వేదికను అలంకరించిన మాజీ గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ, మాజీ ముఖ్యమంత్రులైన సోదరులు శ్రీ రమేష్ పోఖ్రియాల్, శ్రీ విజయ్ బహుగుణ, శ్రీ తీరథ్ సింగ్ రావత్, శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరాఖండ్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు భారీ సంఖ్యలో హాజరైన నా ప్రియ సోదరీసోదరులందరికీ అభివందనం.ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
April 14th, 01:20 pm
ఢిల్లీ - డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్, చుట్టుపక్కల ప్రాంత అభివృద్ధిలో కీలక ఘట్టమిది. డెహ్రాడూన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. బైశాఖి, బోహాగ్ బిహు, పుతాండు పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా పండుగ శోభ నెలకొన్న వేళ ఈ ప్రారంభోత్సవం జరుగుతోందన్నారు.ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
December 04th, 12:35 pm
ఉత్తరాఖండ్‌లోని గౌరవనీయులైన పెద్దలు, సోదరీమణులు, అక్కాచెల్లెళ్లు, సోదరులు మరియు సోదరీమణులందరికీ నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. మీరు కుశలమని ఆశిస్తున్నాను. దయచేసి నా శుభాకాంక్షలను అంగీకరించండి.డెహ్రాడూన్‌లో దాదాపు 18,000 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన - ప్రధాన మంత్రి
December 04th, 12:34 pm
ఈ ప్రాంతంలో దీర్ఘకాలికంగా నెలకొన్న కొండచరియల సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రయాణాన్ని సురక్షితం చేయడంపై దృష్టి సారించే ఏడు ప్రాజెక్టులను; దేవప్రయాగ నుండి శ్రీకోట్ వరకు అదేవిధంగా జాతీయ రహదారి ఎన్.హెచ్-58 పై బ్రహ్మపురి నుంచి కొడియాల వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టులు; యమునా నదిపై నిర్మించిన 120 మెగా వాట్ల వ్యాసి జల విద్యుత్ ప్రాజెక్టు; డెహ్రాడూన్ లో హిమాలయ సాంస్కృతిక కేంద్రం; డెహ్రాడూన్‌లో స్టేట్ ఆఫ్ ఆర్ట్ పెర్ఫ్యూమరీ అండ్ అరోమా లాబొరేటరీ (సుగంధ మొక్కల కేంద్రం) ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.డిసెంబర్4న దేహ్ రాదూన్ లో అనేక పథకాల ను ప్రారంభించడం తో పాటు మరికొన్నిపథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్న ప్రధాన మంత్రి; ఈ పథకాల విలువ సుమారు 18,000 కోట్ల రూపాయలు
December 01st, 12:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 4 వ తేదీ న మధ్యాహ్నం ఒంటి గంట వేళ లో దేహ్ రాదూన్ లో పర్యటించనున్నారు. దాదాపు గా 18,000 కోట్ల రూపాయల వ్యయం కలిగిన పలు ప్రాజెక్టుల లో కొన్నిటిని ఆయన ప్రారంభించి మరి కొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమైన రహదారుల కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన ను మెరుగు పరచడం పై ఈ పర్యటన కాలం లో శ్రద్ధ తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు లు ప్రయాణాన్ని సాఫీ గా, సురక్షితం గా మలచగలవు. అంతేకాదు, ఈ ప్రాంతం లో పర్యటన అవకాశాల ను కూడా పెంచగలవు. ఒకప్పుడు చేరుకోవడం కష్టం అని భావించిన మారుమూల ప్రాంతాల కు సంధానం సౌకర్యాన్ని పెంచాలన్న మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా ఈ ప్రాజెక్టు లు ఉన్నాయి.