The trust of 140 crore Indians is our greatest strength and responsibility: PM Modi at the NDA Leaders’ Conclave
June 10th, 06:33 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.PM Modi addresses NDA Leaders' Conclave, reaffirms commitment to Viksit Bharat
June 10th, 06:30 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.రోజ్‌గార్ మేళా ద్వారా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 23rd, 11:15 am
దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువతీ యువకులకు నేడు చాలా ముఖ్యమైన రోజు. 51,000 కంటే ఎక్కువ మంది యువత నేడు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందుకున్నారు. మీరు దేశ అభివృద్ధి ప్రయాణంలో అత్యంత కీలకమైన, బాధ్యతాయుతమైన భాగస్వాములుగా మారుతున్నారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య, ఇతర అనేక రంగాల్లో సరికొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రాబోయే సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని నెరవేర్చడంలో మీరే కీలక పాత్ర పోషిస్తారు.రోజ్‌గార్ మేళా ద్వారా ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 23rd, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 19వ రోజ్‌గార్ మేళా (ఉగ్యోగ మేళా)లో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది యువతీ యువకులకు ఇది అత్యంత ముఖ్యమైన రోజు అని అభివర్ణించారు. ప్రభుత్వ సేవలోకి కొత్తగా అడుగుపెడుతున్న వారికి స్వాగతం పలుకుతూ.. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య వంటి రంగాలతో సహా పలు రంగాల్లో దేశ అభివృద్ధికి వారు అందించబోయే కీలక సహకారాన్ని ప్రస్తావించారు. ‘‘రాబోయే సంవత్సరాల్లో వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో మీరందరూ కీలక పాత్ర పోషిస్తారు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.భారత -ఇటలీ దేశాల ఉమ్మడి ప్రకటన
May 20th, 10:28 pm
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మే 19-20 తేదీల్లో ఇటలీలో అధికారిక పర్యటన చేపట్టారు. 2024 జూన్‌లో జీ7 సదస్సు సందర్భంగా ఇటలీలో ప్రధాని మోదీ పర్యటన, 2023లో జీ20 సదస్సు సందర్భంగా భారతదేశంలో ప్రధాని మెలోనీ పర్యటనల అనంతరం జరిగిన ఈ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్-ఇటలీ సంబంధాలను 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
May 18th, 05:00 am
ముందుగా, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నన్ను ఆహ్వానించిన ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్‌సన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సమావేశం గోథెన్‌బర్గ్‌లో జరగడం నాకు సంతోషంగా ఉంది. ఈ నగరం ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందినది. ఈ నగరం యూరప్ తయారీ రంగ స్ఫూర్తికి చిహ్నంగానూ నిలుస్తుంది.అనువాదం: ‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ సమావేశంలో ప్రధానమంత్రి మీడియా ప్రకటన
May 17th, 11:43 pm
కొద్దిసేపటి క్రితమే స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారమైన 'రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్'తో నన్ను గౌరవించారు. ఈ గౌరవం కేవలం నాది మాత్రమే కాదు.. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం.. భారత్-స్వీడన్ సంబంధాలను మరింత సుసంపన్నం చేసి వాటికి బలమైన పునాదిని వేసిన స్వీడన్‌లోని మన మిత్రులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.ఎంపిక చేసిన స్వీడన్ వ్యాపార దిగ్గజాలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ భేటీ
May 17th, 11:16 pm
భారత్, స్వీడన్ దేశాలు ప్రజాస్వామ్యం, పారదర్శకత, ఆవిష్కరణలు, సుస్థిరత వంటి ఉమ్మడి విలువల ద్వారా అనుసంధానమయ్యాయని, ఇవి ఉన్నత లక్ష్యాలను కలిగి భవిష్యత్ ఆధారిత ఆర్థిక భాగస్వామ్యానికి బలమైన పునాదిని అందిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేడు భారత్, స్వీడన్ భాగస్వామ్యం కేవలం ఒక ఆర్థిక సంబంధం మాత్రమే కాదని, అది ఆలోచనలు, సాంకేతికత, ఆవిష్కరణలు, సహ సృష్టి ల భాగస్వామ్యమని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు. భారతదేశ వృద్ధికి స్వీడిష్ కంపెనీలు సుదీర్ఘకాలంగా అందిస్తున్న సహకారాన్ని ఆయన స్వాగతించారు. పరిశోధన, ఆవిష్కరణలు, ఇంధన మార్పు, తయారీ ఉత్పాదక రంగాలలో మరింత లోతైన సహకారాన్ని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.భారత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా రెండు దేశాల సంయుక్త ప్రకటన
May 17th, 03:45 am
నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రాబ్ జెటెన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 16-17 తేదీలలో ఆ దేశంలో పర్యటించారు. శ్రీ మోదీ నెదర్లాండ్స్‌లో పర్యటించడం ఇది రెండోసారి.భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక [2026-2030]
May 17th, 03:15 am
2026 మే 16న హేగ్ నగరంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ రాబ్ జెట్టెన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిర్దిష్ట లక్ష్యాలు, కాలపరిమితితో కూడిన కార్యక్రమాలు, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికల ద్వారా భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచేందుకు ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు. ఈ లక్ష్య సాధన కోసం రాబోయే 5 సంవత్సరాల కాలానికి (2026-2030) ‘భారత్-నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళిక’ను ఇరు దేశాలు ఆమోదించాయి.‘యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ’ని (ఈఆర్‌టీ) ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి
May 17th, 12:12 am
గోథెన్‌బర్గ్‌లో 2026 మే 17న నిర్వహించిన 'యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ' (ఈఆర్‌టీ) సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. వోల్వో గ్రూప్ నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి చర్చా కార్యక్రమంలో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టెర్సన్, ఐరోపా కమిషన్ అధ్యక్షులు శ్రీమతి ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఐరోపాకు చెందిన సీనియర్ పారిశ్రామిక ప్రముఖులు, ప్రముఖ యూరోపియన్- భారతీయ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.సెమీకండక్టర్ల తయారీకి సంబంధించిన ఒప్పందంపై ప్రధానమంత్రి మోదీ సమక్షంలో సంతకాలు చేసిన ఏఎస్ఎంఎల్, టాటా ఎలక్ట్రానిక్స్
May 16th, 10:30 pm
గుజరాత్‌లోని ధోలేరాలో సెమీకండక్టర్ ఫ్యాబ్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై టాటా ఎలక్ట్రానిక్స్, ఏఎస్ఎంఎల్‌లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ రాబ్ జెట్టెన్ సమక్షంలో సంతకాలు చేశాయి.డచ్ ‘సీఈవో’లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశం
May 16th, 10:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రోబ్ జెట్టెన్‌తో సంయుక్తంగా ఆ దేశంలోని వివిధ కంపెనీల ముఖ్య కార్యనిర్వహణాధికారుల (సీఈవో)తో సమావేశమయ్యారు. ఇంధనం, ఓడరేవులు, ఆరోగ్యం, వ్యవసాయం, వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం వంటి పలు రంగాల్లోని ప్రసిద్ధ కంపెనీల ‘సీఈవో’లతో అనేక అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా సెమీకండక్టర్లు, సాంకేతికత-ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, రవాణా, సముద్ర రంగం, సుస్థిరత, ఇంధనం, వ్యవసాయ రంగాలపై తమ ఆలోచనలను పంచుకుంటూ, భారత్‌కు సంబంధించి తమ వ్యాపార వ్యూహాలను వివరించారు.నెదర్లాండ్స్‌లో సీఈవోల రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ప్రధాని ప్రసంగం
May 16th, 10:00 pm
ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలకు నిలయాలైన కొన్ని కంపెనీల అధినేతల నడుమ ఈ రోజు ఇక్కడుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు 300కు పైగా డచ్ కంపెనీలు భారత్ ప్రస్థానంలో భాగమయ్యాయి. భారత్ పట్ల మీకున్న సానుకూల దృక్పథం, విశ్వాసం వల్లే.. ఐరోపా నుంచి భారత్‌లో అతిపెద్ద పెట్టుబడిదారుగా, రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నెదర్లాండ్స్ నిలిచింది.నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ - అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ప్రధానమంత్రి
May 16th, 08:13 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హేగ్‌లోని ప్యాలెస్ హౌస్ టెన్ బాష్‌లో నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ - అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.నెదర్లాండ్స్‌లో ప్రవాస భారతీయుల కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
May 16th, 01:30 pm
ఇంతటి అపారమైన ఆదరాభిమానాలు.. ఇంతటి అద్భుతమైన ఉత్సాహం. నిజం చెప్పాలంటే ఒక్క క్షణం నేను నెదర్లాండ్స్‌లో ఉన్నాననే విషయమే మర్చిపోయాను. భారత్‌లోనే ఎక్కడో ఒక పెద్ద పండుగ జరుగుతున్నట్లు అనిపిస్తోంది.నెదర్లాండ్స్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
May 16th, 01:20 pm
నేడు నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా అక్కడకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు, భారతీయ మిత్రులు ఆయనకు ఎంతో ఉత్సాహంగా, ఘన స్వాగతం పలికారు.ప్రధానమంత్రి యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటన (మే 15 - 20, 2026)
May 11th, 09:00 pm
ప్రధానమంత్రి మోదీ మే 15 నుండి మే 20, 2026 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కలిసి వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. నెదర్లాండ్స్‌లో, ప్రధానమంత్రి మోదీ రాజు విల్లెం-అలెగ్జాండర్‌ను కలిసి, ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో, ఆయన ప్రధానమంత్రి క్రిస్టర్‌సన్‌తో చర్చలు జరుపుతారు. నార్వేలో, ఆయన రాజు హెరాల్డ్ Vను కలిసి, ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం, ఆయన ఇటలీని సందర్శించి ప్రధానమంత్రి జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు.గుజరాత్‌లోని వడోదరాలో సర్దార్‌ధామ్ హాస్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా పీఎం ప్రసంగం
May 11th, 06:15 pm
ప్రజాదరణ పొందిన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి, కేంద్రమంత్రి, వ్యవస్థాపక ట్రస్టీ మన్‌సుఖ్ మాండవీయ, సర్దార్‌ధామ్ అధ్యక్షుడు గగ్జీ భాయ్ సుతారియా, దుష్యంత్ భాయ్ పటేల్, పంకజ్ భాయ్ పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జగదీశ్ విశ్వకర్మ, వేదికపైనున్న గుజరాత్ మంత్రులు, దాతలు, ట్రస్టీలు, విశిష్ట అతిథులు, గుజరాత్ నలుమూలల నుంచి విచ్చేసిన నా ప్రియమైన సోదరీసోదరులందరికీ నమస్కారం.గుజరాత్‌లోని వడోదరలో సర్దార్ ధామ్ వసతి గృహాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 11th, 06:00 pm
గుజరాత్‌లోని వడోదరలో సర్దార్ ధామ్ వసతి గృహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. వడోదరలోని సర్దార్ ధామ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సోమనాథ్ ఆలయ 75వ ప్రతిష్ఠాపన వార్షికోత్సవాలను నిర్వహించుకొంటున్న రోజునే విద్యా సంస్థల ప్రారంభోత్సవం, ఆధ్యాత్మిక స్మరణ జరగడం శుభపరిణామన్నారు. డాక్టర్ దుష్యంత్, దక్ష్ పటేల్ భవన సముదాయాన్ని, బోధనా సహాయక పథకాన్ని ప్రారంభించారు. వివిధ విద్యా సంబంధమైన ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. వీటిన్నింటినీ భవిష్యత్తులో యువతకు అవకాశాన్ని కల్పించే వేదికలుగా వర్ణించారు. ‘‘కొన్ని గంటల క్రితమే, ప్రభాస్ పటాన్‌లో సోమనాథ్ అమృత మహోత్సవాల్లో నేను పాల్గొన్నాను. ఇక్కడ పరివర్తనాత్మక విద్యా సంస్థలను ప్రారంభించుకుంటున్నాం. చారిత్రక వారసత్వం, ప్రగతి రెండూ కలసి ముందుకు సాగుతాయనడానికి ఇదే నిదర్శనం’’ అని శ్రీ మోదీ అన్నారు.