సర్ శివూసాగర్ రాం గులామ్, సర్ అనిరుద్ధ్ జగన్నాథ్ సమాధుల వద్ద ప్రధానమంత్రి పుష్పాంజలి
March 11th, 03:04 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పేంప్లేముసెస్‌లోని సర్ శివూసాగర్ రాంగులామ్ బొటానిక్ గార్డెన్స్‌లో సర్ శివూసాగర్ రాంగులామ్, సర్ అనిరుద్ధ్ జగన్నాథ్‌ల సమాధులను సందర్శించి శ్రద్ధాంజలి సమర్పించారు. పుష్పాంజలి కార్యక్రమంలో ప్రధానిని... మారిషస్ ప్రధానమంత్రి శ్రీ నవీన్‌చంద్ర రాంగులామ్ అనుసరించారు. మారిషస్ ప్రగతిలోనూ, భారత్-మారిషస్ సంబంధాలకు బలమైన పునాదిని వేయడంలోనూ ఈ ఇద్దరు నేతల సుదీర్ఘ వారసత్వాన్ని ప్రధాని శ్రీ మోదీ ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకొన్నారు.