ఎస్‌సీవో సదస్సులో ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం

September 01st, 01:58 pm

కిర్గిజ్‌ రిపబ్లిక్‌ రాజధాని బిష్కెక్‌లో ఆగస్టు 31-సెప్టెంబరు 1 తేదీల్లో నిర్వహించిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) దేశాధినేతల మండలి 26వ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు.

బిష్కెక్‌లో ‘ఎస్‌సీఓ’ దేశాధినేతల మండలి 26వ సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

September 01st, 01:33 pm

కిర్గిజ్‌ రిపబ్లిక్‌ రాజధాని బిష్కెక్‌లో ఆగస్టు 31-సెప్టెంబరు 1 తేదీల్లో నిర్వహించిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) దేశాధినేతల మండలి 26వ సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు-విభాగాల కార్యదర్శులతో ప్రధానమంత్రి అధ్యక్షతన 3వ అత్యున్నత స్థాయి సమావేశం

August 20th, 09:37 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం తన అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వంలోని భారత ప్రభుత్వ కార్యదర్శులతో 3వ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, అనుసంధానం, భద్రత, విదేశీ వ్యవహారాలు, పరిపాలన సంబంధ వ్యవహారాలపై వారితో చర్చించారు. న్యూఢిల్లీలోని నం.7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోగల అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొన్న ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాల కార్యదర్శులతో భవిష్యత్ కార్యాచరణపై ఆయన కూలంకషంగా సమీక్షించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జపాన్‌ రక్షణ మంత్రి భేటీ

August 20th, 09:04 pm

భారత్‌లో అధికారిక పర్యటన సందర్భంగా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జపాన్‌ రక్షణశాఖ మంత్రి షింజిరో కొయిజుమి సమావేశమయ్యారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాంగణం నుండి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు

August 15th, 04:44 pm

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈరోజు ఎర్రకోట ప్రాంగణం నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో, గత 12 సంవత్సరాలుగా తయారీ రంగం, డిజిటల్ వృద్ధి మరియు పౌర సేవల రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతికి సంబంధించిన వివరణాత్మక నివేదికను ఆయన సమర్పించారు. జాతీయ ఆశయాలను సాధించడం కోసం ఏడు కీలక రంగాలతో కూడిన పరివర్తనాత్మక సప్తధారను కూడా ఆయన ఆవిష్కరించారు.

12 ఏళ్ల పరివర్తన: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భారత ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి

August 15th, 01:18 pm

స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత 12 ఏళ్లలో భారత్ సాధించిన పరివర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. తయారీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సదుపాయాలు, ఇంధన భద్రత, యువత సాధికారత, ఆవిష్కరణలు, సామాజిక భద్రత, ఇతర కీలక రంగాల్లో దేశం సాధించిన పురోగతిని వివరించారు.

అమెరికా ఉపాధ్యక్షుడి నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి టెలిఫోన్ కాల్

August 08th, 10:58 pm

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అమెరికా ఉపాధ్యక్షుడు శ్రీ జె.డి. వాన్స్ నుంచి టెలిఫోన్ కాల్ అందుకున్నారు.

అభివృద్ధి చెందిన భారతదేశానికి వృద్ధి చోదకంగా మారే సత్తా ఆంధ్రప్రదేశ్‌కు ఉంది: ప్రధాని మోదీ

August 01st, 11:45 am

వికసిత భారత్‌కు వృద్ధి చోదకంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవిస్తున్న తీరును హైలైట్ చేస్తూ, ప్రధాని మోదీ సుమారు ₹18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, రాష్ట్రానికి అంకితం చేశారు. ప్రపంచ స్థాయి కనెక్టివిటీ, లాజిస్టిక్స్ నుండి సెమీకండక్టర్లు, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల వరకు ఉద్యోగాలను సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేయడం వంటి అంశాలపై ప్రధాని మోదీ తన దార్శనికతను వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో ₹17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ

August 01st, 11:30 am

వికసిత భారత్‌కు వృద్ధి చోదకంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవిస్తున్న విషయాన్ని హైలైట్ చేస్తూ, ప్రధాని మోదీ సుమారు ₹18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, రాష్ట్రానికి అంకితం చేశారు. ప్రపంచ స్థాయి కనెక్టివిటీ, లాజిస్టిక్స్ నుండి సెమీకండక్టర్లు, ఏఐ, గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల వరకు ఉద్యోగాలను సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేయడం వంటి అంశాలపై ప్రధాని మోదీ తన దార్శనికతను వివరించారు.

భారత ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని రెండో ఉన్నత స్థాయి సమావేశం

July 28th, 08:48 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో భారత ప్రభుత్వ కార్యదర్శులతో రెండో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాలు, వాణిజ్యం - పరిశ్రమలు, సాంకేతిక రంగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, విభాగాల భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రధానమంత్రి సమీక్షించారు. వికసిత భారత్ లక్ష్యాల సాధన దిశగా పురోగతిని వేగవంతం చేయడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

ప్రకృతి పరిరక్షణ, గౌరవించడంలో మానవ సంక్షేమం: ప్రధానమంత్రి

July 28th, 07:48 am

ప్రకృతిని రక్షించడంతో పాటు గౌరవించడంలో మానవాళి సంక్షేమం ఇమిడి ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ ధర్మసమ్మత జీవన మార్గాన్ని అనుసరించడమే కాకుండా, ప్రకృతితో సద్భావనను కలిగివుంటూ మనుగడ సాగించే స్ఫూర్తిని భారత్ అనాదిగా పాటిస్తున్న సంప్రదాయాలు కూడా మనకు అందిస్తున్నాయని ఆయన అన్నారు.

న్యూజిలాండ్ ప్రధానితో సమావేశమైన ప్రధానమంత్రి

July 11th, 08:09 am

ఆక్లాండ్‌లోని గవర్నమెంట్ హౌస్‌లో న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ రోజు గవర్నమెంట్ హౌస్‌కు విచ్చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి సాంప్రదాయిక మావోరీ స్వాగతం లభించింది. ఈ వేడుకలో శాంతి, గౌరవం, స్వాగతానికి ప్రతీకగా నిలిచే సాంప్రదాయిక మావోరీ ఆచారాలను ప్రదర్శించారు. సాంప్రదాయిక స్వాగతం అనంతరం, ప్రధానమంత్రి ఆ దేశ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం: భవిష్యత్ ప్రణాళిక-2030

July 11th, 08:06 am

భారత్-న్యూజిలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై రెండు దేశాల ప్రధానమంత్రులు సంయుక్త ప్రకటన చేశారు. ఈ మేరకు న్యూజిలాండ్‌ రాజధాని ఆక్లాండ్‌లో ఇవాళ సమావేశమైన అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ భాగస్వామ్యాన్ని మరో నాలుగేళ్లలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 2030 దాకా ఒక ఉమ్మడి ప్రణాళిక అమలుకు వారిద్దరూ ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా ఆరు మూలస్తంభాల ప్రాతిపదికన వివిధ రంగాలలో అనేక కార్యక్రమాలను అమలు చేస్తారు.

భారత్-న్యూజిలాండ్ సంయుక్త ప్రకటన

July 11th, 07:59 am

న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవనీయ క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జులై 10, 11 తేదీల్లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో అధికారికంగా పర్యటిస్తున్నారు. గత 40 ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ చరిత్రాత్మక ఘట్టం రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహం, సహకారంలో ఒక కొత్త దిశకు మార్గనిర్దేశం చేస్తోంది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు

July 09th, 12:34 pm

ప్రస్తుతం ఉన్న భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటనను (2009) ఇది పునరుద్ధరిస్తుంది. దళాల పరస్పర నిర్వహణ, సామర్థ్య పెంపుదల, సముద్ర తీర పరిధి, రక్షణ పారిశ్రామిక సహకారం, సైబర్ భద్రత- సాంకేతికత, ఉగ్రవాద నిరోధం, హెచ్ఏడీఆర్‌లతో పాటు యూఎన్‌సీఎల్ఓఎస్, ఆసియాన్, పీఐఎఫ్, ఐఓఆర్ఏలలో ఏకీకృత విధానాన్ని అనుసరించడాన్ని ఇది సహకార రంగాలుగా గుర్తిస్తుంది.

India-Australia Joint Statement on Energy Security

July 09th, 11:02 am

The India-Australia Joint Statement on Energy Security noted the two countries' deep concern over the situation in the Middle East. They shared their commitment to working together to strengthen energy supply chain resilience, including by deepening regional cooperation, accelerating the energy transition, promoting the uptake of renewable energy resources and upholding open trade arrangements for energy and liquid fuels.

Third India-Australia Annual Summit Joint Statement

July 09th, 10:58 am

At the invitation of Australian PM Anthony Albanese, PM Modi visited Australia from 8-10 July 2026 for the Third Australia-India Annual Summit in Melbourne. The two leaders reaffirmed their shared commitment to further consolidate and expand the India-Australia Comprehensive Strategic Partnership (CSP) and explore new areas of cooperation for the peace, prosperity and stability of the shared region.

రక్షణ, భద్రతా రంగాల్లో సహకారంపై ఇండియా-ఆస్ట్రేలియా సంయుక్త ప్రకటన

July 09th, 10:55 am

భారత్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులమైన మేం.. మా మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక సంబంధాల ద్వారా ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో ఏకమై.. ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని స్వేచ్ఛా, శాంతియుత, స్థిరమైన, సుసంపన్నమైన ప్రాంతంగా మార్చాలన్న ఉమ్మడి ఆశయంతో రక్షణ, భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటనకు కట్టబడి ఉంటామని తెలియజేస్తున్నాం.

ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి సంయుక్త ప్రకటన నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన

July 07th, 11:21 am

మన మధ్య 2018లో ఏర్పడిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం నేడు నూతన శిఖరాలకు చేరుకుంటోంది. అభివృద్ధి, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా ప్రతి సహకార రంగంలోనూ గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాం.

ఇండియా-జపాన్ 16వ వార్షిక సదస్సు సందర్భంగా సంయుక్త ప్రకటన

July 02nd, 10:22 pm

జూలై 1 నుంచి 3, 2026 వరకు జరిగే ఇండియా-జపాన్ 16వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జపాన్ ప్రధానమంత్రి గౌరవ శ్రీమతి తకాయిచి సనాయె భారత్‌కు విచ్చేశారు. ప్రధానమంత్రి తకాయిచితో పాటు ఉన్నతాధికారులు, సీఈఓలు, పరిశ్రమల ప్రముఖులతో పాటు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్ పర్యటనకు వచ్చింది. ప్రధానమంత్రి తకాయిచి భారతదేశంలో అధికారికంగా పర్యటించటం ఇదే తొలిసారి.