రష్యా అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి తొలి పలుకులు

September 01st, 01:24 pm

మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలవడం ఎప్పటికీ గుర్తుండిపోయే సందర్భంగా నేను భావిస్తున్నాను. ఇది వివిధ అంశాలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే అవకాశాన్ని మనకు కలిగిస్తుంది.

రష్యా అధ్యక్షుడిని కలిసిన ప్రధానమంత్రి

September 01st, 01:08 pm

ఇద్దరు నేతలు ఆర్థిక, ద్రవ్య, ఇంధన రంగాలతో సహా ద్వైపాక్షిక సహకారం గురించి చర్చించారు. ఈ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల వృద్ధిపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణను ముగించడంపై ప్రధానమంత్రి మోదీ చేసిన పెద్ద ప్రకటన

September 01st, 12:48 pm

చైనాలోని టియాంజిన్‌లో జరిగిన ఎస్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా, ప్రధానమంత్రి మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం నిర్వహించారు, అక్కడ ఉక్రెయిన్ వివాదం చర్చనీయాంశమైంది. శాంతి కోసం ఇటీవలి ప్రయత్నాలను ప్రధాని మోదీ స్వాగతించారు మరియు అన్ని వైపులా నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సంఘర్షణను వీలైనంత త్వరగా ముగించాల్సిన తక్షణ అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు మరియు శాశ్వత శాంతికి మార్గాన్ని కనుగొనడం చాలా అవసరమని నొక్కి చెప్పారు. విస్తృత మానవ కోణాన్ని నొక్కి చెబుతూ, ఇది కేవలం ప్రాంతీయ ఆందోళన మాత్రమే కాదని, మానవత్వం యొక్క పిలుపు అని ప్రధాని మోదీ అన్నారు.

ఎస్‌సీవో ఇరవై అయిదో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం

September 01st, 10:14 am

ఎస్‌సీవో ఇరవై అయిదో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నందుకు సంతోషిస్తున్నాను. సాదర స్వాగతం పలికినందుకు, చక్కని ఆతిథ్యాన్ని అందించినందుకు అధ్యక్షుడు శ్రీ శీ జిన్‌పింగ్ ‌కు నేను హృదయపూర్వక కృత‌జ్ఞత‌లు తెలియజేస్తున్నాను.

చైనాలోని టియాంజిన్ నగరంలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) 25వ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి

September 01st, 10:00 am

చైనాలోని టియాంజిన్ నగరంలో 2025 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) నిర్వహించిన 25వ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో షాంఘై సహకార సంస్థ బలోపేతం, అంతర్జాతీయ పాలన సంస్కరణ, ఉగ్రవాద నిర్మూలన, శాంతి- భద్రత, ఆర్థిక సహకారం, సుస్థిర అభివృద్ధి వంటి అంశాల ­­పై నిర్మాణాత్మక చర్చలు జరిగాయి.

చైనాలోని టియాంజిన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

August 30th, 04:00 pm

ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం చైనా చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా, అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని హాజరుకానున్నారు. శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆయన అధ్యక్షుడు జి జిన్‌పింగ్, అధ్యక్షుడు పుతిన్ మరియు ఇతర నాయకులను కలుస్తారు.

జపాన్, చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లే ముందు ప్రధాని ప్రకటన

August 28th, 08:40 pm

జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు, 15 వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆ దేశానికి వెళుతున్నాను.

జపాన్ మరియు చైనాలలో ప్రధానమంత్రి పర్యటన

August 22nd, 06:15 pm

జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా మరియు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ 2025 ఆగస్టు 29–30 వరకు జపాన్‌లో మరియు 2025 ఆగస్టు 31–1 సెప్టెంబర్‌లో చైనాలో పర్యటిస్తారు. జపాన్‌లో, ప్రధాని 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు మరియు జపాన్ ప్రధాని ఇషిబాతో చర్చలు జరుపుతారు. చైనాలో, ప్రధాని టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ

August 19th, 07:34 pm

కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. టియాంజిన్లో జరుగుతున్న ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పంపిన ఆహ్వానాన్ని వాంగ్ యీ ప్రధానమంత్రికి అందజేశారు. అలాగే విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్ తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంపైనా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో కలిసి తాను సహాధ్యక్షుడుగా వ్యవహరించిన ప్రత్యేక ప్రతినిధుల 24వ సమావేశంపైనా సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Joint Statement following the 22nd India-Russia Annual Summit

July 09th, 09:54 pm

Prime Minister of the Republic of India Shri Narendra Modi paid an official visit to the Russian Federation on July 8-9, 2024 at the invitation of President of the Russian Federation H.E. Mr. Vladimir Putin for the 22nd India – Russia Annual Summit.

ఎస్‌సిఒ శిఖరాగ్ర సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 04th, 01:29 pm

ఈ మాటలను శిఖరాగ్ర సమావేశానికి హాజరైన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయ్ శంకర్ చదివి వినిపించారు.

ఎస్‌సిఒ శిఖరాగ్ర సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 04th, 01:25 pm

షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఒ) కు 2017 లో కజాకిస్తాన్ అధ్యక్ష బాధ్యతల ను నిర్వహించినప్పుడు భారతదేశం ఒక సభ్యత్వ దేశంగా చేరిన సంగతిని భారత్ ప్రశంసాపూర్వకంగా గుర్తు చేసుకొంటోంది. అప్పటి నుండి చూసుకొంటే, మనం ఎస్‌సిఒ లో అధ్యక్ష బాధ్యతల తాలూకు ఒక పూర్తి చక్రాన్ని పూర్తి చేసుకున్నాం. భారతదేశం 2020 లో శాసనాధిపతుల మండలి సమావేశాన్ని, 2023 లో దేశాధినేతల మండలి సమావేశాన్ని నిర్వహించింది. మేం అనుసరిస్తున్న విదేశాంగ విధానం లో ఎస్‌సిఒ కు ఒక ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చాం.

ప్రధాన మంత్రి తో టెలిఫోన్ద్వారా మాట్లాడిన కజాకిస్తాన్ అధ్యక్షుడు

June 25th, 06:21 pm

కజాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు శ్రీ కాసిమ్-జొమార్ట్ టోకాయెవ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.

ఎస్ సిఒ ఇరవై మూడో శిఖర సమ్మేళనాన్ని ఉద్దేశించిప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 04th, 12:30 pm

ఈ రోజు న జరుగుతున్న ఎస్ సిఒ ఇరవై మూడో శిఖర సమ్మేళనాని కి మీ అందరికి ఇదే స్నేహపూర్వక స్వాగతం. గడచిన రెండు దశాబ్దాలు గా యావత్తు ఆసియా ప్రాంతం లో శాంతి కి, సమృద్ధి కి మరియు అభివృద్ధి కి ఎస్ సిఒ ఒక ముఖ్యమైన వేదిక గా ఉంటున్నది. ఈ ప్రాంతాని కి మరియు భారతదేశాని కి మధ్య వేల సంవత్సరాలు గా సాంస్కృతిక సంబంధాలు మరియు ఉభయ పక్షాల ప్రజల మధ్య పారస్పరిక సంబంధాలు ఏర్పడి అవి మన యొక్క ఉమ్మడి వారసత్వాని కి ఒక సజీవ తార్కాణం గా నిలచాయి. మనం ఈ ప్రాంతాన్ని ‘‘విస్తారిత ఇరుగు పొరుగు బంధం’’ గా చూడం, మనం దీనిని ‘‘విస్తారిత కుటుంబం’’ లా ఎంచుతున్నాం.

రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో టెలిఫోన్ లోమాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

December 16th, 03:51 pm

రశ్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

ఎస్ సిఒశిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో తుర్కీ గణతంత్రం అధ్యక్షుడు శ్రీ రెసిప్ తైయ్యప్అర్దోగన్ తో సమావేశమైన ప్రధాన మంత్రి

September 16th, 11:41 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉజ్ బెకిస్తాన్ లోని సమర్ కంద్ లో 2022 సెప్టెంబర్ 16వ తేదీ న ఎస్ సిఒ శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో తుర్కీ గణతంత్రం అధ్యక్షుడు శ్రీ రెసిప్ తైయ్యప్ అర్దోగన్ తో సమావేశమయ్యారు.

ఎస్ సిఒ శిఖర సమ్మేళనం సందర్భం లోఇరాన్ అధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి

September 16th, 11:06 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఇరాన్ ఇస్లామిక్ గణతంత్రం యొక్క అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిమ్ రయీసీ లు ఉజ్ బెకిస్తాన్ లోని సమర్ కంద్ లో ఎస్ సిఒ యొక్క దేశాధినేతల మండలి 22వ సమావేశం జరిగిన సందర్భం లో సమావేశమయ్యారు. 2021వ సంవత్సరం లో అధ్యక్షుడు శ్రీ రయీసీ పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత, ప్రధాన మంత్రి మరియు అధ్యక్షుడు శ్రీ రయీసీ లు సమావేశం కావడం ఇదే తొలి సారి.

ఉజ్బెకిస్తాన్ లోని సమర్ కంద్ లో రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుని తో సమావేశమైన ప్రధానమంత్రి

September 16th, 08:42 pm

శంఘాయి కోఆపరేశన్ ఆర్గనైజేశన్ (ఎస్ సిఒ) యొక్క 22వ సమావేశం ఉజ్ బెకిస్తాన్ లోని సమర్ కంద్ లో ఈ రోజు న జరిగిన సందర్భం లో, రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి.. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుల మధ్య ద్వైపాక్షిక సమావేశం

September 16th, 08:34 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్లో ఆ దేశాధ్యక్షుడు గౌరవనీయ షౌకత్ మిరిజ్యోయేవ్‘ను కలుసుకున్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సభ్య దేశాధిపతుల మండలి 22వ సమావేశం సందర్భంగా ఈ ద్వైపాక్షిక సమావేశం జరిగింది.

ఎస్ సిఒ సమిట్ లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వ్యాఖ్యలు

September 16th, 01:30 pm

ప్రస్తుతం, యావత్తు ప్రపంచం మహమ్మారి అనంతరం ఆర్థికం గా పుంజుకోవడం లో సవాళ్ల ను ఎదుర్కొంటున్నప్పుడు, ఎస్ సిఒ యొక్క భూమిక చాలా ముఖ్యమైంది గా మారిపోతుంది. ఎస్ సిఒ సభ్యత్వ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి లో సుమారు 30 శాతాన్ని తామే అందిస్తున్నాయి. మరి ప్రపంచ జనాభా ల 40 శాతం జనాభా నివసిస్తున్నది కూడా ఎస్ సిఒ దేశాల లోనే. ఎస్ సిఒ సభ్యత్వ దేశాల మధ్య మరింత సహకారాన్ని మరియు పరస్పర విశ్వాసాన్ని భారతదేశం సమర్ధిస్తుంది. మహమ్మారి మరియు యూక్రేన్ లో సంకటం ప్రపంచ సరఫరా వ్యవస్థల లో అనేక అడ్డంకుల ను ఏర్పరచాయి. ఈ కారణంగా, యావత్తు ప్రపంచం ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి స్థాయి లో శక్తి సంబంధి మరియు ఆహారం సంబంధి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మన ప్రాంతం లో ఆధారపడదగ్గ, ఆటుపోటులకు తట్టుకొని నిలబడగలిగిన మరియు వివిధత్వంతో కూడిన సరఫరా వ్యవస్థల ను తప్పక అభివృద్ధి పరచాలి. దీనికి గాను మెరుగైనటువంటి సంధానం అవసరపడుతుంది; అలాగే మనం అందరం ఒక దేశానికి మరొక దేశం గుండా ప్రయాణించడానికి పూర్తి హక్కు ను ఇవ్వడం కూడా ప్రధానం.