'మన్ కీ బాత్'లో భారతదేశ రక్షణ సామర్థ్యం, ​​ఆవిష్కరణలు మరియు సమిష్టి కృషిని ప్రస్తావించిన ప్రధాని మోదీ

July 26th, 11:30 am

Prime Minister Narendra Modi addressed the nation through Mann Ki Baat. In his speech, he highlighted important topics such as Kargil Vijay Diwas, Catch the Rain campaign, India's space sector prowess, Science Olympiads, Environmental conservation, Khadi and more. He called upon the citizens to share their ideas and suggestions for Independence Day through MyGov.

సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

June 28th, 05:00 pm

ఈ రోజే కొంచెం ముందు నాకు ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ పురస్కారాన్ని అందించి నన్ను గౌరవించినందుకు అధ్యక్షుడు ఎర్మినీ గారికి, సీషెల్స్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర కృషి చేస్తున్న వారందరికీ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇక్కడికి భారత్‌లోని 140 కోట్ల ప్రజల తరపున ఆత్మీయ శుభాకాంక్షలను, శుభాశీస్సులను తీసుకువచ్చాను.

ప‌శ్చిమబంగ దివ‌స్ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్ష‌లు... డాక్టర్‌ శ్యామ ప్రసాద్ ముఖర్జీ సేవలను స్మరించుకున్న శ్రీ మోదీ

June 20th, 08:30 am

పశ్చిమబంగ దివస్ (పశ్చిమ బెంగాల్ దినోత్సవం) సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

మహిళల నాయకత్వంలో విభిన్న రంగాల్లో అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని స్పష్టం చేసిన ప్రధానమంత్రి

June 12th, 12:39 pm

మహిళల నాయకత్వంలో అభివృద్దిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా కృషి చేస్తోందనీ, ఇది అన్ని రంగాలలో స్పష్టంగా కనిపిస్తోందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు. అభివృద్ధి ఫలాలను సమాజంలో అన్ని వర్గాలకు చేరవేయడం మొదలు ఔత్సాహిక పారిశ్రామికత్వం, విద్య, ఆరోగ్యసంరక్షణ, స్వచ్ఛత, గృహనిర్మాణం, క్రీడలు, విజ్ఞానశాస్త్రం, పరిపాలన.. ఇలా వివిధ రంగాల్లో మహిళలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నారని ఆయన తెలిపారు.

భారత్‌లో 100వ రామ్‌సర్ స్థలంగా జై ప్రకాశ్ నారాయణ్ పక్షుల అభయారణ్యం.. ప్రధానమంత్రి హర్షం

June 05th, 11:58 am

భారత్.. రామ్‌సర్ స్థలాల్లో ‘సెంచరీ’ని సాధించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్.. బలియాలో గల జై ప్రకాశ్ నారాయణ్ పక్షుల అభయారణ్యాన్ని (సురహా తాల్) దేశంలో 100వ రామ్‌సర్ స్థలంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని స్పందించారు.

సైప్రస్ దేశాధ్యక్షుడి అధికారిక పర్యటన సందర్భంగా ఇరుదేశాల ఉమ్మడి ప్రకటన

May 22nd, 09:31 pm

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు సైప్రస్ దేశాధ్యక్షుడు శ్రీ నికోస్ క్రిస్టోడౌలిడెస్ 2026 మే 20 నుంచి 23 వరకు భారతదేశంలో అధికారిక పర్యటన చేపట్టారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్‌కు సైప్రస్ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో ఈ పర్యటన జరగడంతో ఇది మరింత ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.

భారత -ఇటలీ దేశాల ఉమ్మడి ప్రకటన

May 20th, 10:28 pm

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మే 19-20 తేదీల్లో ఇటలీలో అధికారిక పర్యటన చేపట్టారు. 2024 జూన్‌లో జీ7 సదస్సు సందర్భంగా ఇటలీలో ప్రధాని మోదీ పర్యటన, 2023లో జీ20 సదస్సు సందర్భంగా భారతదేశంలో ప్రధాని మెలోనీ పర్యటనల అనంతరం జరిగిన ఈ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్-ఇటలీ సంబంధాలను 'ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

భారత ప్రధానమంత్రి నెదర్లాండ్స్‌ పర్యటన సందర్భంగా రెండు దేశాల సంయుక్త ప్రకటన

May 17th, 03:45 am

నెదర్లాండ్స్ ప్రధానమంత్రి గౌరవనీయ రాబ్‌ జెటెన్‌ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 16-17 తేదీలలో ఆ దేశంలో పర్యటించారు. శ్రీ మోదీ నెదర్లాండ్స్‌లో పర్యటించడం ఇది రెండోసారి.

మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

May 01st, 09:14 am

నేడు మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ, డిజిటల్ సెన్సస్ 2027లో పాల్గొని దానిని విజయవంతం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

April 26th, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో, అణు, పవన విద్యుత్ రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భగవాన్ బుద్ధుని బోధనలు, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం, ప్రకృతి పరిరక్షణ, వెదురు రంగం, ప్రాచీన గ్రంథాలు, గణిత ఒలింపియాడ్ కార్యక్రమం వంటి పలు ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కొనసాగుతున్న డిజిటల్ సెన్సస్ ప్రచారం గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

నియామక సందర్భంగా ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్‌కు ప్రధాని అభినందన

April 25th, 10:47 pm

నీతి ఆయోగ్ సభ్యుడిగా నియమితుడైన ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పదవీకాలాన్ని విజయవంతంగా కొనసాగించాలంటూ శుభాకాంక్షలు అందించారు. ఆయన నిగర్వి అనీ, అలుపెరుగని అంకితభావంతో ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకంగా కొనసాగుతోందనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యం, విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణ రంగాల్లో ప్రొఫెసర్ దాస్ అమూల్య సేవలను ఆయన కొనియాడారు. ఆయన విజయాలతో దేశమంతా గర్విస్తోందన్నారు.

ఏప్రిల్ 13న 'నారీ శక్తి వందన్’ సమ్మేళనంలో ప్రసంగించనున్న పీఎం

April 12th, 04:43 pm

ఏప్రిల్ 13, 2026న ఉదయం 11 గంటల సమయంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ స్థాయి 'నారీ శక్తి వందన్’ సమ్మేళనంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు.

'మన్ కీ బాత్'లో, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని అధిగమించడానికి 140 కోట్ల మంది భారతీయుల ఐకమత్యంపై విశ్వాసం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

March 29th, 11:30 am

ఈ నెల 'మన్ కీ బాత్' కార్యక్రమంలో, ప్రధాని మోదీ పశ్చిమ ఆసియా సంఘర్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అందరూ ఐకమత్యంతో ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. పుకార్లకు లోనై తప్పుదోవ పట్టవద్దని, కేవలం ప్రభుత్వం అందించే సమాచారంపైనే ఆధారపడాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు. అలాగే 'జ్ఞాన్ భారతం' సర్వే, క్రీడలు మరియు ఫిట్‌నెస్, నీటి సంరక్షణ, చేపల పెంపకం, సౌర విద్యుత్ వంటి కీలక అంశాలను కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.

ఢిల్లీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

March 08th, 03:54 pm

అభివృద్ధికి కొత్త వేగం ఇచ్చేందుకు మనమందరం నేడు ఇక్కడ ఢిల్లీలో సమావేశమయ్యాం. కాసేపటి క్రితమే, ముప్పై మూడున్నర వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. మెట్రో విస్తరణ మొదలుకొని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల గృహనిర్మాణం వరకు రాజధానిలోని సౌకర్యాలు నిరంతరం బలోపేతం అవుతున్నాయి, ఇది నగరానికి కొత్త శక్తిని ఇస్తోంది. ఏడాది క్రితం ఢిల్లీ ప్రజలైన మీరు ఏ నమ్మకంతో, ఆశతో ఇక్కడ బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, ఆ సంకల్పం ఇప్పుడు ఈ అభివృద్ధి పనుల్లో కనిపిస్తోంది. ఈ నిరంతర ప్రగతి సందర్భంగా ఢిల్లీ పౌరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.

ఢిల్లీలో సుమారు రూ. 33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 08th, 10:26 am

దేశ రాజధానీ నగరం ఢిల్లీలో సుమారు రూ. 33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఢిల్లీ అభివృద్ధికి కొత్త వేగాన్ని అందించడానికి మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం” అని పేర్కొన్నారు.

జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా జాతీయ అభివృద్ధికి, ప్రపంచ సుసంపన్నతకు శాస్త్ర, సాంకేతికతను వినియోగించుకుంటామని స్పష్టం చేసిన ప్రధానమంత్రి

February 28th, 10:08 am

జాతీయ సైన్స్ దినోత్సవం రోజున దేశాన్ని ముందుకు నడిపించే పరిశోధన, ఆవిష్కరణ, శాస్త్రీయ అంశాలను తెలుసుకోవాలనే స్ఫూర్తిని వేడుకగా జరుపుకుంటామని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

విద్యార్థుల అపార ప్రతిభనీ, ‘పరీక్షా పే చర్చా’ స్ఫూర్తినీ చాటిచెబుతూ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

February 09th, 09:06 am

మన విద్యార్థుల్లో అసాధారణ ప్రతిభ సమృద్ధిగా ఉందనీ, వారిలో తమ కలలను నిజం చేసుకొనేందుకు పూర్తి సామర్థ్యం ఉందనీ ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. విద్యార్థులు వారి సామర్థ్యాలతో పాటు నైపుణ్యాలను ఉపయోగించి వ్యక్తిగత పురోగతినీ, విజయాన్నీ పొందడానికి మార్గదర్శకత్వం వహించడం ‘పరీక్షా పే చర్చా’ ఉద్దేశమని ఆయన అన్నారు.

భారత్ – జర్మనీ సంయుక్త ప్రకటన

January 12th, 03:50 pm

గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. గౌరవ జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ 2026 జనవరి 12, 13 తేదీల్లో అధికారికంగా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఛాన్సలర్ వెంట 23 మంది ప్రముఖ జర్మన్ సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఉంది.

భగవాన్ బుద్ధుని పవిత్ర పిప్రహ్వా అవశేషాల బృహత్తర అంతర్జాతీయ ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 03rd, 12:00 pm

కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులైన గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కిరణ్ రిజిజు గారు, రాందాస్ అథవాలే గారు, రావు ఇందర్‌జిత్ గారు... ఢిల్లీ ముఖ్యమంత్రికి ముందుగా నిర్ణయించిన వేరే కార్యక్రమం ఉన్నందున వారు వెళ్లిపోయారు... ఇక్కడ ఉన్న ఢిల్లీకి చెందిన ఇతర మంత్రులు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ సక్సేనా గారు, మహాశయులారా, గౌరవనీయ దౌత్య బృంద సభ్యులారా, బౌద్ధ పండితులారా, ధమ్మ అనుచరులారా, సోదరీ సోదరులారా...

భగవాన్ బుద్ధుడికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను న్యూఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

January 03rd, 11:30 am

న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్‌లో ఇవాళ ద లైట్ అండ్ ద లోటస్: రిలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్ పేరిట భగవాన్ బుద్ధునికి సంబంధించిన పవిత్రమైన పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. 125 ఏళ్ల తర్వాత భారత వారసత్వం తిరిగి వచ్చిందని, దేశ సంపద పునరాగమనం చేసిందన్నారు. నేటి నుంచి భారత ప్రజలు గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను దర్శించుకుని, ఆయన ఆశీస్సులు పొందవచ్చని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ శుభ సందర్భంగా అతిథులకు స్వాగతం పలికిన శ్రీ నరేంద్ర మోదీ, శుభాకాంక్షలు తెలియజేశారు. బౌద్ధ సన్యాసులు, ధర్మ ఆచార‌్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రణామాలు తెలియజేశారు. వారి ఉనికి కార్యక్రమానికి కొత్త శక్తినిచ్చిందని తెలిపారు. 2026 ప్రారంభంలోనే ఈ పవిత్ర వేడుక జరగటం స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి అన్నారు. భగవాన్ బుద్ధుని ఆశీస్సులతో 2026వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా శాంతి, సంపద, సామరస్యంతో నవశకానికి నాంది పలకాలని ఆకాంక్షించారు.