భారత్, భూటాన్ దేశాల మధ్య గల విలక్షణమైన చారిత్రక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్న ప్రధానమంత్రి

February 21st, 07:16 pm

న్యూఢిల్లీలో ఏర్పాటైన సోల్ నాయకత్వ సదస్సులో భూటాన్ ప్రధానమంత్రి శ్రీ షెరింగ్ టోగ్బే ప్రసంగించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, భారత్, భూటాన్ దేశాల మధ్య గల విలక్షణమైన చారిత్రక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు.

ఫిబ్రవరి 21న ఢిల్లీలో ‘సోల్ నాయకత్వ సదస్సు’ తొలి సంచికను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

February 19th, 06:31 pm

ఫిబ్రవరి 21, ఉదయం 11 గంటల సమయంలో న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘సోల్ నాయకత్వ సదస్సు’ తొలి సంచికను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన వేదికనుద్దేశించి ప్రసంగిస్తారు. గౌరవ అతిథి హోదాలో పాల్గొనే భూటాన్ రాజు దాషో షెరింగ్ టోబ్గే కీలకోపన్యాసం చేస్తారు.