న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య మహా సమ్మేళనం 2025 ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

October 31st, 07:00 pm

ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించండి. ఈ రోజు సర్దార్ సాహెబ్ 150వ జయంతి. ఏక్తానగర్లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. దాని వల్ల ఇక్కడికి రావడం ఆలస్యమైంది. ఇక్కడికి సకాలంలో చేరుకోలేనందుకు చింతిస్తున్నాను. ఈ విషయంలో మీ అందరినీ క్షమాపణలను కోరుతున్నాను. సభ ప్రారంభంలో మనం విన్న మంత్రాల శక్తి ఇప్పటికీ మనకి తెలుస్తూనే ఉంది. మీ మధ్య ఉండే అవకాశం వచ్చినప్పుడల్లా ఆ అనుభవం దైవికంగా, అద్భుతంగా ఉంటుంది. ఇది స్వామి దయానందుల వారి ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదాల పట్ల మనందరికీ ఉన్న గౌరవంతో పాటు ఇక్కడున్న మేధావులైన మీ అందరితోనూ దశాబ్దాలుగా నాకున్న వ్యక్తిగత అనుబంధం వల్లే మళ్లీ మళ్లీ మీ మధ్య ఉండే అవకాశం నాకు లభిస్తోంది. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ, మీతో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ నాలో ప్రత్యేకమైన శక్తి, స్ఫూర్తి నిండుతాయి. ఇలాంటి మరో తొమ్మిది హాళ్లను ఏర్పాటు చేశారని ఇప్పుడే నాకు చెప్పారు. అక్కడ మన ఆర్యసమాజ్ సభ్యులంతా వీడియో లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. వారిని నేను నేరుగా చూడలేనప్పటికీ.. ఇక్కడి నుంచే వారికి నమస్కరిస్తున్నాను.

కెవాడియాలోని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 31st, 09:00 am

సర్దార్ పటేల్ 150వ జయంతి చరిత్రాత్మక సందర్భం. ఏక్తానగర్‌లో ఈ నాటి దివ్యమైన ఉదయం...ముఖ్యంగా ఈ విశాల దృశ్యం గొప్ప ఆరాధనా భావాన్ని కలిగిస్తోంది. సర్దార్ సాహెబ్ పాదాల వద్ద మనమంతా సామూహికంగా ఐక్యతా స్ఫూర్తిని చాటుతున్న ఒక గొప్ప సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐక్యతా పరుగులో పాల్గొంటున్న కోట్లాది మంది భారతీయుల ఉత్సాహం ద్వారా మనం నవ భారత సంకల్పాన్ని కార్యాచరణలో చూస్తున్నాం. నిన్న సాయంత్రం జరిగిన అద్భుతమైన ప్రదర్శన సహా ఇటీవల ఇక్కడ నిర్వహించిన కార్యక్రమాలు గత కాలపు సంప్రదాయాన్ని, వర్తమానపు శ్రమనీ- శౌర్యాన్నీ, భవిష్యత్తు విజయాల సంగ్రహావలోకనాన్ని ప్రదర్శించాయి. సర్దార్ సాహెబ్ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ఒక స్మారక నాణెంతో పాటు పోస్టల్ స్టాంపును విడుదల చేశాం. సర్దార్ సాహెబ్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా 140 కోట్ల మంది దేశవాసులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

గుజరాత్‌లోని కెవాడియాలో రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 31st, 08:44 am

గుజరాత్‌లోని కెవాడియాలో ఈ రోజు నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సర్దార్ పటేల్ 150వ జయంతి ఒక చరిత్రాత్మక సందర్భమని అన్నారు. ఏక్తా నగర్‌లోని ఉదయం దివ్యమైన, విశాల దృశ్యంగా ఆరాధనా భావాన్ని కలిగిస్తోందని అభివర్ణించిన శ్రీ మోదీ... సర్దార్ పటేల్ పాదాల వద్ద చేరిన నేటి ఈ జన సమూహపు ఐక్యతా స్ఫూర్తితో దేశం ఒక చిరస్మరణీయ అనుభవాన్ని పొందుతోందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఐక్యతా పరుగు కార్యక్రమాన్ని... ఆ కార్యక్రమంలో కోట్లాది మంది భారతీయుల ఉత్సాహంతో కూడిన భాగస్వామ్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దీని ద్వారా నవ భారత్ సంకల్పం స్పష్టంగా అవగతమవుతోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలు, నిన్నటి సాయంత్రం జరిగిన అద్భుతమైన ప్రదర్శనను ప్రస్తావిస్తూ... అవి గత కాలపు సంప్రదాయాలను, వర్తమానపు శ్రమనూ-శౌర్యాన్నీ, భవిష్యత్తు విజయాల సంగ్రహావలోకనాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఒక స్మారక నాణెం, ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసినట్లు ఆయన తెలియజేశారు. సర్దార్ పటేల్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది పౌరులకు ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఆది తిరువత్తిరై ఉత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం

July 27th, 12:30 pm

పూజనీయ ఆధీనం మఠాధిపతి గారు, చిన్మయ మిషన్ స్వామీజీలు, తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు, మంత్రివర్గ సహచరుడు డాక్టర్ ఎల్. మురుగన్ గారు, స్థానిక ఎంపీ తిరుమా వలవన్ గారు, వేదికపై ఉన్న తమిళనాడు మంత్రులూ, పార్లమెంటు సహచరుడు ఇళయరాజా గారు, ఒడువర్లు, భక్తులు, విద్యార్థులు, సాంస్కృతిక చరిత్రకారులు, ప్రియమైన సోదరీ సోదరులా! నమఃశివాయ.

తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో ఆడి తిరువాతిరై వేడుక సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 27th, 12:25 pm

తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఈ రోజు ఆడి తిరువాతిరై వేడుక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. మున్ముందుగా ఆదిదేవుడైన మహాశివునికి నీరాజనం అర్పిస్తూ- రాజరాజ చోళుడు రాజ్యమేలిన పవిత్ర భూమిలో పరమేశుని దివ్య దర్శనంతో తనలో ఆధ్యాత్మిక శక్తి పెల్లుబికిందని పేర్కొన్నారు. శ్రీ ఇళయరాజా స్వరాలు సమకూర్చిన భక్తి గీతాలాపనను అమితంగా ఆస్వాదించానని చెప్పారు. శైవారాధకులైన ‘ఓతువర్ల’ పవిత్ర మంత్రోచ్చారణ నడుమ సర్వశక్తిమంతుడైన శివుడికి నమస్కరిస్తూ- ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణంతో తాదాత్మ్యం చెందానని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

We are not just the Mother of Democracy; democracy is an integral part of our lives: PM

January 09th, 10:15 am

PM Modi inaugurated the 18th Pravasi Bharatiya Divas convention in Bhubaneswar, Odisha. Expressing his heartfelt gratitude to the Indian diaspora and thanking them for giving him the opportunity to hold his head high with pride on the global stage, Shri Modi highlighted that over the past decade, he had met numerous world leaders, all of whom have praised the Indian diaspora for their social values and contributions to their respective societies.

ఒడిశాలో 18వ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

January 09th, 10:00 am

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనాన్ని ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ రోజు ప్రారంభించారు. ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, ప్రవాసీ భారతీయులకు శ్రీ మోదీ స్వాగతం పలుకుతూ, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ప్రారంభ గీతాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహించే ప్రవాసీ భారతీయ కార్యక్రమాల్లో పాడతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రవాసీ భారతీయుల భావాలను, భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ గ్రామీ పురస్కార విజేత కళాకారుడు శ్రీ రికీ కేజ్‌నూ, ఆయన సహ కళాకారులనూ ప్రధాని ప్రశంసించారు.

సుప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సాహితీ సర్వస్వం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

December 11th, 02:00 pm

నేడు దేశం మహాకవి సుబ్రమణ్య భారతి జయంతిని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వారికి గౌరవ పూర్వక నివాళులర్పిస్తున్నాను. భారతీయ సంస్కృతీ సాహిత్యాలకి, దేశస్వాతంత్ర్య పోరాట జ్ఞాపకాలకు, తమిళుల గౌరవానికి ఇవి అపురూపమైన క్షణాలు! మహాకవి సుబ్రమణ్య భారతి రచనల ప్రచురణను అత్యున్నతస్థాయి సేవగా పరిగణిస్తున్నాను. పరిపూర్ణమైన గొప్ప ఆధ్యాత్మిక యత్నమిది. 21 సంపుటాల్లో తయారైన 'కాల వరిసైయిల్ భారతియార్ పడైప్పుగళ్' సంకలనం అసాధారణమైన, అపూర్వమైన విజయానికి ప్రతీక. ఎంతో స్థైర్యంతో చేపట్టిన ఆరు దశాబ్దాల అవిరామ కృషికి దక్కిన అద్భుత ఫలితం. అనితరసాధ్యమనిపించే ఈ సాఫల్యం శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషికీ, అంకితభావానికీ నిదర్శనంగా నిలుస్తోంది. భవిష్యత్తు తరాలకు ఈ సంకలనం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఒకే జీవితం, ఒక లక్ష్యం అన్న మాటని మనం తరచుగా వింటుంటాం కానీ శ్రీ శీని ఆ మాటను నిజం చేసి చూపారు. అపురూపమైన అంకితభావానికి ప్రతీకగా నిలిచిన ఆయన శ్రమ, ధర్మశాస్త్ర చరిత్రను రాయడానికి 35 ఏళ్ల సమయాన్ని వెచ్చించిన మహామహోపాధ్యాయ పాండురంగ్ వామన్ కానే గారిని గుర్తుకు తెచ్చింది. శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషి విద్యారంగంలో నూతన ప్రమాణాలను పాదుకొల్పగలదని విశ్వసిస్తున్నాను. గొప్ప ఫలితాన్ని సాధించిన విశ్వనాథన్ గారికి, ఆయన బృందం సహా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

తమిళ మహాకవి శ్రీ సుబ్రమణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

December 11th, 01:30 pm

తమిళ భాషా రంగంలో మహాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ సుబ్రహ్మణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని నంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఈరోజు ఆవిష్కరించారు. శ్రీ సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా ఆయనకు శ్రీ మోదీ నివాళులు అర్పిస్తూ, ఈరోజు భారతదేశ సంస్కృతికి, సాహిత్యానికి, మన దేశ స్వాతంత్య్ర పోరాట స్మృతులకు, అంతేకాకుండా తమిళనాడు ఆత్మగౌరవానికి కూడా లభించిన ఒక మహదవకాశమన్నారు.

డీఎంకే 'విభజించు, విభజించు మరియు విభజించు'పై స్థాపించబడింది మరియు 'సనాతన్'ను నాశనం చేయాలని చూస్తోంది: వెల్లూరులో ప్రధాని మోదీ

April 10th, 02:50 pm

లోక్‌సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీకి వేలూరు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వెల్లూర్. వెల్లూర్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక కీలకమైన విప్లవాన్ని సృష్టించింది మరియు ప్రస్తుతం, N.D.Aకి దాని బలమైన మద్దతు 'ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్' స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది.

తమిళనాడులో రెండు బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నప్పుడు వెల్లూరు & మెట్టుపాళయంలో భారీ జనం మద్దతు

April 10th, 10:30 am

లోక్‌సభ ఎన్నికలకు ముందు, తమిళనాడులో రెండు బహిరంగ సభల్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీకి వెల్లూరు మరియు మెట్టుపాళయంలో భారీ జనం మద్దతు పలికారు. చరిత్ర, పురాణాలకు నేను నమస్కరిస్తున్నాను. మరియు వెల్లూరు యొక్క ధైర్యసాహసాలు. వెల్లూర్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక కీలకమైన విప్లవాన్ని సృష్టించింది మరియు ప్రస్తుతం, N.D.Aకి దాని బలమైన మద్దతు 'ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్' స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది.

న్యూఢిల్లీలో పొంగల్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం పాఠం

January 14th, 12:00 pm

వనక్కం, మీ అందరికీ పొంగల్ శుభాకాంక్షలు! ఇనియా పొంగల్ నల్వాల్తుక్కల్ !

న్యూఢిల్లీలో పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి

January 14th, 11:30 am

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికీ పొంగల్ శుభాకాంక్షలు తెలియచేశారు. తమిళనాడులోని ప్రతీ ఒక్క ఇంటిలోనూ పొంగల్ పండుగ ఉత్సాహం కనిపిస్తుందని ఆయన అన్నారు. పౌరులందరి జీవితాల్లోనూ ఆనందం, సుసంపన్నత, సంతృప్తి ఏరులై పారాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. నిన్న జరిగిన లోహ్రి వేడుకలు, మకర ఉత్తరాయణ ప్రవేశాన్ని పురస్కరించుకుని రేపు జరిగే మకర సంక్రాంతి, త్వరలో రానున్న మాఘ బిహు వంటి పవిత్ర పండుగల సందర్భంగా దేశ పౌరులందరికీ శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియచేశారు.

'మన్ కీ బాత్' పట్ల ప్రజలు చూపుతున్న అభిమానం అపూర్వమైనది: ప్రధాని మోదీ

May 28th, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్'లోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈసారి 'మన్ కీ బాత్' ఎపిసోడ్ 2వ సెంచరీ ప్రారంభం. గత నెలలో మనమందరం ప్రత్యేక సెంచరీ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. మీ భాగస్వామ్యమే ఈ కార్యక్రమానికి అతిపెద్ద బలం. 100వ ఎపిసోడ్ ప్రసారమయ్యే సమయానికిఒక విధంగా దేశం మొత్తం ఒక సూత్రంతో అనుసంధానమై ఉంది. పరిశుభ్రతా కార్మికులైన సోదర సోదరీమణులు కావచ్చు. లేదా వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులు కావచ్చు. 'మన్ కీ బాత్' అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేసింది. 'మన్ కీ బాత్'పై మీరందరూ ప్రదర్శించిన ఆత్మీయత, స్నేహభావం అపూర్వమైనవి. అవి భావోద్వేగానికి గురి చేస్తాయి. 'మన్ కీ బాత్' ప్రసారమైనప్పుడుఆ సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో, వివిధ టైమ్ జోన్లలో ఒకచోట సాయంత్రం, మరోచోట అర్థరాత్రి అయినప్పటికీ 100వ ఎపిసోడ్‌ను పెద్ద సంఖ్యలో ప్రజలు వీక్షించారు. వినేందుకు సమయం కేటాయించారు. వేల మైళ్ల దూరంలో ఉన్న న్యూజిలాండ్ నుండి వచ్చిన ఒక వీడియోను కూడా నేను చూశాను. అందులో వందేళ్ల ఒక అమ్మ తన ఆశీస్సులు ఇస్తోంది. భారతదేశంతో పాటు ఇతర నుండి కూడా ప్రజలు 'మన్ కీ బాత్'పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాలా మంది నిర్మాణాత్మక విశ్లేషణ కూడా చేశారు. 'మన్ కీ బాత్'లో దేశం, దేశప్రజలు సాధించిన విజయాల గురించి మాత్రమే చర్చించడాన్ని ప్రజలు ప్రశంసించారు. ఈ ఆశీర్వాదానికి నేను మీ అందరికీ గౌరవంగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

కాశీలో కాశీ తెలుగు సంగమంలో ప్రధాన మంత్రి ప్రసంగం

April 29th, 07:46 pm

నమస్కారం! గంగా పుష్కరాల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మీరంతా కాశీకి వచ్చారు కాబట్టి, ఈ సందర్శనలో మీరంతా వ్యక్తిగతంగా నా అతిథులు. మరియు అతిథి దేవునితో సమానమని మేము నమ్ముతాము. కొన్ని ముందస్తు పనుల కారణంగా మీకు స్వాగతం పలికేందుకు నేను అక్కడ ఉండలేకపోయినా, మీ అందరి మధ్య నేను ఉండాలని కోరుకుంటున్నాను. కాశీ తెలుగు కమిటీకి, నా పార్లమెంటరీ సహచరుడు జి.వి.ఎల్.నరసింహారావు గారికి అభినందనలు. కాశీలోని ఘాట్ల వద్ద జరిగే ఈ గంగ-పుష్కరాల ఉత్సవం గంగ, గోదావరి సంగమం లాంటిది. ఇది భారతదేశపు పురాతన నాగరికతలు, సంస్కృతులు మరియు సంప్రదాయాల సంగమం యొక్క వేడుక. కొన్ని నెలల క్రితం కాశీ గడ్డపై కాశీ-తమిళ సంగమం జరిగిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం సౌరాష్ట్ర-తమిళ సంగమంలో పాల్గొనే భాగ్యం కలిగింది. ఈ 'ఆజాదీ కా అమృత్కాల్' దేశంలోని భిన్నత్వాలు, వివిధ ప్రవాహాల సంగమం అని నేను అప్పట్లో చెప్పాను. అనంతమైన భవిష్యత్తు వరకు భారతదేశాన్ని చైతన్యవంతంగా ఉంచే ఈ భిన్నత్వాల సంగమం నుంచి జాతీయతా అమృతం కారుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని కాశీ నగరంలో ‘కాశీ తెలుగు సంగమం’ సందర్భంగా ప్రధాని ప్రసంగం

April 29th, 07:45 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్త‌రప్ర‌దేశ్‌లోని కాశీ నగరంలో నిర్వహించిన ‘కాశీ తెలుగు సంగమం’ కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. గంగా పుష్కర వేడుకల నేపథ్యంలో ముందుగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపి, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఆయన తన ప్రసంగం ప్రారంభించారు. ఈ వేళ కాశీ నగరంలో ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా తన వ్యక్తిగత అతిథులేనని ఆయన అభివర్ణించారు. అలాగే మన భారతీయ సంస్కృతిలో అతిథులు దేవుడితో సమానమని ప్రధాని గుర్తుచేశారు. “మిమ్మల్ని నేను స్వయంగా స్వాగతించలేకపోయినా, నా మనస్సు మీతోనే ఉంది” అని ఈ సందర్భంగా తన మనోభావాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కాశీ-తెలుగు కమిటీతోపాటు పార్లమెంటు సభ్యుడు శ్రీ జి.వి.ఎల్. నరసింహారావును ప్రధాని అభినందించారు. కాశీ ఘాట్‌ల వద్ద గంగా పుష్కర వేడుకలు గంగా-గోదావరి నదుల సంగమం వంటిదని పేర్కొన్నారు. ఇది భారత ప్రాచీన నాగరికత-సంస్కృతులు-సంప్రదాయాల మేలు కలయికకు సంబంధించిన వేడుకని ప్రధానమంత్రి చెప్పారు. కొన్ని నెలల కిందట ఇక్కడే కాశీ- తమిళ సంగమం నిర్వహణను ఆయన గుర్తుచేసుకున్నారు. అలాగే కొన్ని రోజుల ముందు సౌరాష్ట్ర - తమిళ సంగమంలో తాను పాల్గొనడాన్ని కూడా ప్రస్తావించారు. ఈ మేరకు స్వాతంత్ర్య అమృత కాలాన్ని దేశంలోని వైవిధ్యాలు-సంస్కృతుల సంగమంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. “ఈ భిన్నత్వాల సంగమం జాతీయవాద అమృతాన్ని సృష్టిస్తోంది. భవిష్యత్తులో ఇది భారతదేశాన్ని సంపూర్ణంగా శక్తిమంతం చేస్తుంది” అని ప్రధానమంత్రి ఆశాభావం వెలిబుచ్చారు.

సౌరాష్ట్ర-తమిళ సంగమంలో ప్రధాన మంత్రి వ్యాఖ్యలు

April 26th, 02:30 pm

గుజరాత్ ముఖ్య మంత్రి శ్రీ భూపేంద్ర భాయి ప టేల్, నాగాలాండ్ గవర్నర్ శ్రీ లా గణేశన్ గారు, జార్ఖండ్ గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణ గారు, కేంద్ర మంత్రి వర్గం లోని నా సహచరులు పురుషోత్తం రూపాల గారు, ఎల్ మురుగన్ జీ, మీనాక్షి లేఖి గారు, ఈ కార్య క్ర మంలో పాలుపంచుకున్న మహిళా, పెద్దమనుషులు!

సౌరాష్ట్ర తమిళ సంగమం ముగింపు వేడుకలలో ప్రధాని ప్రసంగం

April 26th, 10:30 am

సౌరాష్ట్ర తమిళ సంగమం ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. అతిథికి ఆతిథ్యం ఇవ్వటం ఒక ప్రత్యేకమైన అనుభూతి అని, అయితే, దశాబ్దాల తరువాత మళ్ళీ ఇంటికి రావటామనే అనుభూతి తెచ్చే సంతోషం అంతా ఇంతా కాదని అన్నారు. తమిళనాడు నుంచి ఉత్సాహంగా సౌరాష్ట్రకు వచ్చిన ప్రజలకు సౌరాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్సాహంగా స్వాగతం పాలికారన్నారు.

సౌరాష్ట్ర తమిళ సంగమం ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏప్రిల్ 26 న ప్రసంగించనున్నప్రధాన మంత్రి

April 25th, 08:00 pm

సౌరాష్ట్ర తమిళ్ సంగమం ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 26వ తేదీ న ఉదయం పూట 10:30 గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రసంగించనున్నారు.

సౌరాష్ట్ర తమిళ్ సంగమం వీడియో ను షేర్ చేసిన ప్రధాన మంత్రి

April 18th, 10:35 am

సౌరాష్ట్ర తమిళ్ సంగమం వారి సాంస్కృతిక ప్రదర్శనల వీడియో ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా పంచుకున్నారు.