అక్టోబరు 1న ఆర్ఎస్ఎస్ శత వార్షికోత్సవాల్లో పాల్గొననున్న ప్రధానమంత్రి

September 30th, 10:30 am

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతవార్షికోత్సవాలను రేపు (అక్టోబరు 1న) ఉదయం 10:30కి న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దేశ ప్రజలకు ఆర్ఎస్ఎస్ అందిస్తున్న సేవలను ప్రతిబింబించేటట్లు రూపొందించిన ఒక ప్రత్యేక స్మారక తపాలా బిళ్లనూ, స్మారక నాణేన్నీ ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విడుదల చేస్తారు. ఈ సందర్భంగా ఆహ్వానితులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.