జీ-20 సదస్సు మూడో సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటనకు ఆంగ్లానువాదం

November 23rd, 04:05 pm

మనం ప్రోత్సహించే సాంకేతికత, 'ఆర్థిక కేంద్రకం' గా కాకుండా ' మానవ కేంద్రకం' గా ఉండాలి. దేశాలకే పరిమితమై పోకుండా ప్రపంచమంతా ఉపయోగించుకునేలా ఉండాలి. పరిమిత ప్రత్యేక వనరుల విధానాల స్థానంలో అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్-సోర్స్ విధానాలను ప్రోత్సహించాలి. భారత్ ఈ భావనతోనే తన సాంకేతిక ప్రాజెక్టులను రూపొందిస్తోంది.

జీ 20 సమావేశంలో "అందరికీ సమానమైన, న్యాయమైన భవిష్యత్తు"పై ప్రసంగించిన ప్రధానమంత్రి

November 23rd, 04:02 pm

జీ20 శిఖరాగ్ర సదస్సు మూడో సమావేశంలో “అందరికీ సమానమైన, న్యాయమైన భవిష్యత్తు – క్లిష్టమైన ఖనిజాలు, మంచి పని, కృత్రిమ మేధస్సు” అనే అంశంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. క్లిష్టమైన సాంకేతికతలను ప్రోత్సహించే విధానంలో మౌలికమైన మార్పు అవసరమని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అటువంటి సాంకేతిక అన్వయాలు ఆర్థిక ప్రాధాన్యాలుగా కాకుండా ప్రజా ప్రాధాన్యాలుగా, ఉండాలని, 'జాతీయ' కాకుండా ‘అంతర్జాతీయం’ గా ఉండాలని, 'ప్రత్యేక నమూనాలకు' బదులుగా ‘స్వేచ్చా వనరుల‘ ఆధారంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ దృక్పథం భారత సాంకేతిక వ్యవస్థలో భాగమైందని, ఇది అంతరిక్ష ప్రయోగాలు, కృత్రిమ మేధ, డిజిటల్ చెల్లింపులు మొదలైన ప్రతి రంగంలోనూ భారత్ ను ప్రపంచ నాయకత్వ స్థాయిలో నిలిపి గణనీయమైన ప్రయోజనాలు అందించిందని ఆయన వివరించారు.