‘డిజిటల్ అభివృద్ధి పురస్కారం 2025’ను గెలిచినందుకు భారతీయ రిజర్వు బ్యాంకుకు ప్రధానమంత్రి ప్రశంసలు
March 16th, 02:00 pm
‘డిజిటల్ అభివృద్ధి పురస్కారం 2025’ను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గెలిచినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆర్‌బీఐని ప్రశంసించారు. బ్రిటన్ లోని లండన్‌లో సెంట్రల్ బ్యాంకింగ్ ఈ పురస్కారంతో ఆర్‌బీఐని సత్కరించింది. ఆర్‌బీఐ సంస్థాగత డెవలపర్ టీం రూపొందించగా, అమలులోకి తెచ్చిన వినూత్న డిజిటల్ కార్యక్రమాలు ‘ప్రవాహ్’, ‘సారథి’లకు సెంట్రల్ బ్యాంకింగ్ గుర్తింపు లభించింది.