ఢిల్లీలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
March 08th, 03:54 pm
అభివృద్ధికి కొత్త వేగం ఇచ్చేందుకు మనమందరం నేడు ఇక్కడ ఢిల్లీలో సమావేశమయ్యాం. కాసేపటి క్రితమే, ముప్పై మూడున్నర వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగాయి. మెట్రో విస్తరణ మొదలుకొని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల గృహనిర్మాణం వరకు రాజధానిలోని సౌకర్యాలు నిరంతరం బలోపేతం అవుతున్నాయి, ఇది నగరానికి కొత్త శక్తిని ఇస్తోంది. ఏడాది క్రితం ఢిల్లీ ప్రజలైన మీరు ఏ నమ్మకంతో, ఆశతో ఇక్కడ బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, ఆ సంకల్పం ఇప్పుడు ఈ అభివృద్ధి పనుల్లో కనిపిస్తోంది. ఈ నిరంతర ప్రగతి సందర్భంగా ఢిల్లీ పౌరులందరికీ నా హృదయపూర్వక అభినందనలు.ఢిల్లీలో సుమారు రూ. 33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 08th, 10:26 am
దేశ రాజధానీ నగరం ఢిల్లీలో సుమారు రూ. 33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఢిల్లీ అభివృద్ధికి కొత్త వేగాన్ని అందించడానికి మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం” అని పేర్కొన్నారు.మార్చి 8న ఢిల్లీలో రూ. 33,500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధానమంత్రి
March 06th, 05:23 pm
మార్చి 8వ తేదీ మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ఢిల్లీలో రూ.33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ముందు సరోజినీ నగర్‌లోని జీపీఆర్‌ఏ టైప్-5 వసతి గృహాలను సందర్శించి.. అక్కడ మహిళలకు కేటాయించిన నివాసాల ఇంటి తాళంచెవులను ప్రధానమంత్రి స్వయంగా అందజేస్తారు.