భగవాన్ బుద్ధుని పవిత్ర పిప్రహ్వా అవశేషాల బృహత్తర అంతర్జాతీయ ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 03rd, 12:00 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులైన గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కిరణ్ రిజిజు గారు, రాందాస్ అథవాలే గారు, రావు ఇందర్‌జిత్ గారు... ఢిల్లీ ముఖ్యమంత్రికి ముందుగా నిర్ణయించిన వేరే కార్యక్రమం ఉన్నందున వారు వెళ్లిపోయారు... ఇక్కడ ఉన్న ఢిల్లీకి చెందిన ఇతర మంత్రులు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ సక్సేనా గారు, మహాశయులారా, గౌరవనీయ దౌత్య బృంద సభ్యులారా, బౌద్ధ పండితులారా, ధమ్మ అనుచరులారా, సోదరీ సోదరులారా...భగవాన్ బుద్ధుడికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను న్యూఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 03rd, 11:30 am
న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్‌లో ఇవాళ ద లైట్ అండ్ ద లోటస్: రిలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్ పేరిట భగవాన్ బుద్ధునికి సంబంధించిన పవిత్రమైన పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. 125 ఏళ్ల తర్వాత భారత వారసత్వం తిరిగి వచ్చిందని, దేశ సంపద పునరాగమనం చేసిందన్నారు. నేటి నుంచి భారత ప్రజలు గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను దర్శించుకుని, ఆయన ఆశీస్సులు పొందవచ్చని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ శుభ సందర్భంగా అతిథులకు స్వాగతం పలికిన శ్రీ నరేంద్ర మోదీ, శుభాకాంక్షలు తెలియజేశారు. బౌద్ధ సన్యాసులు, ధర్మ ఆచార‌్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రణామాలు తెలియజేశారు. వారి ఉనికి కార్యక్రమానికి కొత్త శక్తినిచ్చిందని తెలిపారు. 2026 ప్రారంభంలోనే ఈ పవిత్ర వేడుక జరగటం స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి అన్నారు. భగవాన్ బుద్ధుని ఆశీస్సులతో 2026వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా శాంతి, సంపద, సామరస్యంతో నవశకానికి నాంది పలకాలని ఆకాంక్షించారు.న్యూఢిల్లీలో నిర్వహించిన జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
September 12th, 04:54 pm
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ గారు, విద్యావేత్తలు, సోదరీసోదరులారా!‘జ్ఞాన భారతం’ పోర్టల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
September 12th, 04:45 pm
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన ‘జ్ఞాన భారతం’ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత స్వర్ణయుగ పునరుజ్జీవనానికి విజ్ఞాన్ భవన్ సాక్ష్యంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల కిందటే జ్ఞాన భారతం కార్యక్రమం గురించి తాను ప్రకటించగా, స్వల్ప వ్యవధిలోనే ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుండటం విశేషమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంతో ముడిపడిన పోర్టల్‌ను కూడా ప్రారంభించామని శ్రీ మోదీ వెల్లడించారు. ఇది ప్రభుత్వం లేదా విద్యా వ్యవస్థ సంబంధిత కార్యక్రమం కాదని, భారతీయ సంస్కృతి-సాహిత్యం, చైతన్య గళంగా జ్ఞాన భారతం ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. వేల తరాల సాలోచనా వారసత్వాన్ని ప్రస్తావిస్తూ- మహనీయులైన రుషులు, ఆచార్యులు, పండితుల జ్ఞానం, పరిశోధనలను ఆయన గుర్తుచేశారు. భారతీయ జ్ఞానం, సంప్రదాయాలు, శాస్త్రీయ వారసత్వానికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. మనకు సంక్రమించిన ఈ సుసంపన్న వారసత్వాన్ని జ్ఞాన భారతం కార్యక్రమం ద్వారా డిజిటలీకరిస్తామని శ్రీ మోదీ వెల్లడించారు. దీనిపై ప్రజలకు అభినందించడంతోపాటు ఈ మిషన్ నిర్వహణ బృందం సభ్యులకు, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ సందర్భంగా ప్రధాని ప్రసంగం
April 11th, 11:00 am
ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాధ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, బనాస్ డెయిరీ ఛైర్మన్ శంకర్‌భాయ్ చౌధురి, ఆశీస్సులు అందించడానికి ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరైన నా ప్రియ కుటుంబ సభ్యులందరికీ..ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్ వారణాసిలో రూ.3,880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
April 11th, 10:49 am
ఈ రోజు ఉత్తరప్రదేశ్ వారణాసిలో రూ. 3,880 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, కాశీ నగరంతో తనకు గల గాఢానుబంధాన్ని గురించిన అనుభూతులను పంచుకున్నారు. తన కుటుంబ సభ్యులు, ప్రాంత ప్రజలు తనకు అందించిన ఆశీస్సులకు, తనపై కురిపించే ఆదరాభిమానాలకు శ్రీ మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలందించే ప్రేమ తనను రుణగ్రస్తుడిని చేసిందని, తాను కాశీకి, కాశీ తనకు చెందుతుందన్నారు. రేపు హనుమాన్ జన్మోత్సవమని గుర్తు చేస్తూ, కాశీలోని సంకట మోచన మహారాజ్ ను సందర్శించే గౌరవం తనకు దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. హనుమాన్ జన్మోత్సవ పావన సందర్భాన్ని జరుపుకోవడానికి ముందస్తుగా అభివృద్ధిని వేడుక చేసుకునేందుకు కాశీ ప్రజానీకం తరలి రావడం హర్షదాయకమన్నారు.ఏప్రిల్ 11న ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పర్యటన
April 09th, 09:43 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 11న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. వారణాసిలో ప్రధాని... ఉదయం 11 గంటలకు రూ. 3,880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తారు.థాయిలాండ్‌లో సంవాద్ కార్యక్రమం ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
February 14th, 08:30 am
థాయిలాండ్‌లో జరుగుతున్న ఈ సంవాద్ (SAMVAD) కార్యక్రమంలో మీ అందరితో భేటీ కావడం నాకు దక్కిన గౌరవం. థాయిలాండ్‌తోపాటు భారత్, జపాన్ కు చెందిన అనేక మంది ప్రముఖులు, ప్రధాన సంస్థలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో పాలుపంచుకొంటున్నాయి. వారు చేస్తున్న ప్రయత్నాలకు గాను వారికి నా అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.థాయ్‌లాండ్‌లో జరిగిన సంవాద్ కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రసంగ సారాంశం
February 14th, 08:10 am
థాయ్‌లాండ్‌లో జరిగిన సంవాద్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ వీడియో సందేశం ద్వారా ఈరోజు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ... థాయ్‌లాండ్‌లో జరుగుతున్న సంవాద్‌లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. దీన్ని నిర్వహించేందుకు భారత్, జపాన్, థాయ్‌లాండ్‌కు చెందిన సంస్థలు, వ్యక్తులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి శుభాకాంక్షలు తెలియజేశారు.అంతర్జాతీయ అభిధమ్మ దివస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 17th, 10:05 am
సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు జీ, భదంత్ రాహుల్ బోధి మహాథెరో జీ, గౌరవ జాంగ్‌చుప్ చోడెన్ జీ, మహాసంఘ గౌరవ సభ్యులు, ప్రముఖులు, దౌత్య సంఘం సభ్యులు, బౌద్ధ పండితులు, బుద్ధుని బోధనలను ఆచరిస్తున్నవారు, సోదరసోదరీమణులారా.అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 17th, 10:00 am
అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీకి గుర్తింపు వచ్చిన సందర్భంగానూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. అభిధమ్మను బోధించిన అనంతరం స్వర్గం నుంచి బుద్ధుడు తిరిగి వచ్చిన రోజును అభిధమ్మ దివస్‌గా పాటిస్తారు. బుద్ధుని అభిధమ్మ బోధనలు పాళీ భాషలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాచీన భాషగా పాళీకి ఇటీవల దక్కిన గుర్తింపు... ఈ ఏడాది అభిధమ్మ దివస్ వేడుకల ప్రాధాన్యాన్ని పెంచింది.Swarved Mahamandir is a modern symbol of India’s social and spiritual strength: PM Modi
December 18th, 12:00 pm
PM Modi inaugurated Swarved Mandir in Umaraha, Varanasi, UP. He highlighted the contributions of Maharshi Sadafal Dev Ji towards knowledge and Yog in the previous century and said that its pine light has transformed the lives of millions of people around the world. He expressed confidence that every offering to the Mahayajna will strengthen the resolve of Viksit Bharat.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో స్వర్వేద్ మహామందిర్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
December 18th, 11:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని ఉమరహాలో స్వర్వేద్ మహామందిర్‌ను ప్రారంభించారు. మహర్షి సదాఫల్ దేవ్ జీ మహారాజ్ విగ్రహానికి నివాళులర్పించిన ప్రధాన మంత్రి, ఆలయ సముదాయాన్ని సందర్శించారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, తాను కాశీ సందర్శకు ఈరోజు రెండో రోజు అని, కాశీలో గడుపుతున్న ప్రతి క్షణమూ అపూర్వమైన అనుభూతులతో నిండిపోతుందని వ్యాఖ్యానించారు. రెండేళ్ల క్రితం అఖిల భారతీయ విహంగం యోగ్ సంస్థాన్ వార్షిక ఉత్సవాలను గుర్తుచేసుకున్న ప్రధాన మంత్రి, ఈ ఏడాది శతాబ్ది ఉత్సవాల్లో భాగమయ్యే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ విహంగం యోగ సాధన వంద సంవత్సరాల మరపురాని ప్రయాణాన్ని సాధించిందని అన్నారు. మునుపటి శతాబ్దంలో జ్ఞానం, యోగా పట్ల మహర్షి సదాఫల్ దేవ్ జీ చేసిన సేవలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. దాని దివ్య కాంతి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చిందని అన్నారు. ఈ శుభ సందర్బంగా, 25,000 కుండియా స్వర్వేద్ జ్ఞాన మహాయజ్ఞం నిర్వహించడాన్ని ప్రధాన మంత్రి ప్రస్తుతించారు. మహాయజ్ఞానికి ఇచ్చే ప్రతి సమర్పణ వికసిత్ భారత్ సంకల్పాన్ని బలపరుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అతను మహర్షి సదాఫల్ దేవ్ జీ కి నివాళులు అర్పిస్తూ, దర్శనాన్ని అందించిన సాధువులందరికీ కూడా తన నివాళులర్పించాడు.జి-20 దేశాల సాంస్కృతిక మంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రసంగం
August 26th, 10:15 am
కాశీగా సుప్రసిద్ధమైన వారణాసికి మీ అందరికీ స్వాగతం. నా పార్లమెంటరీ నియోజకవర్గం అయిన వారణాసిలో మీరు సమావేశం కావడం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది. కాశీ ప్రపంచంలోనే అతి పురాతన నగరమే కాదు, భగవాన్ బుద్ధుడు తొలిసారిగా బోధలు చేసిన సారనాథ్ కు సమీపంలోని నగరం. కాశీ ‘‘జ్ఞానసంపద, ధర్మం, సత్యరాశి’’ గల నగరంగా ప్రసిద్ధి చెందింది. అది భారతదేశానికి వాస్తవమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక రాజధాని. మీరంతా గంగా హారతిని తిలకించేందుకు, సారనాథ్ సందర్శనకు, కాశీ రుచులు చవి చూసేందుకు కొంత సమయం కేటాయించుకున్నారని నేను ఆశిస్తున్నాను.జి-20 సాంస్కృతిక మంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 26th, 09:47 am
కాశీగా ప్రసిద్ధి చెందిన వారణాసికి ప్రతినిధులను ఆహ్వానిస్తూ తన పార్లమెంటరీ నియోజకవర్గం కూడా అయిన ఈ నగరంలో జి-20 సాంస్కృతిక మంత్రుల సమావేశం జరగడం పట్ల ఆనందం ప్రకటించారు. పురాతన కాలం నుంచి సజీవంగా ఉన్న నగరాల్లో కాశీ ఒకటని పేర్కొంటూ ఈ నగరానికి సమీపంలోనే ఉన్న సారనాథ్ లో భగవాన్ బుద్ధుడు తన తొలి బోధ చేశాడని గుర్తు చేశారు. ‘‘కాశీ జ్ఞానసంపద, విధినిర్వహణ, సత్యానికి ప్రతీక; అది అసలు సిసలైన భారత సాంస్కృతిక, ఆధ్యాత్మక రాజధాని’’ అన్నారు. నగరంలో జరిగే గంగా హారతిని వీక్షించాలని, సారనాథ్ సందర్శించడంతో పాటు కాశీలోని రుచికరమైన వంటలు రుచి చూడాలని ప్రధానమంత్రి అతిథులకు సూచించారు.ఢిల్లీలోని గ్లోబల్ బౌద్ధ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం
April 20th, 10:45 am
కార్యక్రమంలో నాతో పాటు ఉన్న కేంద్ర మంత్రివర్గ సభ్యులు శ్రీ కిరణ్ రిజిజు జీ, జి. కిషన్ రెడ్డి జీ, అర్జున్ రామ్ మేఘవాల్ జీ, మీనాక్షి లేఖి జీ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సెక్రటరీ జనరల్, భారతదేశం మరియు విదేశాల నుండి వచ్చిన గౌరవనీయులైన సన్యాసులు, ఇతర ప్రముఖులు , లేడీస్ అండ్ జెంటిల్మెన్!న్యూ ఢిల్లీ లో జరిగిన గ్లోబల్ బుద్ధిస్ట్ సమిట్ ప్రారంభిక సదస్సు లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
April 20th, 10:30 am
ప్రపంచ బౌద్ధ ధర్మ శిఖర సమ్మేళనం ఈ రోజు న న్యూ ఢిల్లీ లో హోటల్ అశోక్ లో జరగగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ శిఖర సమ్మేళనం యొక్క ప్రారంభిక సదస్సు లో పాలుపంచుకొని, సభికుల ను ఉద్దేశించి ప్రసంగిచారు. ప్రధాన మంత్రి ఒక ఛాయాచిత్ర ప్రదర్శన లో కలియతిరిగారు; బుద్ధుని ప్రతిమ కు ఆయన పుష్పాంజలి ని సమర్పించారు. పంతొమ్మిది మంది ప్రముఖ బౌద్ధ భిక్షువుల కు ప్రత్యేక దుస్తుల (చివర్ దాన) ను కూడా ఆయన అందజేశారు.నేపాల్‌లో జరిగిన 2566వ బుద్ధ జయంతి మరియు లుంబినీ దినోత్సవం 2022 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
May 16th, 09:45 pm
గతంలో కూడా, వైశాఖ పూర్ణిమ రోజున, భగవాన్ బుద్ధునికి సంబంధించిన దివ్య స్థలాలను, ఆయనతో సంబంధం ఉన్న కార్యక్రమాల కోసం సందర్శించే అవకాశాలు నాకు లభిస్తున్నాయి. మరియు ఈ రోజు, భారతదేశానికి స్నేహితుడైన నేపాల్‌లోని బుద్ధ భగవానుడి పవిత్ర జన్మస్థలమైన లుంబినీని సందర్శించే అవకాశం నాకు లభించింది. కొంతకాలం క్రితం మాయాదేవి ఆలయాన్ని సందర్శించే అవకాశం కూడా నాకు మరచిపోలేనిది. బుద్ధ భగవానుడు జన్మించిన ప్రదేశం, అక్కడి శక్తి, చైతన్యం, అది భిన్నమైన అనుభూతి. 2014లో ఈ స్థలంలో నేను సమర్పించిన మహాబోధి వృక్షం యొక్క మొక్క ఇప్పుడు చెట్టుగా అభివృద్ధి చెందడం చూసి నేను కూడా సంతోషిస్తున్నాను.నేపాల్‌లోని లుంబినిలో బుద్ధజయంతి వేడుకలు
May 16th, 03:11 pm
నేపాల్‌లోని లుంబినీలోగల అంతర్జాతీయ సమావేశ కేంద్రం-ధ్యాన మందిరంలో నిర్వహించిన 2566వ బుద్ధ జయంతి వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనతోపాటు గౌరవనీయులైన నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బా, ఆయన సతీమణి డాక్టర్ అర్జు రానా దేవ్‌బా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి
November 05th, 10:20 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ కేదార్‌నాథ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మరి కొన్ని కార్యక్రమాలను జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్ర శ్రీ ఆదిశంకరాచార్య సమాధిని . అలాగే ఆదిశంకరాచార్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. కేదార్ నాథ్‌లో అమలు జరుగుతున్న వివిధ మౌలిక సదుపాయాల పనులను ప్రదానమంత్రి పరిశీలించి, వాటి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కేదార్ నాథ్ ఆలయంలో ప్రధానమంత్రి పూజలు నిర్వహింయారు. ఈ సందర్భంగా 12 జ్యోతిర్లింగాలు, 4 ధామ్‌లు, దేశవ్యాప్తంగా పలు ఇతర ప్రాంతాలలో కేదార్ నాథ్ కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని కార్యక్రమాలను కేదార్ ధామ్ ప్రధాన కార్యక్రమంతో అనుసంధానం చేశారు.