సంథాలీ భాషలో భారత రాజ్యాంగం ఆవిష్కరణపై ప్రధానమంత్రి హర్షం
December 26th, 11:26 am
భారత రాజ్యాంగం సంథాలీ భాష ప్రతిని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై అవగాహనకు, ప్రజాస్వామ్యంలో జన భాగస్వామ్యం ఇనుమడించేందుకు ఇది తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు “సంథాలీ సంస్కృతి, దేశ పురోగమనంలో ఆ తెగ ప్రజల పాత్రపై దేశం ఎంతో గర్విస్తోంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ
September 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.