నవ రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ శాసనసభ కొత్త భవనం ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
November 01st, 01:30 pm
ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శ్రీ రమణ్ డేకా, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, రాష్ట్ర శాసనసభ స్పీకర్- నా మిత్రుడు శ్రీ రమణ్ సింగ్, ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరుడు శ్రీ తోఖన్ సాహు, ఉప ముఖ్యమంత్రులు- శ్రీ విజయ్ శర్మ, శ్రీ అరుణ్ సావు, శాసనసభలో ప్రతిపక్ష నేత శ్రీ చరణ్ దాస్ మహంత్, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కార్యక్రమానికి హాజరైన సోదరీసోదరులారా!ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో రాష్ట్ర విధానసభ కొత్త భవనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 01st, 01:00 pm
ఈ రోజు ఛత్తీస్‌గఢ్‌లోని నవా రాయ్‌పూర్‌లో రాష్ట్ర విధానసభ కొత్త భవనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఛత్తీస్‌గఢ్ అభివృద్ధి ప్రయాణంలో ఒక స్వర్ణారంభాన్ని సూచిస్తుందని అన్నారు. వ్యక్తిగతంగా చాలా సంతోషకరమైన రోజు ఇదన్న ఆయన.. దశాబ్దాలుగా పెంచి పోషించిన ఈ ప్రాంతంతో ఉన్న లోతైన భావోద్వేగ బంధాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పార్టీ కార్యకర్తగా ఉన్న సమయాన్ని గుర్తు చేసిన మోదీ.. రాష్ట్రంలో చాలా సమయం గడిపినట్లు, తద్వారా చాలా విషయాలు నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు ఉన్న దార్శనికత, రాష్ట్ర ఆవిర్భావం వెనుక ఉన్న సంకల్పం, అది నెరవేరటం వంటి ప్రతి క్షణానికి సాక్షిగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరివర్తనలోని ప్రతి క్షణాన్ని ఆయన గుర్తుచేశారు. 25 ఏళ్లు అనే ప్రధాన ఘట్టానికి రాష్ట్రం చేరుకున్న వేళ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు కృతజ్ఞత భావంతో ఉన్నట్లు వ్యక్తం చేశారు. రజతోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజల కోసం ఈ కొత్త అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించే అవకాశం దక్కిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఛత్తీస్‌గఢ్ ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలతో పాటు అభినందనలు తెలియజేశారు.తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఆది తిరువత్తిరై ఉత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
July 27th, 12:30 pm
పూజనీయ ఆధీనం మఠాధిపతి గారు, చిన్మయ మిషన్ స్వామీజీలు, తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు, మంత్రివర్గ సహచరుడు డాక్టర్ ఎల్. మురుగన్ గారు, స్థానిక ఎంపీ తిరుమా వలవన్ గారు, వేదికపై ఉన్న తమిళనాడు మంత్రులూ, పార్లమెంటు సహచరుడు ఇళయరాజా గారు, ఒడువర్లు, భక్తులు, విద్యార్థులు, సాంస్కృతిక చరిత్రకారులు, ప్రియమైన సోదరీ సోదరులా! నమఃశివాయ.తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో ఆడి తిరువాతిరై వేడుక సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 27th, 12:25 pm
తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఈ రోజు ఆడి తిరువాతిరై వేడుక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. మున్ముందుగా ఆదిదేవుడైన మహాశివునికి నీరాజనం అర్పిస్తూ- రాజరాజ చోళుడు రాజ్యమేలిన పవిత్ర భూమిలో పరమేశుని దివ్య దర్శనంతో తనలో ఆధ్యాత్మిక శక్తి పెల్లుబికిందని పేర్కొన్నారు. శ్రీ ఇళయరాజా స్వరాలు సమకూర్చిన భక్తి గీతాలాపనను అమితంగా ఆస్వాదించానని చెప్పారు. శైవారాధకులైన ‘ఓతువర్ల’ పవిత్ర మంత్రోచ్చారణ నడుమ సర్వశక్తిమంతుడైన శివుడికి నమస్కరిస్తూ- ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణంతో తాదాత్మ్యం చెందానని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.కాంగ్రెస్-డీఎంకే దశాబ్దాలుగా ఎస్సీ-ఎస్టీ-ఓబీసీలను దూరం చేశాయి: మెట్టుపాళయంలో ప్రధాని మోదీ
April 10th, 03:00 pm
మెట్టుపాళయంలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. దశాబ్దాలుగా ఎస్సీ-ఎస్టీ-ఓబీసీలను కాంగ్రెస్-డీఎంకే నిర్వీర్యం చేశాయి. భారతదేశ ప్రజల సామర్థ్యాన్ని I.N.D.I ఎప్పుడూ విశ్వసించలేదని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా, భారతదేశంలోని MSMEలకు రూ. 2 లక్షల కోట్లు.తమిళనాడులో రెండు బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నప్పుడు వెల్లూరు & మెట్టుపాళయంలో భారీ జనం మద్దతు
April 10th, 10:30 am
లోక్‌సభ ఎన్నికలకు ముందు, తమిళనాడులో రెండు బహిరంగ సభల్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీకి వెల్లూరు మరియు మెట్టుపాళయంలో భారీ జనం మద్దతు పలికారు. చరిత్ర, పురాణాలకు నేను నమస్కరిస్తున్నాను. మరియు వెల్లూరు యొక్క ధైర్యసాహసాలు. వెల్లూర్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక కీలకమైన విప్లవాన్ని సృష్టించింది మరియు ప్రస్తుతం, N.D.Aకి దాని బలమైన మద్దతు 'ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్' స్ఫూర్తిని ప్రదర్శిస్తుంది.BJP’s vision for a developed India contrasts with INDI Alliance’s family-centered politics: PM Modi
February 27th, 04:15 pm
During a public meeting at Tiruppur, Tamil Nadu, Prime Minister Narendra Modi began his address by thanking the people of Tamil Nadu and saying that being with all of you is a great pleasure. “This Kongu region of Tamil Nadu represents India’s growth story in many ways. It is one of India’s most vibrant textile and industry hubs. It also contributes to our country’s wind energy capacity. This region is also known for its spirit of enterprise. Our risk-taking entrepreneurs and MSMEs play a role in making us the fastest-growing economy,” said PM Modi.PM Modi addresses a public meeting in Tiruppur, Tamil Nadu
February 27th, 03:44 pm
During a public meeting at Tiruppur, Tamil Nadu, Prime Minister Narendra Modi began his address by thanking the people of Tamil Nadu and saying that being with all of you is a great pleasure. “This Kongu region of Tamil Nadu represents India’s growth story in many ways. It is one of India’s most vibrant textile and industry hubs. It also contributes to our country’s wind energy capacity. This region is also known for its spirit of enterprise. Our risk-taking entrepreneurs and MSMEs play a role in making us the fastest-growing economy,” said PM Modi.నవంబర్ 8న ‘శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహరాజ్ పాల్ఖీ మార్గ్- శ్రీ సంత్ తుకారాం మహారాజ్ పాల్ఖీ మార్గ్’ కీలక సెక్షన్ల మధ్య నాలుగు వరుసల రహదారికి ప్రధానమంత్రి శంకుస్థాపన
November 07th, 04:24 pm
పంథర్‌పూర్‌కు భక్తుల రాకపోకల సౌలభ్యం దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 నవంబరు 8న ‘శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాల్ఖీ మార్గ్ (ఎన్‌హెచ్-965) పరిధిలోని ఐదు విభాగాలు- ‘శ్రీ సంత్ తుకారాం మహారాజ్ పాల్ఖీ మార్గ్ (ఎన్‌హెచ్-965జి) పరిధిలోని మూడు విభాగాలకు సంబంధించి నాలుగు వరుసల రహదారికి శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు ఆ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ జాతీయ రహదారుల వెంబడి రెండువైపులా ‘పాల్ఖీ’ కోసం ప్రత్యేక నడక మార్గాలు కూడా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల భక్తుల రాకపోకలకు సురక్షిత-అడ్డంకులు లేని అవాంతరాలు లేని సదుపాయం అందుబాటులోకి వస్తుంది.