ఉత్తర ప్రదేశ్‌లోని హర్దోయిలో గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

April 29th, 11:35 am

ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, బ్రజేష్ పాఠక్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు జితిన్ ప్రసాద గారు, పంకజ్ చౌదరి గారు, యూపీ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసిన నా ప్రియమైన సోదరసోదరీలారా!

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో సరికొత్త 594 కిలోమీటర్ల పొడవైన ప్రవేశ నియంత్రిత గంగా ఎక్స్‌ప్రెస్‌ రహదారిని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

April 29th, 11:30 am

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయిలో కొత్తగా నిర్మిస్తున్న 594 కిలోమీటర్ల పొడవైన ప్రవేశ నియంత్రిత గంగా ఎక్స్‌ప్రెస్ రహదారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. నరసింహ పుణ్యక్షేత్రానికి, కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ప్రవహిస్తున్న గంగామాత దివ్య సన్నిధికి నమస్కరిస్తూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతమంతా గంగామాత ఆధ్యాత్మిక శోభతో, మాతృత్వాన్ని పంచే జీవధారతో పునీతమైన పుణ్యక్షేత్రమని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి ఉత్తరప్రదేశ్‌కు లభించిన వరం. సాక్షాత్తు గంగామాత ఆశీర్వాదమే ఇది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ రహదారి ద్వారా పవిత్ర పుణ్యక్షేత్రాలకు చేరుకునే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, కొన్ని గంటల్లోనే అక్కడికి చేరుకోవచ్చని వివరించారు.

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

July 05th, 10:17 am

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు పీఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000ల చొప్పున పరిహారం ప్రకటించారు.

Shri Kalki Dham Temple will emerge as a new center of India’s spirituality: PM Modi

February 19th, 11:00 am

PM Modi laid the foundation stone of Shri Kalki Dham Temple in Sambhal district, UP. Mentioning the 18 year wait for the inauguration of the Dham, PM Modi said that it seems that there are many good works that have been left for him to accomplish.

ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ లో శ్రీ కల్కి ధామ్ ఆలయానికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

February 19th, 10:49 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ జిల్లా లో శ్రీ కల్కి ధామ్ దేవాలయాని కి శంకుస్థాపన చేశారు. శ్రీ కల్కి ధామ్ దేవాలయం యొక్క నమూనా ను కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. శ్రీ కల్కి ధామ్ ను ఆచార్య శ్రీ ప్రమోద్ కృష్ణామ్ చైర్‌మన్ గా ఉన్నటువంటి శ్రీ కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్టు నిర్మిస్తున్నది. ఈ కార్యక్రమం లో అనేక మంది సాధువులు, ధార్మిక నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాలుపంచుకొంటున్నారు.

ఫిబ్రవరి 19 వ తేదీ నాడు శ్రీ కల్కి ధామ్ కు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

February 01st, 09:10 pm

శ్రీ కల్కి ధామ్ కు శంకుస్థాపన చేయడం కోసం తన ను ఆహ్వానించినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శ్రీ ఆచార్య ప్రమోద్ కృష్ణామ్ కు ధన్యవాదాల ను తెలియ జేశారు.