‘పశ్చిమబంగ దివస్’ సందర్భంగా హుగ్లీలో నిర్వహించిన వేడుకలకు హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 19th, 11:54 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ‘పశ్చిమబంగ దివస్’ (పశ్చిమ బెంగాల్ దినోత్సవం) వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీతో చారిత్రక సంబంధం గల హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది “పశ్చిమ బెంగాల్: వారసత్వం-సామరస్యం-అభివృద్ధి” ఇతివృత్తంగా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక ఐక్యతను, ప్రగతిపై ప్రజాకాంక్షలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తున్నారు.పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని 5 జిల్లాలను కలుపుతూ రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనితో భారతీయ రైల్వే ప్రస్తుత నెట్‌వర్క్ సుమారు 192 కిలోమీటర్ల మేర పెరుగుతుంది.
March 10th, 04:19 pm
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని ఐదు జిల్లాలను కలుపుతూ రూ.4,474 కోట్ల విలువైన రెండు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. పీఎం-గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద ప్రణాళిక చేయబడిన ఈ ప్రాజెక్టులు, ఈ ప్రాంత ప్రజలను ఆత్మనిర్భర్గా మార్చాలన్న ప్రధాని నూతన భారత్ దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయి.