పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు పుతిన్

September 17th, 07:14 pm

రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్‌ పుతిన్‌తో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ

August 18th, 05:27 pm

రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీకి ఫోన్‌ చేశారు. గత వారం అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశం గురించి అధ్యక్షుడు పుతిన్ తన అంచనాను మోదీతో పంచుకున్నారు. పుతిన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో దౌత్యం, శాంతియుత చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించాలనే భారత స్థిరమైన వైఖరికి భారత్‌ కట్టుబడి ఉందన్న విషయాన్ని ప్రధానమంత్రి మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో జరిగే ప్రయత్నాలకు భారత్‌ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.

రష్యా సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయ వ్లాదిమిర్‌ పుతిన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్‌ సంభాషణ

December 20th, 08:46 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ర‌ష్యా స‌మాఖ్య అధ్య‌క్షుడు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణ సందర్భంగా- ఇటీవల అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌ సందర్శనకు వచ్చినపుడు వారిమధ్య చర్చనీయాంశాల పురోగతిపై అధినేతలిద్దరూ సమీక్షించారు. వీటికి సంబంధించి భవిష్యత్‌ చర్యలతోపాటు రక్షణ సహకారం, ఎరువుల సరఫరాలో సహకారం, రష్యా దూరప్రాచ్య ప్రాంతాలతో భారత్‌ చర్చల విస్తరణ తదితరాలకుగల అవకాశాలు కూడా నేటి సంభాషణలో ప్రస్తావనకు వచ్చాయి. అదేవిధంగా అంతర్జాతీయ అంశాలపై వారు పరస్పరం అభిప్రాయాలు తెలుసుకున్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని కలిసిన - రష్యా సమాఖ్య భద్రతా మండలి కార్యదర్శి శ్రీ నికోలాయ్ పాత్రుషేవ్

September 08th, 07:51 pm

రష్యా సమాఖ్య భద్రతా మండలి కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నికోలాయ్ పాత్రుషేవ్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ర‌శ్యన్ ఫెడ‌రేశ‌న్ విదేశాంగ మంత్రి శ్రీ సర్జెయి లెవ్ రోవ్ భేటీ

January 15th, 05:44 pm

రైసీనా డైలాగ్ లో పాలు పంచుకోవడం కోసం భారతదేశాని కి విచ్చేసిన ర‌శ్యన్ ఫెడ‌రేశ‌న్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సర్జెయి లెవ్ రోవ్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న సమావేశమయ్యారు.