“వ్యవసాయ రంగం-గ్రామీణ రూపాంతరీకరణ” ఇతివృత్తంపై బడ్జెట్‌ అనంతర వెబినార్‌లో ప్రధానమంత్రి ప్రసంగం

March 06th, 01:14 pm

బడ్జెట్ అనంతరం నిర్వహిస్తున్న మూడో వెబినార్‌కు మీ అందర్నీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. తొలి రెండు వెబినార్లలో సాంకేతికత, సంస్కరణలు, ఆర్థిక వృద్ధి వంటి కీలకాంశాలపై మనం సమీక్షించాం. ఇక నేటి వెబినార్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ-వ్యవసాయం వంటి ప్రధాన రంగాలపై చర్చ కేంద్రీకృతమైంది. బడ్జెట్‌ తయారీ ప్రక్రియలో మీరంతా విలువైన సూచనలతో ఎంతగానో తోడ్పడ్డారు. మీరిచ్చిన సూచనలు, సలహాలు బడ్జెట్‌లో ప్రతిబింబించడంతో అవెంతో ఉపయుక్తమయ్యాని కూడా మీరు గమనించి ఉంటారు. అయితే, బడ్జెట్ సమర్పణ అనంతరం దేశం దాని పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి, ఇప్పుడు మీ అనుభవం, సూచనలతో ప్రజలకు అత్యధికంగా బడ్జెట్ ప్రయోజనాలు అందేవిధంగా సరళ మార్గాలను అనుసరించడం చాలా ముఖ్యం. తదనుగుణంగా బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి పైసాను పూర్తి స్థాయిలో సకాలంలో వినియోగించడంపై ఈ వెబినార్‌ సందర్భంగా మీరిచ్చే సలహాలకు ప్రాధాన్యం ఉంటుంది.

వ్యవసాయం, గ్రామీణ పరివర్తన అంశాలపై పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 06th, 01:00 pm

వ్యవసాయం, గ్రామీణ పరివర్తన అంశంపై పోస్ట్ బడ్జెట్ మూడో వెబినార్‌ను ఉద్దేశించి ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సాంకేతికత, ఆర్థిక వృద్ధిపై గతంలో జరిగిన సమావేశాలను గుర్తు చేసుకుంటూ, బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములందరూ ఎంతో సహకారాన్ని అందించారని ప్రధానమంత్రి తెలిపారు. బడ్జెట్ అనంతరం, దేశ సామర్థ్యానికి అనుగుణంగా పూర్తి ప్రయోజనాలను పొందటం ముఖ్యం. ఈ దిశగా మీ సూచనలు, ఈ వెబినార్ ఎంతో కీలకమైనవి అని ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

సెప్టెంబరు 17న మధ్యప్రదేశ్‌లో ప్రధాని పర్యటన

September 16th, 02:49 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ధార్‌లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్’, ‘8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవ’ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పలు ఇతర కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతోపాటు ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తారు.

మిజోరాంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం

September 13th, 10:30 am

అందమైన ఈ నీలి పర్వత క్షేత్రాన్ని కాపాడుతున్న సర్వోన్నతుడైన దేవుడు పతియన్‌కు నమస్కరిస్తున్నాను. నేనిక్కడ మిజోరాంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో ఉన్నాను. దురదృష్టవశాత్తు వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఐజ్వాల్‌లో మీ మధ్య లేనందుకు చింతిస్తున్నాను. కానీ ఈ మాధ్యమం నుంచి కూడా మీ ప్రేమాదరాలను నేను ఆస్వాదిస్తున్నాను.

మిజోరంలోని ఐజ్వాల్‌లో 9వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభించిన ప్రధానమంత్రి

September 13th, 10:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మిజోరంలోని ఐజ్వాల్‌లో రూ. 9000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించారు. రైల్వేలు, రోడ్డు మార్గాలు, ఇంధనం, క్రీడలు వంటి అనేక రంగాలకు ఈ ప్రాజెక్టులు ప్రయోజనం కలిగించనున్నాయి. వీడియో అనుసంధానం ద్వారా సభికులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి.. నీలి పర్వతాలతో కూడిన అందమైన ఈ భూమిని రక్షిస్తున్న భగవాన్ పతియాన్‌కు నమస్కరించారు. తాను మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో ఉన్నానన్న ప్రధానమంత్రి.. ప్రతికూల వాతావరణం కారణంగా ఐజ్వాల్‌లో ప్రజలను కలుసుకోలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. ఈ మాధ్యమం ద్వారా కూడా తాను ప్రజల ప్రేమ, ఆప్యాయతల అనుభూతిని పొందగలనని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలతో పాడి రైతులకు సాధికారతతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం: ప్రధానమంత్రి

September 04th, 08:43 pm

రాష్ట్రీయ గోకుల్ మిషన్, సహకార సంస్థలకు మెరుగైన మద్దతు, అన్ని రంగాల్లో నిరంతర సంస్కరణల వంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం పాడి పరిశ్రమను ఆధునికీకరించడం, మరింత శక్తిమంతం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తోంది. తాజా #NextGenGST సంస్కరణలు ఈ లక్ష్యం దిశగా ఒక కీలక ముందడుగును సూచిస్తాయి.

ఆగస్టు 2న వారణాసిలో ప్రధాని పర్యటన

July 31st, 06:59 pm

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దాదాపు రూ. 2200 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆగస్టు 2న ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగిస్తారు.

‘పిఎంఎవై’ కింద 3 కోట్ల అదనపు గ్రామీణ-పట్టణ గృహాలతో కోట్లాది పౌరుల ఆత్మగౌరవం.. ‘జీవన సౌలభ్యం’ ఇనుమడిస్తాయి: ప్రధానమంత్రి

June 10th, 09:54 am

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా 3 కోట్ల గ్రామీణ-పట్టణ గృహాల నిర్మాణంపై నిర్ణయం వల్ల దేశంలో గృహ అవసరాలను తీర్చగలమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అంతేగాక ప్రతి పౌరుడి మెరుగైన జీవన ప్రమాణాలకు భరోసా ఇచ్చే దిశగా ప్రభుత్వ నిబద్ధతను ఈ నిర్ణయం సుస్పష్టం చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

అత్యుత్తమమైనపర్యటక గ్రామం పోటీ లో పాలుపంచుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి

February 21st, 03:50 pm

అత్యుత్తమమైన పర్యటక గ్రామం తాలూకు పోటీ లో పాలుపంచుకోవలసింది గా అందరికీ, మరీ ముఖ్యం గా యువజనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. అత్యుత్తమ పర్యటక గ్రామం పోటీ ని పర్యటక మంత్రిత్వ శాఖ ప్రారంభిస్తున్నది.

క్యాబినెట్ 2022-23 మార్కెటింగ్ సీజన్ కోసం రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పి) పెంచింది

September 08th, 02:49 pm

రబీ మార్కెటింగ్ సీజన్ (RMS) 2022-23 కోసం అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పి) పెంచడానికి గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.

టెక్స్‌టైల్స్‌ రంగానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకాన్ని ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ప్రపంచ టెక్స్‌టైల్‌ వ్యాపారంలో భారత్ తన ఆధిపత్యాన్ని తిరిగి పొందేందుకు వీలు కలుగుతుంది.

September 08th, 02:49 pm

గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా అడుగులు ముందుకు వేస్తూ, బడ్జెట్‌తో ఎంఎంఎఫ్‌ అపెరల్, ఎంఎంఎఫ్‌ ఫ్యాబ్రిక్స్ మరియు టెక్నికల్ టెక్స్‌టైల్స్ 10 విభాగాలు/ ఉత్పత్తుల కోసం రూ. 10,683 కోట్లతో పిఎల్‌ఐ పథకాన్ని ఆమోదించింది. వస్త్రపరిశ్రమ కోసం పిఎల్‌ఐతో పాటు ఆర్‌ఓఎస్‌సిటిఎల్‌,ఆర్‌ఓడిటిఈపి మరియు ప్రభుత్వ ఇతర చర్యలు ఉదాహరణకు సరసమైన ధరకు ముడిసరుకు అందించడం, నైపుణ్యాభివృద్ధి మొదలైనవి వస్త్రాల తయారీలో కొత్త యుగాన్ని తెలియజేస్తాయి.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఆరోగ్య‌రంగ కార్య‌క‌ర్త‌ల‌ను, కోవిడ్ టీకా ల‌బ్ధిదారుల‌నుద్దేశించి ప్ర‌ధాని ప్ర‌సంగం

September 06th, 11:01 am

దేశ ప్ర‌ధానిగానే కాకుండా ఒక కుటుంబ స‌భ్యునిగా చెబుతున్నాను. నేను గ‌ర్వించ‌ద‌గ్గ అవ‌కాశాన్ని హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ రాష్ట్రం నాకు ఇచ్చింది. ఒక‌ప్పుడు చిన్న చిన్న ప్ర‌యోజ‌నాల‌కోసం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ పోరాటం చేసేది. ఇప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి క‌థ‌నాన్ని ర‌చించడాన్ని నా క‌ళ్లారా చూస్తున్నాను. దైవ కృప కార‌ణంగాను, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న స‌మ‌యోచిత విధానాల కార‌ణంగాను రాష్ట్ర ప్ర‌జ‌ల చైత‌న్యంకార‌ణంగాను ఇదంతా సాధ్య‌మ‌వుతోంది. మీ అంద‌రితో సంభాషించే అవ‌కాశం ల‌భించినందుకు మ‌రొక్క‌సారి మీకు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. మొత్తం టీమ్ స‌భ్యుల‌కు అభినంద‌నలు. ఒక టీమ్ లాగా ఏర్ప‌డి అద్భుత‌మైన విజ‌యాన్ని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రం కైవ‌సం చేసుకుంది. మీ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగ శ్రామికుల తో, కోవిడ్ టీకాక‌ర‌ణ కార్య‌క్ర‌మం ల‌బ్ధిదారుల‌ తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి

September 06th, 11:00 am

హిమాచ‌ల్‌ ప్ర‌దేశ్ లో ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగ శ్రామికుల తోను, కోవిడ్ టీకాక‌ర‌ణ కార్య‌క్రమం తాలూకు ల‌బ్ధిదారుల తోను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మాట్లాడారు. ఈ సంద‌ర్భం లో ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌, ముఖ్య‌మంత్రి, శ్రీ జె.పి. నడ్డా, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ , పార్లమెంట్ సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, పంచాయ‌తీ నాయ‌కులు, త‌దిత‌రులు హాజరయ్యారు.

కోవిడ్ -19 పరిస్థితిపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి జరిపిన సంభాషణ పూర్తి పాఠం

July 16th, 12:07 pm

కరోనాకు వ్యతిరేకంగా దేశం చేస్తోన్న పోరాటంలో అనేక ముఖ్యమైన సమస్యలపై మీరందరూ మీ అభిప్రాయాన్ని చెప్పారు. రెండు రోజుల క్రితం ఈశాన్య ప్రాంతంలోని గౌరవనీయ ముఖ్యమంత్రులందరితో కూడా ఈ అంశంపై చర్చించే అవకాశం నాకు లభించింది. పరిస్థితి ఆందోళన కలిగించే రాష్ట్రాలతో నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను.

కోవిడ్ స్థితి పై చ‌ర్చించ‌డం కోసం 6 రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల తో స‌మావేశం నిర్వ‌హించిన ప్ర‌ధాన మంత్రి

July 16th, 12:06 pm

కోవిడ్ కు సంబంధించిన స్థితి ని గురించి చ‌ర్చించ‌డం కోసం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ త‌మిళ నాడు, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్నాట‌క‌, ఒడిశా, మ‌హారాష్ట్ర, కేర‌ళ ల ముఖ్య‌మంత్రుల తో స‌మావేశ‌మ‌య్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఈ స‌మావేశం లో పాల్గొన్నారు. కోవిడ్ ను ఎదుర్కోవ‌డం లో సాధ్య‌మైన అన్ని విధాలు గాను సాయాన్ని అందించిన ప్ర‌ధాన మంత్రి కి ముఖ్య‌మంత్రులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. వారి వారి రాష్ట్రాల లో వైర‌స్ వ్యాప్తి ని క‌ట్ట‌డి చేయడం కోసం తీసుకొంటున్న‌ చ‌ర్య‌ల ను గురించి, పౌరుల కు టీకా మందు ఇప్పించే కార్య‌క్ర‌మం లో పురోగ‌తి ని గురించి ప్ర‌ధాన మంత్రి దృష్టి కి ముఖ్య‌మంత్రులు తీసుకు వ‌చ్చారు. పౌరుల కు టీకా మందు ఇప్పించే వ్యూహాని కి సంబంధించిన క్షేత్ర స్థాయి స్పంద‌న ను కూడా వారు తెలియ‌ జేశారు.

కోవిడ్ -19 ప‌రిస్థితుల‌పై రాష్ట్ర‌, జిల్లాస్థాయి అధికారుల‌తో ప్రధాన మంత్రి సంభాషణ పాఠం

May 20th, 11:40 am

Prime Minister Shri Narendra Modi interacted with the state and district officials on the COVID-19 situation through video conference.

కోవిడ్ -19 ప‌రిస్థితుల‌పై రాష్ట్ర‌, జిల్లాస్థాయి అధికారుల‌తో మాట్లాడిన ప్ర‌ధానమంత్రి

May 20th, 11:39 am

కోవిడ్ -19 ప‌రిస్థితుల‌పై రాష్ట్ర‌స్థాయి, జిల్లా అధికారుల‌తో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా మాట్లాడారు.

కోవిడ్ -19 నిర్వహణపై రాష్ట్ర, జిల్లా అధికారులతో చర్చ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

May 18th, 11:40 am

Prime Minister Modi through video conference interacted with field officials from States and Districts regarding their experience in handling the Covid-19 pandemic. During the interaction, the officials thanked the Prime Minister for leading the fight against the second wave of Covid from the front.

కోవిడ్ పరిస్థితిపై చర్చకు దేశంలోని వైద్యుల బృందంతో ప్రధానమంత్రి సమావేశం

May 18th, 11:39 am

కోవిడ్ సంబంధిత పరిస్థితులపై చర్చించడం కోసం దేశవ్యాప్తంగాగల వైద్యుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సమావేశమయ్యారు.

దేశంలో కోవిడ్.. టీకాల పరిస్థితిపై ప్రధాన మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష

May 15th, 02:42 pm

దేశంలో కోవిడ్.. టీకాల కార్యక్రమానికి సంబంధించిన పరిస్థితులపై ప్రధానమంత్రి ఇవాళ తన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశమంతటా ప్రస్తుత కోవిడ్ స్థితిగతుల గురించి అధికారులు ప్రధానికి వివరించారు.