న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య మహా సమ్మేళనం 2025 ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

October 31st, 07:00 pm

ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించండి. ఈ రోజు సర్దార్ సాహెబ్ 150వ జయంతి. ఏక్తానగర్లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. దాని వల్ల ఇక్కడికి రావడం ఆలస్యమైంది. ఇక్కడికి సకాలంలో చేరుకోలేనందుకు చింతిస్తున్నాను. ఈ విషయంలో మీ అందరినీ క్షమాపణలను కోరుతున్నాను. సభ ప్రారంభంలో మనం విన్న మంత్రాల శక్తి ఇప్పటికీ మనకి తెలుస్తూనే ఉంది. మీ మధ్య ఉండే అవకాశం వచ్చినప్పుడల్లా ఆ అనుభవం దైవికంగా, అద్భుతంగా ఉంటుంది. ఇది స్వామి దయానందుల వారి ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదాల పట్ల మనందరికీ ఉన్న గౌరవంతో పాటు ఇక్కడున్న మేధావులైన మీ అందరితోనూ దశాబ్దాలుగా నాకున్న వ్యక్తిగత అనుబంధం వల్లే మళ్లీ మళ్లీ మీ మధ్య ఉండే అవకాశం నాకు లభిస్తోంది. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ, మీతో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ నాలో ప్రత్యేకమైన శక్తి, స్ఫూర్తి నిండుతాయి. ఇలాంటి మరో తొమ్మిది హాళ్లను ఏర్పాటు చేశారని ఇప్పుడే నాకు చెప్పారు. అక్కడ మన ఆర్యసమాజ్ సభ్యులంతా వీడియో లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. వారిని నేను నేరుగా చూడలేనప్పటికీ.. ఇక్కడి నుంచే వారికి నమస్కరిస్తున్నాను.

కెవాడియాలోని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 31st, 09:00 am

సర్దార్ పటేల్ 150వ జయంతి చరిత్రాత్మక సందర్భం. ఏక్తానగర్‌లో ఈ నాటి దివ్యమైన ఉదయం...ముఖ్యంగా ఈ విశాల దృశ్యం గొప్ప ఆరాధనా భావాన్ని కలిగిస్తోంది. సర్దార్ సాహెబ్ పాదాల వద్ద మనమంతా సామూహికంగా ఐక్యతా స్ఫూర్తిని చాటుతున్న ఒక గొప్ప సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐక్యతా పరుగులో పాల్గొంటున్న కోట్లాది మంది భారతీయుల ఉత్సాహం ద్వారా మనం నవ భారత సంకల్పాన్ని కార్యాచరణలో చూస్తున్నాం. నిన్న సాయంత్రం జరిగిన అద్భుతమైన ప్రదర్శన సహా ఇటీవల ఇక్కడ నిర్వహించిన కార్యక్రమాలు గత కాలపు సంప్రదాయాన్ని, వర్తమానపు శ్రమనీ- శౌర్యాన్నీ, భవిష్యత్తు విజయాల సంగ్రహావలోకనాన్ని ప్రదర్శించాయి. సర్దార్ సాహెబ్ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ఒక స్మారక నాణెంతో పాటు పోస్టల్ స్టాంపును విడుదల చేశాం. సర్దార్ సాహెబ్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా 140 కోట్ల మంది దేశవాసులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

గుజరాత్‌లోని కెవాడియాలో రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 31st, 08:44 am

గుజరాత్‌లోని కెవాడియాలో ఈ రోజు నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సర్దార్ పటేల్ 150వ జయంతి ఒక చరిత్రాత్మక సందర్భమని అన్నారు. ఏక్తా నగర్‌లోని ఉదయం దివ్యమైన, విశాల దృశ్యంగా ఆరాధనా భావాన్ని కలిగిస్తోందని అభివర్ణించిన శ్రీ మోదీ... సర్దార్ పటేల్ పాదాల వద్ద చేరిన నేటి ఈ జన సమూహపు ఐక్యతా స్ఫూర్తితో దేశం ఒక చిరస్మరణీయ అనుభవాన్ని పొందుతోందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఐక్యతా పరుగు కార్యక్రమాన్ని... ఆ కార్యక్రమంలో కోట్లాది మంది భారతీయుల ఉత్సాహంతో కూడిన భాగస్వామ్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దీని ద్వారా నవ భారత్ సంకల్పం స్పష్టంగా అవగతమవుతోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలు, నిన్నటి సాయంత్రం జరిగిన అద్భుతమైన ప్రదర్శనను ప్రస్తావిస్తూ... అవి గత కాలపు సంప్రదాయాలను, వర్తమానపు శ్రమనూ-శౌర్యాన్నీ, భవిష్యత్తు విజయాల సంగ్రహావలోకనాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఒక స్మారక నాణెం, ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసినట్లు ఆయన తెలియజేశారు. సర్దార్ పటేల్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది పౌరులకు ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

సర్దార్ పటేల్‌ను గౌరవించుకోవడానికి అక్టోబరు 31న ఏకతా పరుగులో భాగం పంచుకోవాల్సిందిగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి విజ్ఞప్తి

October 27th, 09:15 am

సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈ నెల 31న నిర్వహిస్తున్న ‘ఏకతా పరుగు’ కార్యక్రమంలో భాగం పంచుకోవాల్సిందిగా దేశ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ ఏకతా దినోత్సవ నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశ ప్రజలు ఏకతాటి మీద నిలిచి, ఎప్పటికీ కలసిమెలసి ఉండాలని సర్దార్ పటేల్ కన్న కలను పండుగలా నిర్వహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

'వందేమాతరం' స్ఫూర్తి భారతదేశ అమర చైతన్యంతో ముడిపడి ఉంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

October 26th, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఛత్ పూజ పండుగ, పర్యావరణ పరిరక్షణ, భారతీయ కుక్క జాతులు, భారతీయ కాఫీ, గిరిజన సమాజ నాయకులు మరియు సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యత వంటి ఆసక్తికరమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. 'వందేమాతరం' పాట 150వ సంవత్సరం గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

30 మార్చి 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 120 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

March 30th, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ఈరోజు- ఈ పవిత్రమైన రోజున మీతో ‘మన్ కీ బాత్’ పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈరోజు చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి. నేటి నుండి చైత్ర నవరాత్రి ప్రారంభమవుతుంది. భారతీయ నూతన సంవత్సరం కూడా నేటి నుంచే ప్రారంభమవుతోంది. ఈసారి విక్రమ సంవత్సరం 2082 ప్రారంభమవుతోంది. ప్రస్తుతం మీరు రాసిన చాలా ఉత్తరాలు నా ముందు ఉన్నాయి. కొందరు బీహార్ నుండి, కొందరు బెంగాల్ నుండి, కొందరు తమిళనాడు నుండి, కొందరు గుజరాత్ నుండి ఈ లేఖలు రాశారు. వీటిలో ప్రజలు తమ ఆలోచనలను చాలా ఆసక్తికరమైన రీతిలో రాశారు. చాలా లేఖలలో శుభాకాంక్షలు, అభినందన సందేశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీతో కొన్ని సందేశాలు పంచుకోవాలనిపిస్తోంది-

సౌర మరియు అంతరిక్ష రంగాలలో భారతదేశం యొక్క అద్భుతాలకు ప్రపంచం ఆశ్చర్యపోతోంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

October 30th, 11:30 am

ఇప్పుడు మనం పవిత్రమైన ఛత్ పూజ, సూర్య భగవానుడి ఆరాధన గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఈరోజు సూర్యుని ఆరాధించడంతో పాటు ఆయన వరం గురించి కూడా చర్చించుకోవాలి. సూర్య భగవానుడి వరం 'సౌరశక్తి'. సోలార్ ఎనర్జీ ఈరోజుల్లో ఎంత ముఖ్యమైన అంశమంటే ఈరోజు ప్రపంచం మొత్తం తన భవిష్యత్తును సౌరశక్తిలో చూస్తోంది. సూర్య భగవానుడిని భారతీయులకు శతాబ్దాలుగా ఆరాధిస్తున్నారు. అంతే కాకుండా భారతీయ జీవన విధానానికి కేంద్రం సూర్యుడే. భారతదేశం నేడు తన సాంప్రదాయిక అనుభవాలను ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో జోడిస్తోంది. అందుకేనేడుసౌరశక్తి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశాలలో చేరాం. మన దేశంలోని పేద,మధ్యతరగతి ప్రజల జీవితాల్లో సౌరశక్తి తెచ్చిన మార్పులు కూడా అధ్యయనం చేసే అంశం.

కేవ‌డియా లో ‘రాష్ట్రీయ ఏక్ తా దివ‌స్’ నాడు రాష్ట్రీయ ఏక్ తా ప్ర‌తిజ్ఞ చేయించిన ప్ర‌ధాన మంత్రి

October 31st, 03:53 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ‘రాష్ట్రీయ ఏక్‌ తా దివస్’ సంద‌ర్భం గా కేవ‌డియా లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వ‌ద్ద ఏక్ తా దివస్ తాలూకు ప్ర‌తిజ్ఞ ను చేయించారు. దేశం నలు మూల ల నుండి త‌ర‌లి వ‌చ్చిన వివిధ పోలీసు ద‌ళాలు ప్ర‌ద‌ర్శించిన క‌వాతు ను కూడా ఆయ‌న సమీక్షించారు.

సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ కు కేవడియా లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద పుష్పాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి

October 31st, 10:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున సర్ దార్ పటేల్ జయంతి సందర్భం గా భారతదేశపు ఉక్కు మనిషి అయినటువంటి సర్ దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు గుజరాత్ లోని కేవడియా లో గల ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద పుష్పాంజలి ని సమర్పించారు.

స‌ర్ దార్ ప‌టేల్ గారి కి స్టాట్యూ ఆఫ్ యూనిటీ వ‌ద్ద అక్టోబ‌ర్ 31వ తేదీ నాడు స్మృత్యంజ‌లి ని ఘ‌టించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

October 30th, 02:28 pm

సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ యొక్క జ‌యంతి సంద‌ర్భం గా 2019వ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన గుజ‌రాత్ లోని కేవ‌డియా లో గ‌ల స్టాట్యూ ఆఫ్ యూనిటీ వ‌ద్ద భార‌త‌దేశ‌పు ఉక్కు మ‌నిషి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మృత్యంజ‌లి ని స‌మ‌ర్పించ‌నున్నారు.

దేశం యొక్క ఐక్యతను బలోపేతం చేయడంలో సమాజం ఎల్లప్పుడూ చురుకైన పాత్ర పోషించింది: మన్ కి బాత్ సమయంలో ప్రధాని

October 27th, 11:00 am

‘మన్ కీ బాత్’ సందర్భంగా ప్రధాని మోదీ దేశవాసులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గురు నానక్ దేవ్ జీ బోధనలు, భారతదేశం యొక్క నారి శక్తి, సర్దార్ పటేల్ యొక్క అమూల్యమైన రచనలు, సియాచిన్లోని జవాన్ల విగ్రహం మరియు పరిశుభ్రత ప్రయత్నాల గురించి ఆయన ప్రస్తావించారు. రామ్ జన్మభూమిపై సెప్టెంబర్ 2010 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రధాని గుర్తు చేశారు.

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని దేశ ప్ర‌జ‌ల‌ కు అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి

October 31st, 10:50 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌పంచం లో అత్యంత ఎత్తైన విగ్ర‌హం ‘‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’’ ని దేశ ప్ర‌జ‌ల కు ఈ రోజు న అంకితం చేశారు.

Sardar Patel wanted India to be strong, secure, sensitive, alert and inclusive: PM Modi

October 31st, 10:31 am

PM Modi dedicated the world’s largest statue, the ‘Statue of Unity’ to the nation. The 182 metres high statue of Sardar Patel, on the banks of River Narmada is a tribute to the great leader. Addressing a gathering at the event, the PM recalled Sardar Patel’s invaluable contribution towards India’s unification and termed the statue to be reflection of New India’s aspirations, which could be fulfilled through the mantra of ‘Ek Bharat, Shreshtha Bharat.’

ప్రతి పౌరునికి సాధికారత ఉన్న భారతదేశాన్ని సృష్టించాలని మేము కోరుకుంటున్నాము: ప్రధాని మోదీ

February 25th, 08:05 pm

సూరత్ నుంచి న్యూ ఇండియా మారథాన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ, కుల, మత మరియు అవినీతి రాజకీయాలు లేని నవభారతదేశంను నిర్మించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రతి పౌరునికి సాధికారత ఉన్న భారతదేశాన్ని సృష్టించాలని మేము కోరుకుంటున్నాము. అని ఆయన అన్నారు.

సోషల్ మీడియా కార్నర్ 31 అక్టోబర్ 2017

October 31st, 06:51 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

India is proud of its diversity: PM Narendra Modi

October 31st, 07:30 am

PM Narendra Modi flagged off the 'Run for Unity’ today. The PM remarked, “We are proud of Sardar Patel’s contribution to India before we attained freedom and during the early years after we became independent.”

'రన్ ఫర్ యూనిటీ ' ని ప్రారంభించిన ప్రధాని మోదీ

October 31st, 07:28 am

న్యూ ఢిల్లీ లోని ప‌టేల్ చౌక్ లో ఉన్న స‌ర్దార్ ప‌టేల్ విగ్ర‌హం వ‌ద్ద‌ రాష్ట్రప‌తి శ్రీ రామ్‌నాథ్ కోవింద్‌, ఉప రాష్ట్రప‌తి శ్రీ వెంక‌య్య నాయుడు మ‌రియు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ లు ఈ రోజు స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్ ప‌టేల్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని పుష్పాంజ‌లి ఘ‌టించారు.

వ‌డోద‌ర‌లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి

October 22nd, 05:07 pm

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఆదివారంనాడు వ‌డోద‌ర‌లొ జ‌రిగిన ఒక బ‌హిరంగ స‌భ‌లో వ‌డోద‌ర సిటీ క‌మాండ్ కంట్రోల్ వ్య‌వ‌స్థ‌ను,వాఘోడియా ప్రాంతీయ నీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాన్ని, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా నూత‌న కేంద్ర కార్యాల‌యభ‌వ‌నాన్ని జాతికి అంకితం చేశారు.

గ‌వ‌ర్న‌ర్ల స‌మావేశం ముగింపు స‌ద‌స్సులో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

October 13th, 03:36 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో జరిగిన గ‌వ‌ర్న‌ర్ల స‌మావేశం ముగింపు స‌ద‌స్సులో మాట్లాడారు.

భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశం యొక్క ప్రత్యేకత: మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్య

September 24th, 11:30 am

తన మన్ కి బాత్ 36 వ విభాగం ద్వారా ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. తన మన్ కి బాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పౌరులతో కలవడానికి ఒక ప్రత్యేక వేదికగా మారిందని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి అనేకమంది గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడారు మరియు వారి కృషి నేటీకీ మనకు ఒక స్పూర్తిదాయంకంగా ఉంటుందని అన్నారు. ప్రధాని స్వచ్ఛత, పర్యాటకం, పండుగలు గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.