నెదర్లాండ్స్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ
March 30th, 09:34 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్‌తో మాట్లాడారు. “భారత-నెదర్లాండ్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై మేం చర్చించాం. ముఖ్యంగా సెమీకండక్టర్లు, భారీ నీటి ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, నిపుణుల పరస్పర పర్యటనలు వంటి రంగాల్లో రెండు దేశాల భాగస్వామ్య అవకాశాల గురించి ప్రస్తావించాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిసుస్థిరతలను త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరాన్ని శ్రీ మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాబ్ జెట్టెన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
February 24th, 02:33 pm
నెదర్లాండ్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాబ్ జెట్టెన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.