డిసెంబరు 13న ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి పర్యటన
December 12th, 02:10 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసెంబరు 13న ఉత్తరప్రదేశ్‌ను సందర్శించనున్నారు. ఆయన ప్రయాగ్‌రాజ్‌కు వెళ్ళి, మధ్యాహ్నం సుమారు 12 గంటల 15 నిమిషాలకు సంగమ్ స్థలానికి చేరుకొని పూజ, దర్శనం కార్యక్రమాల్లో పాలుపంచుకొంటారు. మధ్యాహ్నం దాదాపు 12 గంటల 40 నిమిషాలకు అక్షయ వట వృక్షానికి పూజచేసి, ఆ తరువాత హనుమాన్ మందిర్, సరస్వతీ కూప్‌లో దర్శనం, పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఇంచుమించు ఒంటిగంటన్నరకు ఆయన మహాకుంభ్ ప్రదర్శన స్థలాన్ని చేరుకొని, ఆ ప్రదేశమంతా కలియతిరుగుతారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత, మధ్యాహ్నం సుమారు 2 గంటలకు రూ. 5500 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభిస్తారు.