ఉత్తరప్రదేశ్‌లోని జాతీయ రహదారి- 19, వారణాసి రింగ్ రోడ్డు నడుమ

July 15th, 04:53 pm

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా.. జాతీయ రహదారి-19, వారణాసి రింగ్ రోడ్ మధ్య గంగా నది తీరం వెంబడి సరికొత్త లింక్/కనెక్టర్ కారిడార్ నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 46.039 కిలోమీటర్ల ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ‘మిశ్రమ వార్షిక చెల్లింపు విధానం (హ్యామ్)’లో చేపట్టనున్నారు. దీని మొత్తం వ్యయం రూ.14,447.64 కోట్లు కాగా.. ఇందులో సివిల్ నిర్మాణ పనుల కోసం రూ.6,037.85 కోట్లు (జీఎస్టీ మినహా ప్రజా సదుపాయాల మార్పిడి వ్యయం సహా), జాతీయ రహదారుల (ఓ) కింద భూసేకరణ కోసం రూ.541.11 కోట్లు కేటాయించారు. ఆరు వరుసల ఎత్తయిన ప్రధాన వాహన మార్గాన్నీ, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కేబుల్ వంతెననూ, అత్యాధునిక సాంకేతికతతో వాహనదారులూ పాదచారులిద్దరికీ సేవలందించే ప్రత్యేకమైన వంతెననూ, మెట్ల మార్గాలూ, ర్యాంపు మార్గాలూ, లింక్ రోడ్లనూ ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నారు.

ఇండోనేషియా పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

July 07th, 03:15 pm

ఇండోనేషియా ప్రజలు – చిన్నారులు, యువత, మహిళలు - ఈ రోజును నా జీవితంలో మరచిపోలేని రోజుల్లో ఒకటిగా మార్చారు. ఈ ఉదయం ఇండోనేషియా ప్రజల నుంచి నాకు దక్కిన ఆత్మీయత, అనురాగం, సాదర స్వాగతాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ ఉదయం అధ్యక్షులు ప్రబోవో కాపీరైట్ గురించి మాట్లాడారు. ప్రేమ, ఆత్మీయత, స్నేహం, పరస్పర గౌరవంపై ఎవరూ కాపీరైట్‌ను క్లెయిము చేయలేరని చెప్పాను. అధ్యక్షులు ప్రబోవోతో నా స్నేహం కాపీరైట్‌కి సంబంధించిన అన్ని హద్దులను అధిగమించింది.

ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

July 07th, 03:00 pm

ఈ సందర్భంగా ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. సమావేశానికి విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రభోవో సుబియాంటోకు ధన్యవాదాలు తెలిపారు. తనకు సాదర ఆహ్వానం పలకడమే కాకుండా భారత్-ఇండోనేషియా భాగస్వామ్యానికి ఎంతో కృషి చేస్తున్న పార్లమెంటు స్పీకర్ శ్రీమతి పువాన్ మహారాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. 140 కోట్ల మంది భారత ప్రజల తరపున అక్కడి ఎంపీలకు శుభాకాంక్షలు అందజేశారు. ప్రజాస్వామ్యానికి పట్టునిల్లు అయినటువంటి భారత్‌.. ఇండోనేషియాతో ఉన్న ప్రజాస్వామ్య బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తోందని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, నౌకా వాణిజ్య సంబంధాలను ఆయన ప్రస్తావించారు. రెండు వేల సంవత్సరాలకు పైగా పరస్పర భావాలు, వాణిజ్యం, సంస్కృతి, విశ్వాసాల ద్వారా భారత్, ఇండోనేషియాలను హిందూ మహాసముద్రం అనుసంధానిస్తోందని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. భారత్‌కు చెందిన వసుధైక కుటుంబం, ఇండోనేషియాకు చెందిన భిన్నేక తుంగల్ ఇక (భిన్నత్వంలో ఏకత్వం) వంటి ఉమ్మడి ఆదర్శాలను ప్రధాని ప్రస్తావించారు. ఈ విలువలే రెండు దేశాల భాగస్వామ్యానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి చారిత్రక నేపథ్యం, సవాళ్లు, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలు భారత్, ఇండోనేషియాలను సహజసిద్ధమైన, నమ్మకమైన భాగస్వాములుగా మార్చాయని పేర్కొన్నారు.

'మన్ కీ బాత్'లో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి చిట్కాలను పంచుకున్న ప్రధాని మోదీ; పౌరులు తగినంత నీరు తాగుతూ ఉండాలని సూచన.

May 31st, 11:30 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అథ్లెటిక్స్‌లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కొన్ని రోజుల కిందట జార్ఖండ్‌లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులను నెలకొల్పారు. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులను నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు.

రాజ్యసభలో ప్రధాని ప్రసంగం

April 17th, 11:10 am

సభ తరఫునా, నా తరఫునా శ్రీ హరివంశ్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా వరుసగా మూడోసారి ఎన్నికవడమే సభకు మీపై ఉన్న ప్రగాఢమైన విశ్వాసానికి నిదర్శనం. నిజానికి మీ అనుభవం ద్వారా గతంలో పొందిన ప్రయోజనాలకూ, అందరినీ కలుపుకొనిపోయిన మీ కృషికీ సభ ఈ విధంగా ఆమోదముద్ర వేసింది. అనుభవానికి, సహజమైన పనితీరుకు దక్కిన గౌరవమిది. ఆ సహజమైన పనిశైలికి ఇది ఆమోదం కూడా. హరివంశ్ గారి నేతృత్వంలో ఎంత ప్రభావవంతంగా సభ బలోపేతమైందో మనమంతా చూశాం. ఆయన సభ కార్యకలాపాలను నిర్వహించడమే కాదు.. తన జీవితానుభవాన్ని నిశితంగా ఉపయోగిస్తూ సభ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. సభా వ్యవహారాలన్నింటా, నిర్వహణలో, సభ వాతావరణంలో పరిణతిని పెంచడంలో ఆయన అనుభవం ఎంతగానో తోడ్పడింది. డిప్యూటీ చైర్మన్ ఈ కొత్త పదవీకాలం కూడా అదే స్ఫూర్తితో, సమతౌల్యంతో, నిబద్ధతతో సాగుతుందన్న దృఢమైన విశ్వాసం నాకుంది. మనందరి కృషితో సభ గౌరవం మరింత ఇనుమడిస్తుందని ఆశిస్తున్నాను.

రాజ్యసభను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 17th, 11:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాజ్యసభను ఉద్దేశించి ప్రసంగించారు. వరుసగా మూడోసారి రాజ్యసభకు డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించిన శ్రీ హరివంశ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. దీనిని చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇది శ్రీ హరివంశ్‌పై సభకున్న విశ్వాసాన్ని, ఈ సభకు ఆయన తీసుకొచ్చిన విలువైన అనుభవాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ‘‘వరుసగా మూడోసారి ఎన్నిక కావడం.. ఆయన అనుభవానికి, సమ్మిళిత దృక్పథానికి, ఆయన పనితీరుకు సభ వేసిన ఆమోద ముద్ర’’ అని శ్రీ మోదీ తెలిపారు.

వారణాసిలో 72 వ జాతీయ వాలీబాల్ పోటీలను వీడియో మాధ్యమం ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 04th, 01:00 pm

ఉత్తరప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, యూపీ ప్రభుత్వ మంత్రులు - సోదరులు రవీంద్ర జైస్వాల్, దయాశంకర్, గిరీష్ యాదవ్, బనారస్ మేయర్ - సోదరుడు అశోక్ తివారీ, ఇతర ప్రజాప్రతినిధులు, వాలీబాల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, దేశం నలుమూలల నుంచి నుండి విచ్చేసిన క్రీడాకారులు, కాశీలో ఉన్న నా కుటుంబ సభ్యులకు నమస్కారం.

వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ పోటీలను వీడియో మాధ్యమం ద్వారా ప్రారంభించిన ప్రధాని

January 04th, 12:00 pm

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరుగుతున్న 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన క్రీడాకారులందరికీ స్వాగతం పలికి అభినందించడం పట్ల వారణాసి పార్లమెంటు సభ్యునిగా సంతోషంగా ఉందని తెలిపారు. నేటి నుంచి నగరంలో జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమవుతోందని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులు ఎంతో కష్టపడి ఈ జాతీయ స్థాయి పోటీలకు వచ్చారని.. రాబోయే రోజుల్లో వారణాసి గడ్డపై వారి కృషికి పరీక్ష ఎదురుకానుందని ఆయన ఉద్ఘాటించారు. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి జట్లు ఇక్కడకు చేరుకున్నాయని.. ఇది 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తోందని అభివర్ణించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న వారందరికీ ప్రధాన మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

వందేమాతరం 150 సంవత్సరాల ప్రత్యేక చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రధానమంత్రి ప్రసంగం

December 08th, 12:30 pm

ఈ ప్రత్యేక సందర్భంలో సామూహికంగా చర్చించేందుకు ముందుకు వచ్చినందుకు మీకు, ఈ సభలోని గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని శక్తి, త్యాగస్పూర్తి, నిరాడంబరతను నింపిన ఆ మంత్రాన్ని, ఆ స్పష్టమైన పిలుపును గౌరవంగా గుర్తుచేసుకుంటూ.. ఈ సభలో వందేమాతరాన్ని స్మరించుకోవడం మనందరికీ గొప్ప గౌరవం. వందేమాతరం 150 సంవత్సరాల చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలబడటం చాలా గర్వకారణం. ఈ కాలం చరిత్ర విస్తృతి నుంచి లెక్కలేనన్ని సంఘటనలను మన ముందుకు తీసుకువస్తుంది. ఈ చర్చ ఖచ్చితంగా సభ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. కానీ మనం ఈ క్షణాన్ని సమష్టిగా ఉపయోగించుకుంటే రాబోయే తరాలకు, ప్రతి తరానికి కూడా నేర్చుకునే మూలంగా ఉపయోగపడుతుంది.

జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్ సభ ప్రత్యేక చర్చలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

December 08th, 12:00 pm

జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు లోకసభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ విశేష సందర్భంలో సమష్టి చర్చకు అంగీకరించిన గౌరవ సభ్యులందరికీ ప్రధానమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యోద్యమానికి ఉత్తేజాన్నీ, ప్రేరణనూ అందించి.. త్యాగనిరతి - దృఢసంకల్పంతో కూడిన మార్గాన్ని నిర్దేశించిన ‘వందేమాతరం’ మంత్రాన్ని స్మరించుకుంటున్నామని, సభలో ఉన్న వారందరికీ ఇదో గొప్ప గౌరవమని ఆయన వ్యాఖ్యానించారు. వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన ఈ చరిత్రాత్మక సందర్భం దేశానికి గర్వకారణమని శ్రీ మోదీ అన్నారు. ఈ వేళ అనేక చారిత్రక సంఘటనలు మన కళ్లెదుట కదలాడేలా నిలుపుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చ సభ అంకితభావాన్ని చాటడమే కాకుండా, భావి తరాలు అవగాహన పెంచుకునే జ్ఞానసంపదగా నిలుస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సభ్యులంతా ఈ చర్చను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ సత్కార కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

December 01st, 11:15 am

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ సభలోని గౌరవనీయ సభ్యులందరికీ ఇది గర్వకారణమైన రోజు. ఈ సందర్భంగా మీకు మా సాదర స్వాగతం... మీ మార్గదర్శకత్వాన ఈ సభలో కీలకాంశాల చర్చకు, తద్వారా దేశాన్ని ప్రగతి పథంలో నడపడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆ విధంగా మీ అమూల్య మార్గదర్శనం లభించడం మాకందరికీ ఒక గొప్ప అవకాశం. ఈ మేరకు సభ తరపున, నా తరపున మీకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గౌరవనీయ సభ్యులందరూ ఈ ఎగువ (రాజ్య)సభ మర్యాదను సదా పరిరక్షిస్తారని, చైర్మన్‌గా మీ గౌరవాన్ని ఎప్పుడూ కాపాడుతారని వాగ్దానం చేస్తున్నాను.. ఇది మీకు నేనిస్తున్న హామీ.

రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్‌ సన్మాన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు

December 01st, 11:00 am

రాజ్యసభకు తొలిసారి అధ్యక్షత వహించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతం పలికారు. గౌరవ రాజ్యసభ సభ్యులందరికీ ఈ రోజు గర్వకారణమని ప్రధానమంత్రి అభివర్ణించారు. చైర్మన్‌కు సాదర స్వాగతం పలుకుతూ.. “సభ తరఫున, నా తరఫున మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా అభినందనలు, శుభకామనలు. అత్యున్నతమైన ఈ సభా మర్యాదను గౌరవ సభ్యులందరూ ఎప్పటి మాదిరే కాపాడతారని, మీతో వారంతా విజ్ఞతతో వ్యవహరిస్తారని అనుకుంటున్నాను. ఇందుకు నాదీ హామీ” అని శ్రీ మోదీ భరోసా ఇచ్చారు.

అధికారిక కార్యక్రమాల్లో పొందిన బహుమతుల ఆన్ లైన్ వేలంలో పాల్గొనాలని దేశ ప్రజలకు ప్రధాని ఆహ్వానం

September 24th, 01:09 pm

తన అధికారిక కార్యాక్రమాలు, సమావేశాల సందర్భంగా స్వీకరించిన బహుమతుల వేలం ప్రారంభమయ్యిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ వేలంలో పౌరులు ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని నమామి గంగే కార్యక్రమానికి విరాళంగా అందజేయనున్నట్లు తెలిపారు. గంగా నది సంరక్షణ, పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన పథకం- నమామి గంగే.

Bharat Ratna for Bhupen Da reflects our government's commitment to the North East: PM Modi in Guwahati, Assam

September 13th, 08:57 pm

PM Modi addressed the 100th birth anniversary of Bharat Ratna Dr. Bhupen Hazarika in Guwahati, Assam, calling it a remarkable day and a great privilege to be part of the celebrations. The PM shared, Bhupen Da, lovingly known as “Shudha Kantho,” gave voice to India’s unity, dreams and compassion of Mother India. “Bhupen Da’s entire life was dedicated to the nation’s goals,” PM Modi remarked, affirming the centenary year as a true tribute to his legacy.

PM Modi addresses the 100th birth anniversary celebrations of Bharat Ratna Dr. Bhupen Hazarika in Guwahati, Assam

September 13th, 05:15 pm

PM Modi addressed the 100th birth anniversary of Bharat Ratna Dr. Bhupen Hazarika in Guwahati, Assam, calling it a remarkable day and a great privilege to be part of the celebrations. The PM shared, Bhupen Da, lovingly known as “Shudha Kantho,” gave voice to India’s unity, dreams and compassion of Mother India. “Bhupen Da’s entire life was dedicated to the nation’s goals,” PM Modi remarked, affirming the centenary year as a true tribute to his legacy.

Mauritius is an important pillar of India’s ‘Neighbourhood First’ policy and Vision ‘Mahasagar’: PM Modi

September 11th, 12:30 pm

In his remarks at the joint press meet in Varanasi, PM Modi said that just like the uninterrupted flow of the Ganga in Kashi, the continuous stream of Indian culture has enriched Mauritius. He congratulated PM Ramgoolam and the people of Mauritius on the successful conclusion of the Chagos Agreement. The PM also announced a Special Economic Package for Mauritius to strengthen infrastructure, create jobs, and improve healthcare.

బీహార్ రాష్ట్ర జీవ‌నోపాధి నిధి స‌హ‌కార రుణ ప‌ర‌ప‌తి స‌మాఖ్య లిమిటెడ్‌ ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

September 02nd, 01:00 pm

బీహార్‌ ప్రజలకు అభిమానపాత్రులైన ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు శ్రీ సామ్రాట్ చౌదరి, శ్రీ విజయ్ కుమార్ సిన్హా, ఇతర ప్రముఖులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్షలాది సోదరీమణులారా... మీకందరికీ హృదయపూర్వక వందనం!

బీహార్ రాజ్య జీవికా నిధి రుణ సహకార సంఘాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 02nd, 12:40 pm

బీహార్ రాజ్య జీవికా నిధి రుణ సహకార సంఘం లిమిటెడ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఈ మంగళప్రదమైన మంగళవారం రోజు, చాలా ఆశాజనక కార్యక్రమానికి నాందీప్రస్తావన చేసుకుంటున్నామన్నారు. జీవికా నిధి రుణ సహకార సంఘ రూపంలో బీహార్‌లోని తల్లులకు, ఆడపడుచులకు ఒక కొత్త సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం గ్రామాల్లో జీవికతో అనుబంధం కలిగి ఉన్న మహిళలకు మరింత సులభంగా ఆర్థిక సహాయ సహకారాన్ని అందుబాటులోకి తీసుకు వస్తుందని, వారు పనిలోను, వ్యాపారాల్లోను ముందడుగు వేయడానికి ఇది సాయపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. జీవికా నిధి వ్యవస్థ పూర్తి డిజిటల్ మాధ్యమంలో పనిచేస్తుందని, పనిగట్టుకొని కాళ్లరిగేలా తిరిగే అవసరం ఇక ఉండదని, ప్రతి పనినీ ఇప్పుడు చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారానే చక్కబెట్టవచ్చని చెబుతూ ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జీవికా నిధి రుణ సహకార సంఘం ప్రారంభం అయినందుకు బీహార్‌లోని తల్లులకు, ఆడపడుచులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ అసాధారణ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకు వచ్చినందుకు శ్రీ నీతీశ్ కుమార్‌ను, బీహార్ ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి అభినందించారు.

ఆగస్టు 22న బిహార్, పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్న ప్రధాని

August 20th, 03:02 pm

ఆగస్టు 22న బీహార్, పశ్చిమ బెంగాల్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. బిహార్ లోని గయలో ఉదయం 11 గంటలకు రూ.13,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. అక్కడే రెండు రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించి, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత గంగా నదిపై నిర్మించిన ఆంటా- సిమారియా వంతెనను సందర్శించి ప్రారంభిస్తారు.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

August 02nd, 11:30 am

నమఃపార్వతీ పతయే.. హర హర మహాదేవ.. పవిత్ర శ్రావణ మాసంలో కాశీలోని నా కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఈ రోజు నాకు లభించింది. ఈ సందర్భంగా మీకందరికీ ఇదే నా ప్రణామం.