పర్యావరణం, కాప్-30లతో పాటు ప్రపంచ ఆరోగ్యం అంశాలపై బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సు.. ప్రసంగించిన ప్రధానమంత్రి
July 07th, 11:38 pm
పర్యావరణం, కాప్-30, ప్రపంచ ఆరోగ్యసంరక్షణ’’ అంశాలపై సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలతో పాటు పాలుపంచుకోవాల్సిందంటూ ఆహ్వానాన్ని అందుకున్న దేశాలు కూడా పాల్గొన్నాయి. ప్రపంచ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకొని ఇలాంటి అధిక ప్రాధాన్యం కలిగిన అంశాలపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు బ్రెజిల్‌కు ఆయన తన ధన్యవాదాలు తెలిపారు. వాతావరణ మార్పును ఇంధన సమస్యల పరిష్కారం అనే ఒకే అంశంతో ముడిపెట్టి చూడడం భారతదేశం దృక్పథం కాదని, జీవనానికి ప్రకృతికి మధ్య సమతూకాన్ని ప్రభావితం చేసే అంశం ఇదని తమ దేశం భావిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వాతావరణ పరంగా న్యాయాన్ని ఏర్పరచడం అంటే అది ఒక నైతిక బాధ్యత అని, దీనిని తప్పక నిర్వర్తించాల్సిందేనని భారత్ సంకల్పించిందని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. పర్యావరణ సంరక్షణ దిశలో కార్యాచరణను చేపట్టడానికి భారత్ ఎంతో చిత్తశుద్ధితో ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజానుకూల, భూగ్రహానికి మిత్రపూర్వక ప్రగతిసాధక విధానాలను ప్రోత్సహించడానికి తీసుకొంటున్న వివిధ కార్యక్రమాలను గురించి ఆయన సమగ్రంగా సభకు వివరించారు. ఈ సందర్భంగా మిషన్ లైఫ్ (పర్యావరణ అనుకూల జీవనం), 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరు మీద ఒక మొక్కను నాటడం), అంతర్జాతీయ సౌరశక్తి కూటమి, సమర్థవంతమైన విపత్తు సన్నద్ధ కూటమి (కోయలిషన్ ఫర్ డిజాస్టర్ రేజీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్), హరిత హైడ్రోజన్ మిషన్, ప్రపంచ జీవ ఇంధన వేదిక, పులుల సంరక్షణ కూటమి (బిగ్ క్యాట్స్ అలయన్స్) తదితర కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.పర్యావరణం, కాప్-30, ప్రపంచ ఆరోగ్య అంశాలపై ఏర్పాటైన బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 07th, 11:13 pm
బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతాల్లో భాగంగా పర్యావరణ, ఆరోగ్య భద్రత అంశాలకు బ్రెజిల్ అత్యధిక ప్రాధాన్యతనివ్వడం నాకు సంతోషం కలిగిస్తోంది. ఇవి పరస్పర సంబంధం గల అంశాలే కాక మానవాళి సంక్షేమానికి, ఉజ్జ్వల భవిష్యత్తుకూ ఎంతో ముఖ్యమైనవి.బ్రెజిల్‌లోని రియో డీ జనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఉరుగ్వే అధ్యక్షునితో సమావేశమైన ప్రధాని
July 07th, 09:20 pm
ద్వైపాక్షిక సంబంధాల విషయంలో అన్ని అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. డిజిటల్ సహకారం, ఐసీటీ, డిజిటల్ ప్రజా మౌలికసదుపాయాలు, యూపీఐ, రక్షణ, రైల్వేలు, ఆరోగ్యం, ఔషధాలు, వ్యవసాయం, ఇంధనం, సాంస్కృతిక సంబంధాలు, మానవ సంబంధాల విషయంలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని వారు సమీక్షించారు. కీలకమైన ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను మరింత పెంచటంపై ప్రధానంగా చర్చలు జరిపారు. గరిష్ఠస్థాయిలో ఆర్థిక అవకాశాలకు ద్వారాలు తెరుస్తూ వాణిజ్యపరంగా ఇరు దేశాలకు లబ్ధిచేకూర్చే భారత్-మెర్కోసూర్ ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాన్ని (ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్) విస్తరించటంపై ఇరు దేశాలు ఆసక్తిని వ్యక్తం చేశాయి.రియో డి జనీరోలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా బొలీవియా అధ్యక్షునితో భేటీ అయిన ప్రధానమంత్రి
July 07th, 09:19 pm
బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్లూరినేషనల్ స్టేట్ ఆఫ్ బొలీవియా అధ్యక్షులు గౌరవ లూయిస్ ఆర్స్ కాటకోరాతో సమావేశమయ్యారు.Rio de Janeiro Declaration- Strengthening Global South Cooperation for a More Inclusive and Sustainable Governance
July 07th, 06:00 am
The leaders of BRICS countries, met in Rio de Janeiro, Brazil for the 17th BRICS Summit. The leaders reaffirmed their commitment to the BRICS spirit of mutual respect and understanding, sovereign equality, solidarity, democracy, openness, inclusiveness, collaboration and consensus. They strongly condemned terrorism and welcomed the inclusion of new countries as BRICS partner countries.శాంతి, భద్రతలపై బ్రిక్స్ కార్యక్రమం.. ప్రధానమంత్రి ప్రకటన పాఠం
July 06th, 11:07 pm
ప్రపంచంలో శాంతి, భద్రతలు కేవలం ఆదర్శాలు కావు, అంతకంటే అవి మన ఉమ్మడి ప్రయోజనాలతో పాటు మన అందరి భవిష్యత్తుకు బలమైన పునాదులు. మానవ జాతి పురోగతి శాంతియుత, సురక్షభరిత వాతావరణంలో మాత్రమే సాధ్యపడుతుంది. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడంలో బ్రిక్స్‌ది చాలా ముఖ్య పాత్ర. మనమంతా కలిసికట్టుగా, మన సవాళ్లను సమష్టిగా పరిష్కరించుకోవాల్సిన తరుణమిది. మనం తప్పక ఐకమత్యంతో ముందడుగు వేయాలి.బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం: అంతర్జాతీయ పాలనలో సంస్కరణ
July 06th, 09:41 pm
17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న అధ్యక్షుడు లూలాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రెజిల్ నాయకత్వంలో మన బ్రిక్స్ సహకారం కొత్త ఉత్సాహాన్ని, చైతన్యాన్ని సంతరించుకుంది. మనలో నిండిన ఈ శక్తి ఎస్‌ప్రెసో కాదు.. డబుల్ ఎస్‌ప్రెసో షాట్ లాంటిది. ఈ విషయంలో నేను అధ్యక్షుడు లూలా దార్శనికతను, ఆయన అచంచలమైన విశ్వాసాన్ని అభినందిస్తున్నాను. బ్రిక్స్ కుటుంబంలో ఇండోనేషియా చేరిన నేపథ్యంలో నా స్నేహితుడు, ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవోకు భారత్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.బహుపాక్షిక సంబంధాలు, ఆర్థిక-ద్రవ్య సహాయ విషయాల పటిష్ఠీకరణతో పాటు కృత్రిమ మేధపై బ్రిక్స్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రకటన పాఠం..
July 06th, 09:40 pm
బ్రిక్స్ కుటుంబానికి చెందిన మిత్ర దేశాల నేతలతో కలసి ఈ సమావేశంలో పాలుపంచుకొంటున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. లాటిన్ అమెరికా, ఆఫ్రికాలతో పాటు ఆసియాలోని మిత్రదేశాల నేతలతో నా ఆలోచనలను పంచుకొనేందుకు బ్రిక్స్ అవుట్‌రీచ్ సమ్మిట్‌లో ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు అధ్యక్షుడు శ్రీ లూలాకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని
July 06th, 09:39 pm
బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. నిన్న ప్రారంభమైన ఈ సదస్సు ఈరోజు కూడా జరుగుతోంది. అంతర్జాతీయ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్ వాణిని విస్తరించడం, శాంతి భద్రతలు, బహుపాక్షిక విధానాన్ని బలోపేతం చేయడం, అభివృద్ధి సమస్యలు, కృత్రిమ మేధతో సహా బ్రిక్స్ అజెండాకు సంబంధించిన వివిధ అంశాలపై నాయకులు ఫలప్రదమైన చర్చలు జరిపారు. సదస్సును విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఆత్మీయ ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్ అధ్యక్షునికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.బ్రెజిల్‌లో ప్రవాస భారతీయుల ఆత్మీయ స్వాగతాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి
July 06th, 08:28 am
బ్రెజిల్‌లోని ప్రవాస భారతీయులు రియో డి జనీరోలో తనకు ఆత్మీయంగా స్వాగతం పలకడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. వారు భారతీయ సంస్కృతితో ముడిపడి ఉండడం.. భారత అభివృద్ధి పట్ల అత్యంత మక్కువ చూపడం ఆనందంగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. స్వాగతానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను కూడా శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.బ్రెజిల్‌లోని రియో డి జనీరోకు చేరుకున్న ప్రధాని మోదీ
July 06th, 04:47 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం బ్రెజిల్ చేరుకున్నారు. రియో డి జనీరోలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు మరియు అనేక మంది ప్రపంచ నాయకులను కలుస్తారు.భారత్ – ఆస్ట్రేలియా రెండో వార్షిక శిఖరాగ్ర సదస్సు
November 20th, 08:38 pm
రియో డి జనీరో జి-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న ప్రధానమంత్రి శ్రీ మోదీ, నవంబర్ 19న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీజ్ తో కలిసి భారత్-ఆస్ట్రేలియా రెండో వార్షిక శిఖరాగ్ర సదస్సును నిర్వహించారు. శ్రీ ఆల్బనీజ్ 2023 భారత అధికారిక పర్యటన సందర్భంగా ఈ సదస్సు తొలి విడత సమావేశాలు మార్చి 10వ తేదీన న్యూఢిల్లీలో జరిగాయి.చిలీ దేశాధ్యక్షుడితో ప్రధానమంత్రి శ్రీ మోదీ భేటీ
November 20th, 08:36 pm
బ్రెజిల్ దేశ రాజధాని రియో డి జనీరోలో ఏర్పాటైన జి-20 సమావేశాల నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న చిలీ దేశపు అధ్యక్షుడు శ్రీ గాబ్రియల్ బోరిక్ ఫాంట్ తో తొలిసారి భేటీ అయ్యారు.అర్జెంటీనా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ మోదీ
November 20th, 08:09 pm
రియో డి జనీరో లో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న అర్జెంటీనా (ఆర్జెంటీన్ రిపబ్లిక్) అధ్యక్షుడు శ్రీ జేవియర్ మిలే తో సమావేశమయ్యారు.బ్రెజిల్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ
November 20th, 08:05 pm
రియో డి జనీరో లో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాకియో లూలా ద సిల్వా తో సమావేశమయ్యారు. శ్రీ లూలా ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపిన ప్రధాని, జి-20, ఐబీఎస్ఏ (భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా కూటమి) అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలియజేశారు. పేదరికం, క్షుద్బాధల నిర్మూలన కోసం ప్రపంచ స్థాయి సహకార సమితిని ప్రారంభించాలన్న శ్రీ లూలా యోచన పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీ మోదీ, సంస్థకు భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని వెల్లడించారు. మూడు దేశాల జి-20 ప్రత్యేక బృందం (ట్రోయికా) సభ్య దేశంగా బ్రెజిల్ జి-20 ఎజెండాకు శ్రీ మోదీ సంపూర్ణ మద్దతును తెలిపారు. జి-20 కార్యాచరణ పత్రంలో సుస్థిరాభివృద్ధి, ప్రపంచ పాలనలో సంస్కరణలు వంటి లక్ష్యాలను పేర్కొనడం సహా అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు ప్రాముఖ్యాన్నివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వచ్చే యేడాది బ్రెజిల్ చేపట్టనున్న ‘బ్రిక్స్’ సదస్సు, ‘కాప్-30’ అధ్యక్ష బాధ్యతలకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ మోదీ, బ్రెజిల్ కు భారత్ సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.టెక్నాలజీ పరంగా ఆరోగ్య రంగంలో భారతదేశం చురుగ్గా పని చేస్తోంది: ప్రధానమంత్రి
November 20th, 05:02 am
ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యాన్ని ఇచ్చినప్పుడే భూమి మేలైన ఆవాసంగా మారుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. టెక్నాలజీని సమన్వయ పరచడానికి ప్రథమ ప్రాధాన్యాన్ని ఇస్తూ, ఆరోగ్య సంరక్షణ రంగంలో భారతదేశం క్రియాశీలంగా ముందుకు సాగిపోతోందని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రపంచమంతటా జరుగుతున్న కృషిని భారత్ బలపరుస్తుందని ఆయన ప్రధానంగా చెప్పారు.స్థిరాభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పు అంశాలపై జి20 కార్యక్రమం; ప్రధానమంత్రి ప్రసంగానికి అనువాదం
November 20th, 01:40 am
ఈ రోజు కార్యక్రమానికి ఎంపిక చేసుకొన్న ఇతివృత్తం చాలా సందర్భ శుద్ధిగలదీ, తరువాతి తరం భవిష్యత్తుతో ముడిపడిందీనూ. న్యూ ఢిల్లీలో ఇదివరకు జి20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించినప్పుడు, స్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీస్) ను త్వరితగతిన సాధించడానికి ‘వారణాసి కార్యచరణ ప్రణాళిక’ను మనం ఆమోదించాం.స్థిరాభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పు అంశాలపై నిర్వహించిన జి20 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 20th, 01:34 am
స్థిరాభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పు అంశాలపై నిర్వహించిన జి20 కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. జి20 శిఖరాగ్ర సమావేశాన్ని ఇది వరకు న్యూఢిల్లీలో నిర్వహించినప్పుడు 2030కల్లా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడింతలు, ఇంధన సామర్ధ్యాన్ని రెండింతలు చేయాలని జి20 తీర్మానించిందని ఆయన గుర్తు చేశారు. స్థిరాభివృద్ధి సాధనకు సంబంధించిన ఈ ప్రాథమ్యాలను ముందుకు తీసుకు పోవాలని బ్రెజిల్ నిర్ణయించడాన్ని ఆయన స్వాగతించారు.ఇటలీ-ఇండియా ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029
November 19th, 09:25 am
శక్తిమంతమైన ఇండియా-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉమ్మడి కార్యాచరణ ద్వారా మరింత ముందుకు తీసుకువెళ్ళాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ నిర్ణయించారు. నవంబరు 18న బ్రెజిల్ లోని రియో డి జనీరో లో జరిగిన జీ-20 సమావేశానికి హాజరైన సందర్భంగా వారిరువురూ భేటీ అయ్యారు. మరింత స్పష్టతతో, నిర్ణీత సమయానికి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావించారు. ఇందుకోసం వారు వ్యూహాత్మక కార్యాచరణకు రూపకల్పన చేశారు.ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలితో ప్రధానమంత్రి భేటీ
November 19th, 08:34 am
రియో డి జెనీరో లో జరుగుతున్న జి-20 సమావేశాల నేపథ్యంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలు జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. 2024 జూన్, ఇటలీలోని ‘పూలీయా’ లో జార్జియా మెలోనీ అధ్యక్షతన ఏర్పాటైన జి-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన భేటీ అనంతరం ఇరువురు నేతల మధ్య జరిగిన నేటి సమావేశం గత రెండేళ్ళలో అయిదోది. ఎన్నో సమస్యల మధ్య చేపట్టిన జి-7 అధ్యక్ష పదవికి సమర్ధమైన నేతృత్వం అందిస్తున్నందుకు శ్రీ మోదీ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీకి అభినందనలు తెలియజేశారు.