భారత్‌-ఫ్రాన్స్‌ సంయుక్త ప్రకటన

February 18th, 08:10 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల 17 నుంచి 19 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ (ఏఐ)పై ‘ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్-2026’ సహా ప్రధానమంత్రి మోదీతో ద్వైపాక్షిక చర్చల్లోనూ ఆయన పాల్గొన్నారు. అంతేగాక 17న ముంబైలో ‘భారత్‌-ఫ్రాన్స్‌ ఆవిష్కరణ వార్షికోత్సవం-2026’ను వారిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. మాక్రాన్ ప్రస్తుతం నాలుగోసారి భారత్‌ పర్యటనకు రాగా, ప్రధానమంత్రి మోదీ 2025 ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లివచ్చారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం

November 27th, 11:01 am

కేబినెట్‌లో నా సహచరుడు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టి.జి. భరత్ గారు, ఇన్-స్పేస్ చైర్మన్ శ్రీ పవన్ గోయెంకా గారు, స్కైరూట్ బృందం, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా...!

Prime Minister Shri Narendra Modi inaugurates Skyroot’s Infinity Campus in Hyderabad via video conferencing

November 27th, 11:00 am

PM Modi inaugurated Skyroot’s Infinity Campus in Hyderabad, extending his best wishes to the founders Pawan Kumar Chandana and Naga Bharath Daka. Lauding the Gen-Z generation, he remarked that they have taken full advantage of the space sector opened by the government. The PM highlighted that over the past decade, a new wave of startups has emerged across perse sectors and called upon everyone to make the 21st century the century of India.

డీఎస్ఐఆర్ ‘సామర్థ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి’ పథకానికి క్యాబినెట్ ఆమోదం:

September 24th, 05:38 pm

శాస్త్రీయ- పారిశ్రామిక పరిశోధన విభాగం/ శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (డీఎస్ఐఆర్/ సీఎస్ఐఆర్) ‘సామర్థ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి’ పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం కాలానికి, 2021-22 నుంచి 2025-26 వరకు మొత్తం వ్యయం రూ. 2277.397 కోట్లతో దీనిని చేపట్టారు.

భారత్ - సింగపూర్ సంయుక్త ప్రకటన

September 04th, 08:04 pm

గౌరవ సింగపూర్ ప్రధానమంత్రి శ్రీ లారెన్స్ వాంగ్ భారత్‌లో అధికారికంగా పర్యటించిన సందర్భంగా భారత్, సింగపూర్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ప్రణాళికపై సంయుక్త ప్రకటన:

సింగపూర్ ప్రధానితో కలిసి సంయుక్త పత్రికా ప్రకటన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటనకు తెలుగు అనువాదం

September 04th, 12:45 pm

ప్రధానమంత్రి శ్రీ వాంగ్ పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత మొదటిసారిగా భారత్ అధికార పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనకు హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఈ పర్యటన మరింత మహత్తరమైంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తరువాత ప్రస్తుతం 60వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం.

ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 23rd, 10:10 pm

వరల్డ్ లీడర్స్ ఫోరంకు హాజరైన అతిథులందరికీ స్వాగతం. ఈ సదస్సు నిర్వహిస్తున్న సమయం అత్యంత తగిన సమయం.. అందుకు నేను నిర్వాహకులను అభినందిస్తున్నాను. ఒక వారం కిందట నేను ఎర్రకోట నుంచి మాట్లాడుతూ తదుపరి తరం సంస్కరణలను ప్రస్తావించాను. ఇప్పుడు ఈ సదస్సు ఆ స్పూర్తిని మరింత బలోపేతం చేస్తుంది.

న్యూఢిల్లీలో జరిగిన ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 23rd, 05:43 pm

ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఎకనమిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన ప్రముఖ అతిథులందరినీ ఆయన స్వాగతించారు. ఈ ఫోరం జరుగుతున్న సమయం అత్యంత తగిన సమయంగా పేర్కొన్న శ్రీ నరేంద్ర మోదీ.. తగిన సమయంలో ఈ సదస్సును నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. గత వారం తాను ఎర్రకోట వేదికగా తదుపరి తరం సంస్కరణల గురించి మాట్లాడినట్లు గుర్తుచేసిన ప్రధానమంత్రి.. ఇప్పుడు ఆ స్ఫూర్తిని ఈ సదస్సు మరింత శక్తిమంతం చేస్తోందన్నారు.

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన యుగ్మ్ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

April 29th, 11:01 am

నేడు ప్రభుత్వం, విద్యారంగం, సైన్స్, పరిశోధనతో సంబంధం ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఈరోజు ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఐక్యత, ఈ సంగమమే మనం యుగ్మ్ అంటాం. వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) భవిష్యత్ సాంకేతికతకు సంబంధిత భాగస్వాములందరూ సమావేశమై, క్రియాశీలంగా పాల్గొనే వేదికే ఈ యుగ్మ్. భారతదేశ సృజనాత్మక సామర్థ్యాన్ని, డీప్-టెక్ లో దాని పాత్రను పెంచడానికి మనం చేస్తున్న ప్రయత్నాలను ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బాంబేల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ బయోసైన్సెస్, బయోటెక్నాలజీ, ఆరోగ్య, వైద్య రంగాలలో సూపర్ హబ్ లు ప్రారంభమయ్యాయి. ఈ రోజు వాధ్వానీ ఇన్నోవేషన్ నెట్ వర్క్ ను కూడా ప్రారంభించారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో పరిశోధనలను ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈ చొరవ తీసుకున్న వాధ్వానీ ఫౌండేషన్ కు, మా ఐఐటీలకు, ఇతర భాగస్వాములందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా మిత్రుడు రోమేష్ వాధ్వానీని అభినందిస్తున్నాను. మీ అంకితభావం, చురుకైన కృషి వల్ల ప్రైవేటు, ప్రభుత్వ రంగాలు కలిసి దేశ విద్యావ్యవస్థలో అనేక సానుకూల మార్పులను తీసుకువచ్చాయి.

యుగ్మ్ సృజనాత్మక సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రసంగం

April 29th, 11:00 am

న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన యుగ్మ్ ఆవిష్కరణల సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ప్రసంగించారు. భవిష్యత్తు సాంతకేతికతల్లో అభివృద్ధి దిశగా భారత్‌ను నడిపించేందుకు ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు, శాస్త్ర, సాంకేతిక నిపుణులతో జరుగుతున్న ముఖ్యమైన సమావేశంగా యుగ్మ్‌ను ప్రధాని వర్ణించారు. ఈ కార్యక్రమం దేశ ఆవిష్కరణ సామర్థ్యాలను, డీప్-టెక్‌లో తన పాత్రను విస్తరించే ప్రయత్నాలను వేగవంతం చేస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏఐ, ఇంటిలిజెంట్ సిస్టమ్స్, బయోసైన్సెస్, బయోటెక్నాలజీ, ఆరోగ్యం, ఔషధ రంగాలపై దృష్టి సారించేలా ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బాంబేల్లో సూపర్ హబ్‌లు ప్రారంభించామని తెలిపారు. అలాగే నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ సహకారంతో పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వాధ్వానీ ఇన్నోవేషన్ నెట్వర్క్ గురించి ఆయన ప్రస్తావించారు. వాధ్వానీ ఫౌండేషన్, ఐఐటీలు, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగాల మధ్య సహకారం ద్వారా దేశ విద్యావ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకురావడంలో చురుకుగా పనిచేస్తున్న శ్రీ రొమేష్ వాధ్వానీ అంకితభావాన్ని ప్రశంసించారు.

భువనేశ్వర్‌లో ‘ఉత్కర్ష్‌ ఒడిశా’- మేక్‌ ఇన్‌ ఒడిశా సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 28th, 11:30 am

ఒడిశా రాష్ట్ర గవర్నర్‌ శ్రీ హరిబాబు, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ మోహన్‌ చరణ్‌ మాఝీ, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు, ఒడిశా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖ పారిశ్రామిక-వాణిజ్యవేత్తలు, దేశవిదేశాల పెట్టుబడిదారులు, ఈ కార్యక్రమానికి హాజరైన ఒడిశా సోదరసోదరీమణులారా!

భువనేశ్వర్ లో 'ఉత్కర్ష్ ఒడిశా' - మేక్ ఇన్ ఒడిశా సదస్సు- 2025 ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

January 28th, 11:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఒడిశాలోని భువనేశ్వర్ లో ఉత్కర్ష్ ఒడిశా – మేక్ ఇన్ ఒడిశా సమ్మేళనం, 2025 మేక్ ఇన్ ఒడిశా ఎగ్జిబిషన్ లను ప్రారంభించారు. 2025 జనవరి నెలలో తాను ఒడిశాలో పర్యటించడం ఇది రెండోసారి అని, ప్రవాసీ భారతీయ దివస్ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తాను మొదటిసారి వచ్చానని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఒడిశాలో జరిగిన అతిపెద్ద వ్యాపార శిఖరాగ్ర సదస్సు బిజినెస్ సమ్మిట్ ఇదేనని, మేక్ ఇన్ ఒడిశా కాన్ క్లేవ్ 2025లో 5-6 రెట్లు ఎక్కువ మంది పెట్టుబడిదారులు పాల్గొంటున్నారని శ్రీ మోదీ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు ప్రజలకు, ఒడిశా ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు.

అటల్ ఇన్నొవేషన్ మిషన్ కొనసాగింపునకు కేబినెట్ ఆమోదం

November 25th, 08:45 pm

నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఏఐఎం)ను కొనసాగించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని పరిధిని విస్తరించడంతోపాటు, 2028 మార్చి 31 వరకు రూ.2,750 కోట్ల బడ్జెట్ కేటాయించారు.

బ్రిటన్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ మోదీ భేటీ

November 19th, 05:41 am

ద్వైపాక్షిక సంబంధాల వృద్ధి పట్ల సంతృప్తి వెల్లడించిన ఇరువురు నేతలు, భారత-బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ఠపరచాలన్న ఇరుదేశాల నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, నూతన సాంకేతికతలు, పరిశోధన, ఆవిష్కరణ, పర్యావరణ హిత పెట్టుబడులు, ఇరుదేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాల వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని నేతలు నిర్ణయించారు. సమావేశం సందర్భంగా పరస్పర ఆసక్తి గల అంశాలు సహా ముఖ్యమైన అనేక అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలను ప్రధానులు ఇద్దరూ చర్చించారు.

ఫలితాల జాబితా: ఏడో ప్రభుత్వ స్థాయి సంప్రదింపుల నిమిత్తం జర్మనీ ఛాన్సలర్ భారత పర్యటన

October 25th, 04:50 pm

నేరసంబంధిత అంశాల్లో పరస్పర చట్ట సహాయ ఒప్పందం(ఎంఎల్ఏటీ)

ఎన్డిటివి వరల్డ్ సమ్మిట్ లో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు అనువాదం

October 21st, 10:25 am

ఎన్ డిటివి వరల్డ్ సమ్మిట్ కు హాజరైన గౌరవ అతిథులందరికీ స్వాగతం. ఈ సదస్సులో మీరు వివిధ అంశాలపై చర్చించనున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రపంచ నాయకులు కూడా తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

న్యూఢిల్లీలో ‘ఎన్‌డిటివి’ ప్రపంచ సదస్సు-2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

October 21st, 10:16 am

గ‌త నాలుగైదేళ్ల ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ- ప్రపంచ భ‌విష్య‌త్తు సంబంధిత ఆందోళ‌న‌ల‌పై చ‌ర్చ‌లు ఒక సాధారణ ఇతివృత్తంగా మారిపోయాయయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్, ఆ మహమ్మారి అనంతర ఆర్థిక ఒత్తిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వాతావరణ మార్పు సమస్యలు, కొనసాగుతున్న యుద్ధాలు, సరఫరా శ్రేణిలో వినూత్న మార్పులు, అమాయక జనం మరణాలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఇటీవలి సంఘర్షణల సవాళ్లు వగైరాలన్నీ ప్రపంచ శిఖరాగ్ర సమావేశాల్లో చర్చనీయాంశాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇదే సమయాన భార‌త్‌ మాత్రం తన శతాబ్ది వేడుకల నిర్వహణ గురించి చర్చిస్తున్నదని ప్రకటించారు. ‘‘ప్రపంచమంతా పీకల్లోతు సంక్షోభంలో మునిగితే, భారత్ ఆశాకిరణంగా ఉద్భవించింద’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ స్థితిగతులు, దాని ముందున్న సవాళ్లతో భారత్ ప్రభావితమైనప్పటికీ, వాటిని అధిగమించగల ఆశావహ దృక్పథం కొరవడలేదని స్పష్టం చేశారు.

ఉమ్మడి వాస్తవ పత్రం: సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య విస్తరణను కొనసాగించనున్న అమెరికా, ఇండియా

September 22nd, 12:00 pm

అమెరికా, భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం 21వ శతాబ్దపు కీలక భాగస్వామ్యమని, ఇది ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడే అద్భుత అజెండాను నిశ్చయాత్మకంగా ముందుకు తెస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పునరుద్ఘాటించారు.

ఉత్తర‌ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో జరుగుతోన్న సెమీకాన్ ఇండియా 2024లో

September 11th, 04:28 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడా‌లో ఉన్న ఇండియా ఎక్స్ పో మార్ట్‌లో సెమీకాన్ ఇండియా 2024ను ప్రారంభించారు. ఈ సదస్సును సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ‘సెమీకండక్డర్ భవిష్యత్తును తీర్చిదిద్దటం’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల సదస్సులో సెమీకండక్టర్ల విషయంలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చే వ్యూహం, విధానంపై చర్చించనున్నారు. ఈ పరిశ్రమకు చెందిన ప్రపంచ నాయకత్వ స్థాయి వ్యక్తులు, కంపెనీలు, నిపుణులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఈ సదస్సులో ప్రపంచ సెమీకండక్టర్ దిగ్గజాల అగ్రనాయకత్వం పాల్గొంటోంది. సదస్సులో 250 మందికి పైగా ప్రదర్శనదారులు, 150 మంది వక్తలు పాల్గొంటున్నారు.

ప్రధాన మంత్రి అధ్యక్షతన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పాలకమండలి తొలి సమావేశం

September 10th, 04:43 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పాలక మండలి మొదటి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో దేశంలోని శాస్త్ర, సాంకేతిక స్వరూప స్వభావాలు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల రీడిజైనింగ్ గురించి చర్చ జరిగింది.