న్యూఢిల్లీలో నిర్వహించిన ‘రిపబ్లిక్‌ సమ్మిట్‌-2026’లో ప్రధానమంత్రి ప్రసంగం

June 22nd, 10:24 pm

స్వర సాధన.. మనోకామన.. ఆరాధన- ఇలాంటి శుభారంభం తర్వాత, మీ కార్యక్రమమే కొనసాగి ఉంటే చాలా బాగుండేదేమో... ఏదేమైనా మీకందరికీ నమస్కారం!

‘రిపబ్లిక్ సదస్సు-2026’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

June 22nd, 08:00 pm

రిపబ్లిక్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచం వేగవంతమైన, ముఖ్యమైన పరిణామాలను ఎదుర్కొంటున్న తరుణంలో ‘‘గ్రేట్ పవర్ ఇండియా: నేషన్ ఫస్ట్’’ అనే ఇతివృత్తంతో చర్చను ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రధానమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి శుభాకాంక్షలు తెలియజేశారు.గడచిన దశాబ్దంగా భారత్ సాధిస్తున్న విజయాలకు, విశ్వసనీయమైన అంతర్జాతీయ శక్తిగా ఎదగడానికి ‘‘దేశమే ప్రథమం’’ అనే సిద్ధాంతమే మార్గదర్శక సూత్రంగా నిలిచిందని ప్రధానమంత్రి తెలియజేశారు. భారతదేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉందని, అభివృద్ది, ప్రతికూలతల నుంచి నేర్చుకునే ప్రత్యేక సామర్థ్యం ఉందని శ్రీ మోదీ చెప్పారు. ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు.. రాబోయే శతాబ్దాల్లో దేశ భవిష్యత్తుకు పునాది వేస్తున్నాయని స్పష్టం చేశారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మాత్రమే కాకుండా.. విశ్వసనీయమైన, నమ్మకమైన భాగస్వామిగా కూడా భారత్ ఎదుగుతోంది. నమ్మకం, స్థిరత్వం, ప్రపంచ క్షేమం కోసం నిబద్ధతే ఆధారంగా భారత్ వృద్ధి చెందుతోంది’’ అని ప్రధాని వివరించారు.

రిపబ్లిక్ టీవీ కాన్ క్లేవ్ లో ప్రధాని ప్రసంగం

April 26th, 08:01 pm

అర్నబ్ గోస్వామి గారూ, రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ సహోద్యోగులందరూ, దేశవిదేశాల్లోని రిపబ్లిక్ టీవీ వీక్షకులందరూ, లేడీస్ అండ్ జెంటిల్ మెన్! నేను ఏదైనా చెప్పే ముందు, నా చిన్నతనంలో నేను విన్న ఒక జోక్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన కుమార్తె ఆత్మహత్య కు పాల్పడుతూ, తాను జీవితంలో విసిగిపోయానని, ఇక బతకడం ఇష్టం లేదని నోట్ రాసి పెట్టింది. ఏదో ఒకటి తిని కంకారియా సరస్సులో దూకి చనిపోతానని రాసింది. మరుసటి రోజు ఉదయం తన కూతురు ఇంట్లో లేదని ప్రొఫెసర్ గుర్తించాడు. ఆమె గదికి వెళ్లి చూడగా ఒక ఉత్తరం దొరికింది. ఆ లేఖ చదివిన తర్వాత ఆయనకు చాలా కోపం వచ్చింది. తాను ప్రొఫెసర్ ను అని, ఇన్నేళ్లు కష్టపడ్డానని, అయినా సూసైడ్ లెటర్ లో కూతురు కంకారియా ను తప్పుగా రాసిందని ఆయన అన్నారు. అర్నబ్ హిందీ లో బాగా మాట్లాడటం ప్రారంభించడం సంతోషంగా ఉంది. అతను చెప్పింది నేను వినలేదు, కానీ అతని హిందీ సరైనదా కాదా అనే దానిపై నేను శ్రద్ధ పెట్టాను. బహుశా, ముంబైలో నివసించిన తరువాత మీ హిందీ మెరుగుపడింది.

న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సదస్సులో ప్రధాని ప్రసంగం

April 26th, 08:00 pm

న్యూ ఢిల్లీలోని తాజ్ పాలెస్ హోటల్ లో ఈ రోజు జరిగిన ‘రిపబ్లిక్ సదస్సు’ నుద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, వచ్చే నెలకు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రిపబ్లిక్ బృందానికి అభినందనలు తెలియజేశారు. 2019 లో జరిగిన సదస్సులో పాల్గొనటాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అది ప్రజలు వరుసగా రెండోవిడత భారీ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వానికి స్థిరత్వాన్ని ఇచ్చిన సమయమని అన్నారు. భారతదేశానికి ఇదే తగిన సమాయమని దేశం గ్రహించిందనటానికి అది నిదర్శనమన్నారు. ఈ ఏడాది ‘మార్పుకు సమయం’ అనే అంశం మీద జరుపుతున్న సదస్సును దృష్టిలో ఉంచుకొని ఇది నాలుగేళ్లక్రితం తాము ఎంచుకున్న దూరదృష్టిని ప్రతిఫలించిందని, క్షేత్రస్థాయిలో మార్పు చూస్తున్నామని అన్నారు,