రిపబ్లిక్ ప్లీనరీ సదస్సులో ప్రధాని ప్రసంగం
March 06th, 08:05 pm
మీరంతా అలసిపోయి ఉంటారు.. అర్నబ్ గొంతు వినీవినీ మీ చెవులూ అలసిపోయుంటాయి. కూర్చో అర్నబ్.. ఇంకా ఎన్నికల సీజన్ మొదలవలేదు. ముందుగా ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన రిపబ్లిక్ టీవీకి శుభాకాంక్షలు. ఇంత పెద్ద పోటీని నిర్వహించి క్షేత్రస్థాయిలో యువతను భాగస్వాములను చేయడం ద్వారా వీరందరినీ మీరిక్కడికి తీసుకొచ్చారు. జాతీయ స్థాయి చర్చల్లో యువత భాగస్వామ్యం ఆలోచనల్లో కొత్తదనాన్ని రేకెత్తిస్తుంది. అది వ్యవస్థలో నవోత్తేజాన్ని నింపుతుంది. దాన్నే మనమిప్పుడు ఇక్కడ ఆస్వాదిస్తున్నాం. ఓ రకంగా యువత భాగస్వామ్యంతో బంధనాలన్నింటినీ విచ్ఛిన్నం చేయగలం, హద్దులకు అతీతంగా విస్తరించ గలం. దానితో అసాధ్యమైన లక్ష్యమంటూ ఏదీ ఉండదు. చేరుకోలేని గమ్యమంటూ ఏదీ లేదు. ఈ సదస్సు కోసం రిపబ్లిక్ టీవీ కొత్త ఆలోచనలతో పనిచేసింది. ఈ కార్యక్రమం విజయవంతమవడం పట్ల మీ అందరికీ అభినందనలు. మీకు నా శుభాకాంక్షలు. ఇందులో నా స్వార్థం కూడా కొంచెం ఉంది. ఒకటి- నేను కొన్ని రోజులుగా లక్ష మంది యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఆ లక్ష మందీ కూడా తమ కుటుంబాల్లో రాజకీయాల్లోకి వచ్చిన మొదటి వ్యక్తులై ఉండాలి. కాబట్టి ఓ రకంగా ఇలాంటి కార్యక్రమాలు నా లక్ష్య సాధనకు రంగం సిద్ధం చేస్తున్నాయి. రెండు- వ్యక్తిగతంగా నాకో ప్రయోజనముంది. అదేమిటంటే 2029లో ఓటు వేయబోతున్న వారికి 2014కు ముందు వార్తాపత్రికల పతాక శీర్షికల్లో ఏ అంశాలుండేవో తెలియదు. పదీ పన్నెండు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగేవని వారికి తెలియదు. 2029లో ఓటు వేసే సమయానికి.. గతంతో పోల్చి చూసుకునే సదుపాయం వారికి ఉండదు. ఆ పరీక్షలో నేను పాసవ్వాలి. ఆ దిశగా యువతను సన్నద్ధులను చేసేలా జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలు మా ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తాయన్న విశ్వాసం నాకుంది.PM Modi addresses Republic Plenary Summit 2025
March 06th, 08:00 pm
PM Modi addressed the Republic Plenary Summit in Delhi. Shri Modi highlighted that the world is now recognising this century as India's century and the country's achievements and successes have sparked new hope globally. He stated that India, once perceived as a nation that would sink itself and others, is now driving global growth.