'వికసిత భారత్' సంకల్పం తప్పక నెరవేరుతుంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
December 28th, 11:30 am
ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, 2025 సంవత్సరంలో జాతీయ భద్రత, క్రీడలు, సైన్స్ ప్రయోగశాలలు మరియు అంతర్జాతీయ వేదికలపై భారతదేశం తనదైన ముద్ర వేసిందని అన్నారు. నవసంకల్పాలతో 2026లో ముందుకు సాగడానికి దేశం సిద్ధంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, క్విజ్ పోటీ, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 మరియు ఫిట్ ఇండియా ఉద్యమం వంటి యువత కేంద్రీకృత కార్యక్రమాలను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు.ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన: వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలోపేతం చేయడం మరియు ఏఐ సహకారానికి మార్గదర్శకత్వం
February 13th, 03:06 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఫ్రాన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లో చేసిన దౌత్య పర్యటన భారతదేశ ప్రపంచ సంబంధాలను బలోపేతం చేయడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది, కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆర్థిక సంస్కరణలు మరియు చారిత్రక సంబంధాలను గౌరవించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి, ఆర్థిక సహకారం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింతగా పెంచడం పట్ల భారతదేశ నిబద్ధతను ఈ సమగ్ర పర్యటన ప్రదర్శించింది.గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా భారత్-ఫ్రాన్స్ సంయుక్త ప్రకటన
February 12th, 03:22 pm
ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం నేపథ్యంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10-12 తేదీల్లో ఫ్రాన్స్‌ను సందర్శించారు. ఈ రెండు రోజుల్లో అక్కడ నిర్వహించిన కృత్రిమ మేధ (ఎఐ) కార్యాచరణ శిఖరాగ్ర సదస్సుకు రెండు దేశాలూ సంయుక్తంగా అధ్యక్షత వహించాయి. బ్లెచ్లీ పార్క్ (2023 నవంబర్), సియోల్ (2024 మే) శిఖరాగ్ర సదస్సులు తీర్మానించిన మేరకు సాధించిన కీలక విజయాలను మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై ఈ సదస్సు చర్చించింది. ఇందులో వివిధ దేశాల-ప్రభుత్వాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులతోపాటు చిన్న-పెద్ద వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు సహా కళాకారులు-పౌర సమాజ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉపయోగకర సామాజిక, ఆర్థిక, పర్యావరణ రంగాల్లో సత్ఫలితాల సాధనకు అంతర్జాతీయ కృత్రిమ మేధ రంగం సారథ్యం వహించేలా నిర్దిష్ట చర్యలు చేపట్టడానికి అంకిత భావంతో కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సును విజయవంతంగా నిర్వహించారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ను భారత ప్రధాని మోదీ అభినందించారు. తదుపరి శిఖరాగ్ర సదస్సును భారత్ నిర్వహించనుండటంపై ఫ్రాన్స్ హర్షం వ్యక్తం చేసింది.AAP-da's sinking ship will drown in Yamuna Ji: PM Modi in Kartar Nagar, Delhi
January 29th, 01:16 pm
PM Modi today, addressed a massive crowd in Kartar Nagar, declared that Delhi had rejected excuses, fake promises, and deception. He asserted that the city demanded a double-engine BJP government focused on welfare and development, ensuring housing, modernization, piped water, and an end to the tanker mafia. Confident of victory, he proclaimed, On February 5th, AAP-da Jayegi, BJP Aayegi!”PM Modi’s power-packed rally in Kartar Nagar ignites BJP’s campaign
January 29th, 01:15 pm
PM Modi today, addressed a massive crowd in Kartar Nagar, declared that Delhi had rejected excuses, fake promises, and deception. He asserted that the city demanded a double-engine BJP government focused on welfare and development, ensuring housing, modernization, piped water, and an end to the tanker mafia. Confident of victory, he proclaimed, On February 5th, AAP-da Jayegi, BJP Aayegi!”ఢిల్లీలోని కరియప్ప పెరేడ్ మైదానంలో ఎన్‌సిసి ర్యాలీ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 27th, 05:00 pm
కేంద్ర మంత్రిమండలిలోని నా సహచరులు శ్రీ రాజ్‌నాథ్ సింగ్, శ్రీ సంజయ్ సేథ్, ‘సిడిఎస్’ జనరల్ శ్రీ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు, రక్షణశాఖ కార్యదర్శి గారు, ‘ఎన్‌సిసి’ డీజీగారు, ఇతర అతిథులు నా ప్రియ ‘ఎన్‌సిసి’ యువ మిత్రులారా!వార్షిక ‘ఎన్‌సిసి పిఎం ర్యాలీ’లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 27th, 04:30 pm
దేశ రాజధాని ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఇవాళ నిర్వహించిన వార్షిక ‘నేషనల్ కేడెట్ కోర్ (ఎన్‌సిసి) పీఎం ర్యాలీ’లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించడంతోపాటు ఉత్తమ కేడెట్లకు పురస్కార ప్రదానం చేశారు. ‘ఎన్‌సిసి దినోత్సవం’ నేపథ్యంలో సభికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ- 18 మిత్రదేశాల నుంచి దాదాపు 150 మంది కేడెట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని వారందరినీ స్వాగతిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. అలాగే ‘మేరా యువ భారత్’ (మై భారత్) పోర్టల్ ద్వారా దేశం నలుమూలల నుంచి ఆన్‌లైన్‌లో పాల్గొన్న యువతను కూడా ఆయన అభినందించారు.భారత్ 76వ గణతంత్ర దినోత్సవం.. ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఐర్లాండ్ ప్రధానిల శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి
January 27th, 11:06 am
భారత్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్‌కు, ఐర్లాండ్ ప్రధాని శ్రీ మేఖేల్ మార్టిన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ధన్యవాదాలు తెలియజేశారు.భారత్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు... థాయిలాండ్ ప్రధానికి భారత ప్రధానమంత్రి ధన్యవాదాలు
January 26th, 10:20 pm
భారత్ 76వ గణతంత్ర దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా థాయిలాండ్ ప్రధాని పైతాంగ్‌తార్న్ చినవత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి ప్రతిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ధన్యవాదాలు వ్యక్తం చేశారు.జనవరి 27న ఢిల్లీలో కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి ఇతివృత్తం: యువశక్తి… వికసిత్ భారత్
January 26th, 07:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 27న సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న ఎన్‌సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ తరహా ర్యాలీని ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు.భారత్ 76వ గణతంత్ర దినోత్సవం.. ప్రపంచ నేతల శుభాకాంక్షలు.. ప్రధానమంత్రి ధన్యవాదాలు
January 26th, 05:56 pm
భారత్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు వ్యక్తం చేశారు.సాంస్కృతిక వారసత్వాన్ని, సైన్య శక్తిని చాటిన పరేడ్ అద్భుతం: ప్రధాన మంత్రి
January 26th, 03:41 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘గణతంత్ర దినోత్సవం 2025’ దృశ్యాల్ని పంచుకొంటూ, ఈ ఉత్సవం భారత్‌లో ఏకత్వంలో భిన్నత్వం ఎంతటి జవసత్వాలతో కళకళలాడుతోందీ కళ్లకు కట్టిందని అభివర్ణించారు. వైభవోపేతంగా సాగిన పరేడ్ మన సాంస్కృతిక వారసత్వాన్ని, సైన్య శక్తిని చాటిచెప్పిందని ఆయన అన్నారు.భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది
January 26th, 12:30 pm
కర్తవ్య పథంలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశ ఐక్యత, బలం మరియు వారసత్వాన్ని ప్రదర్శించాయి. ప్రధానమంత్రి మోదీ రాష్ట్రీయ సమర్ స్మారక్ వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యారు. సాయుధ దళాల కవాతు బృందాలు క్రమశిక్షణ మరియు శౌర్యాన్ని ప్రదర్శించాయి, ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు భారతదేశ గొప్ప వైవిధ్యాన్ని హైలైట్ చేశాయి. భారత వైమానిక దళం యొక్క ఉత్కంఠభరితమైన ఫ్లైపాస్ట్ ప్రేక్షకులను ఆకర్షించింది. వేడుకలకు హాజరైన ప్రజలను ప్రధాని కూడా పలకరించారు.ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధానమంత్రి
January 26th, 08:30 am
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ రోజు మనం గణతంత్ర 75వ వార్షికోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించుకొంటున్నామన్నారు.రాష్ట్రపతి ప్రసంగం ప్రేరణాత్మకం.. ఎన్నో అంశాలను ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు.. మన రాజ్యాంగానికున్న గొప్పదనాన్ని చెప్పడంతో పాటు దేశాన్ని ప్రగతిపథంలో నిలపడానికి పని చేయాలని స్పష్టం చేశారు: ప్రధానమంత్రి
January 25th, 10:09 pm
గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రేరణదాయకంగా ప్రసంగించారంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు ఈ రోజు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి అనేక అంశాలను ప్రధానంగా ప్రస్తావించారని, మన రాజ్యంగం గొప్పదనాన్ని చాటిచెప్పడంతో పాటు, దేశాన్ని ప్రగతి పథంలో నడపడానికి కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారని ఆయన అన్నారు.ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు స్వాగతం పలకడం భారతదేశానికి గర్వకారణం: ప్రధానమంత్రి
January 25th, 05:48 pm
భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన ఇండొనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబోవో సుబియాంటోకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆయనతో భారత - ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. భారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఇండోనేషియా కీలక పాత్ర పోషించిందని, బ్రిక్స్ లో ఇండోనేషియా సభ్యత్వాన్ని భారత్ స్వాగతిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.గణతంత్ర దినోత్సవంలో పాల్గొనే ‘ఎన్‌సిసి’.. ‘ఎన్‌ఎస్‌ఎస్’ కార్యకర్తలతో ప్రధానమంత్రి సంభాషణ
January 25th, 03:30 pm
సర్... మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలన్న నా కల ఈ రోజు నెరవేరింది‘ఎన్‌సిసి’ కేడెట్లు.. ‘ఎన్‌ఎస్‌ఎస్’ వలంటీర్లు.. గిరిజన అతిథులు.. శకట కళాకారులతో ప్రధానమంత్రి మాటామంతీ
January 25th, 03:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న (జనవరి 24న) గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనబోతున్న ‘ఎన్‌సిసి’ కేడెట్లు, ‘ఎన్‌ఎస్‌ఎస్’ వలంటీర్లు, గిరిజన అతిథులు, శకట కళాకారులతో ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్‌లోగల తన నివాసంలో ముచ్చటించారు. దేశ ప్రధానిని ప్రత్యక్షంగా కలుసుకోవడంపై వారంతా ఎంతో సంతోషం ప్రకటించగా- “ఇది భారత ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనం” అని ఆయన వ్యాఖ్యానించారు.ఇండోనేషియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 25th, 01:00 pm
భారత తొలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇండోనేషియా మన ముఖ్య అతిథిగా ఉంది. ఇప్పుడు మన 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా, ఇండోనేషియా మరోసారి ఈ చిరస్మరణీయ సందర్భంలో భాగం కావడానికి అంగీకరించడం మాకు చాలా గర్వకారణం. ఈ సందర్భంగా, ఆ దేశ అధ్యక్షులు ప్రబోవో సహా వారి బృందానికి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, గిరిజన ప్రతినిధులు, శకటాల కళాకారులతో ప్రధాని సంభాషణ
January 24th, 08:08 pm
త్వరలో జరగబోతున్న గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనబోతున్న ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, గిరిజన ప్రతినిధులు, శకటాల కళాకారులతో లోకకల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సంభాషించారు. అనంతరం భారతదేశ సంస్కృతి, వైవిధ్యాన్ని చాటిచెప్పేలా సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు.