గ్రీస్ ప్రధాని గౌరవ కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో ప్రధానమంత్రి భేటీ

February 19th, 07:15 pm

ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభ సందర్భంగా హెలెనిక్ రిపబ్లిక్ (గ్రీస్) ప్రధానమంత్రి శ్రీ కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ ఈ రోజు అయ్యారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో పాల్గొనడానికి గ్రీస్ ప్రధానమంత్రి ఈ నెల 18-19 తేదీల్లో భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని గౌరవ శ్రీ మిత్సోటాకిస్‌ వెంట ఆ దేశ డిజిటల్ గవర్నెన్స్ మంత్రి శ్రీ డిమిట్రియోస్ పాపాస్టెర్గియో, సీనియర్ అధికారుల ప్రతినిధి బృందం ఉన్నారు.

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా గౌరవ ఫిన్లాండ్ ప్రధాని పెట్టేరి ఓర్పోతో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భేటీ

February 18th, 05:10 pm

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా 2026 ఫిబ్రవరి 18న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో గౌరవ ఫిన్లాండ్ ప్రధానమంత్రి పెట్టేరి ఓర్పోతో సమావేశమయ్యారు.

భారత్‌-ఫ్రాన్స్‌ సంయుక్త ప్రకటన

February 18th, 08:10 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల 17 నుంచి 19 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ (ఏఐ)పై ‘ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్-2026’ సహా ప్రధానమంత్రి మోదీతో ద్వైపాక్షిక చర్చల్లోనూ ఆయన పాల్గొన్నారు. అంతేగాక 17న ముంబైలో ‘భారత్‌-ఫ్రాన్స్‌ ఆవిష్కరణ వార్షికోత్సవం-2026’ను వారిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. మాక్రాన్ ప్రస్తుతం నాలుగోసారి భారత్‌ పర్యటనకు రాగా, ప్రధానమంత్రి మోదీ 2025 ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లివచ్చారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్‌ను ఫిబ్రవరి 17న కలుసుకోనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 16th, 09:02 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 17న ముంబయికి వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్‌‌తో సమావేశమవుతారు.