80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాంగణం నుండి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 04:44 pm
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈరోజు ఎర్రకోట ప్రాంగణం నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో, గత 12 సంవత్సరాలుగా తయారీ రంగం, డిజిటల్ వృద్ధి మరియు పౌర సేవల రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతికి సంబంధించిన వివరణాత్మక నివేదికను ఆయన సమర్పించారు. జాతీయ ఆశయాలను సాధించడం కోసం ఏడు కీలక రంగాలతో కూడిన పరివర్తనాత్మక సప్తధారను కూడా ఆయన ఆవిష్కరించారు.12 ఏళ్ల పరివర్తన: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భారత ప్రగతిని ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి
August 15th, 01:18 pm
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత 12 ఏళ్లలో భారత్ సాధించిన పరివర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. తయారీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సదుపాయాలు, ఇంధన భద్రత, యువత సాధికారత, ఆవిష్కరణలు, సామాజిక భద్రత, ఇతర కీలక రంగాల్లో దేశం సాధించిన పురోగతిని వివరించారు.ఏడాదిలో కోటి మంది యువతకు కృత్రిమ మేధ నైపుణ్య శిక్షణ: ప్రధానమంత్రి ప్రకటన
August 15th, 01:01 pm
80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. కృత్రిమ మేధ విద్య, క్రీడలు, పౌర రక్షణ, సెమీకండక్టర్ తయారీ, అణు విద్యుత్, మహిళా సాధికారత రంగాలలో అనేక నూతన కార్యక్రమాలను, నిర్దేశిత లక్ష్యాలను ప్రకటించారు.గుజరాత్‌లోని హజీరాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సందర్శించిన ప్రధానమంత్రి
June 05th, 10:08 pm
గుజరాత్‌లోని హజీరాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమం కింద రక్షణ రంగంలో దేశం సాధిస్తున్న అభివృద్ధి, పెరుగుతున్న సామర్థ్యాలను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు.ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ – వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన పారిశ్రామికవేత్తలు
October 15th, 02:23 pm
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ - వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (ఐటియు- డబ్ల్యుటిఎస్ఎ) - 2024 సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎనిమిదో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించారు. డబ్ల్యుటిఎస్ఎ అనేది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రామాణికీకరణ కార్యకలాపాలకు పాలక వర్గ సమావేశం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఐటియు- డబ్ల్యుటిఎస్ఎ సదస్సును ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో- భారతదేశంలో నిర్వహించడం ఇదే తొలిసారి. ఇది టెలికాం, డిజిటల్, ఐసిటి రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 190 దేశాలకు చెందిన 3,000 మందికి పైగా పారిశ్రామిక నాయకులు, విధాన రూపకర్తలు, సాంకేతిక నిపుణులను ఏకతాటిపైకి తెచ్చిన ఒక కీలకమైన అంతర్జాతీయ సదస్సు.గ్లోబల్ పార్ట్ నర్‌శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (జిపిఎఐ) వార్షిక శిఖర సమ్మేళనాన్ని డిసెంబరు 12వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
December 11th, 04:27 pm
గ్లోబల్ పార్ట్‌నర్‌శిప్ ఆన్ ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (జిపిఎఐ) సమిట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 12 వ తేదీ నాడు సాయంత్రం పూట దాదాపు గా 5 గంటల వేళ లో న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రారంభించనున్నారు.ఇన్ ఫినిటీ- ఫోరమ్ ను డిసెంబర్ 3వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
November 30th, 11:26 am
‘ఇన్ ఫినిటీ- ఫోరమ్’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 3న ఉదయం 10 గంటల వేళ లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఇన్ ఫినిటీ ఫోరమ్ అనేది ‘ఫిన్- టెక్’ అంశం పై మేధోమథనం జరిపేటటువంటి ఒక నాయకత్వ వేదిక గా ఉంది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు మరియు గ్యాస్ రంగ నిపుణులతో, సిఇఒ లతో ప్రధాన మంత్రి ముఖాముఖి సంభాషణ
October 09th, 02:26 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు మరియు గ్యాస్ రంగ నిపుణులతో, సిఇఒ లతో ఈ రోజు సమావేశమై వారితో ముఖాముఖి సంభాషించారు.