కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ)
December 31st, 03:11 pm
ఒడిశా రాష్ట్రంలో ‘ఎన్హెచ్(ఓ)’ కింద ‘ఈపీసీ’ పద్ధతిలో ప్రస్తుత 2 వరుసల జాతీయ రహదారిని అంచుల చదును సహా విస్తరణ-బలోపేతం చేసే పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎన్హెచ్-326 పరిధిలో 68.600 కిలోమీటరు నుంచి 311.700 కిలోమీటరు వరకూ రహదారిని రెండు వైపులా అంచుల చదును (పేవ్డ్ షోల్టర్స్) సహా ఉన్నతీకరిస్తారు.