Rashtra Prerna Sthal gives the message that every step, every effort must be dedicated to nation-building: PM Modi in Lucknow
December 25th, 06:16 pm
PM Modi inaugurated the Rashtra Prerna Sthal in Lucknow, Uttar Pradesh today. He paid respectful homage, offering salutations to Mahamana Malaviya ji, Atal ji, and Maharaja Bijli Pasi. He remarked that Atal ji and Malaviya ji dedicated their lives to safeguarding India’s identity, unity and pride. Quoting lines of Atal ji, the PM emphasized that Rashtra Prerna Sthal gives the message that every step, every effort must be dedicated to nation-building.ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ‘జాతీయ స్ఫూర్తి ప్రదాన ప్రాంగణాన్ని’ ప్రారంభించిన ప్రధానమంత్రి
December 25th, 05:23 pm
మాజీ ప్రధాని అటల్ బిహారీ శ్రీ వాజ్‌పేయి 101వ జయంతి నేపథ్యంలో ఆయన జీవితం, ఆదర్శాల గౌరవపూర్వక సంస్మరణ దిశగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్మించిన ‘జాతీయ స్ఫూర్తి ప్రదాన ప్రాంగణాన్ని (రాష్ట్ర ప్రేరణా స్థల్)ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- లక్నో నగరం ఇవాళ ఓ నవ్య స్ఫూర్తికి సాక్షిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. అలాగే, దేశ ప్రజలతోపాటు యావత్ ప్రపంచంలోని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో లక్షలాది కుటుంబాలు నేడు ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ క్రిస్మస్ వేడుక ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం నింపాలన్నదే ప్రజానీకం సమష్టి ఆకాంక్షగా ఆయన పేర్కొన్నారు.మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 101వ జయంతి సందర్భంగా డిసెంబర్ 25న ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని
December 24th, 11:04 am
మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి 101 జయంతిని పురస్కరించుకొని 2025 డిసెంబర్ 25న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర ప్రేరణా స్థల్‌ను ప్రారంభిస్తారు. అలాగే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.