బీహార్లోని ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి సంభాషణ
September 26th, 03:00 pm
బీహార్లో ‘ముఖ్యమంత్రి మహిళా ఉపాధిక పథకం’ లబ్ధిదారుల నుంచి ఎంపిక చేసిన కొందరు మహిళలు ఇప్పుడు ప్రధానమంత్రితో తమ అనుభవాలను పంచుకుంటారు. మొదట- పశ్చిమ చంపారన్ జిల్లా వాస్తవ్యురాలైన సోదరి రంజిత కాజీని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.బీహార్ ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ లబ్ధిదారులతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 26th, 02:49 pm
తమ ప్రాంతంలో మార్పును తీసుకువచ్చినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి శ్రీ నీతీశ్ కుమార్కు బీహార్లోని పశ్చిమ చంపారణ్ జిల్లాకు చెందిన గిరిజన మహిళ శ్రీమతి రంజీతా కాజీ మనసారా కృతజ్ఞతలు తెలిపారు. ఆమె జీవికా స్వయంసహాయ బృందం సభ్యురాలు. తాముంటున్న అటవీ ప్రాంతంలో ఒకప్పుడు కనీస సదుపాయాలు కూడా లేవనీ, అదే ప్రాంతంలో ఇప్పుడు విద్య, నీళ్లు, కరెంటు, పారిశుధ్యం, రోడ్లు సమకూరినట్లు ఆమె ప్రస్తావించారు. పంచాయతీ రాజ్ సంస్థల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరిగేట్లు రిజర్వేషనును అమల్లోకి తీసుకురావడం సహా మహిళా కేంద్రీకృత కార్యక్రమాల్ని చేపట్టినందుకు బీహార్ ముఖ్యమంత్రికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. యూనిఫారాలు, సైకిళ్ల పథకాలను ఆమె ప్రశంసించారు. బాలికలు స్కూలు యూనిఫారాలను ధరించి సైకిళ్లను నడపడాన్ని చూస్తే తనకు సంతోషంగా ఉంటుందని ఆమె చెప్పారు.