భారత్‌లో 100వ రామ్‌సర్ స్థలంగా జై ప్రకాశ్ నారాయణ్ పక్షుల అభయారణ్యం.. ప్రధానమంత్రి హర్షం
June 05th, 11:58 am
భారత్.. రామ్‌సర్ స్థలాల్లో ‘సెంచరీ’ని సాధించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్.. బలియాలో గల జై ప్రకాశ్ నారాయణ్ పక్షుల అభయారణ్యాన్ని (సురహా తాల్) దేశంలో 100వ రామ్‌సర్ స్థలంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని స్పందించారు.పట్నా పక్షుల అభయారణ్యం, ఛారీ-ధండ్‌లను రాంసర్ ప్రాంతాలుగా గుర్తించడాన్ని స్వాగతించిన ప్రధాని
January 31st, 10:52 am
ఎటా (ఉత్తరప్రదేశ్)లోని పట్నా పక్షుల అభయారణ్యాన్ని, కచ్ (గుజరాత్)లోని ఛారీ-ధండ్‌ను రాంసర్ ప్రాంతాలుగా గుర్తించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. స్థానికులకు, చిత్తడి నేలల సంరక్షణపై ఆసక్తి ఉన్నవారికి శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. జీవవైవిధ్యాన్ని కాపాడటంలో, కీలకమైన పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంలో తమ చిత్తశుద్ధిని ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తోందని పేర్కొన్నారు.బీహార్‌లోని రెండు ప్రాంతాలు రాంసార్ కేంద్రాలుగా గుర్తింపు పొందటాన్ని భారతదేశ చిత్తడి నేలల సంరక్షణలో కీలక ఘట్టంగా పేర్కొన్న ప్రధానమంత్రి
September 27th, 06:00 pm
ఈ రోజు రాంసార్ కేంద్రాలుగా బీహార్‌కు చెందిన బక్సర్ జిల్లాలో గోకుల్ జలషాయ్ (448 హెక్టార్లు), పశ్చిమ చంపారన్ జిల్లాలో ఉదయపూర్ ఝీల్ (319 హెక్టార్లు) గుర్తింపు పొందటం... భారతదేశ పర్యావరణ పరిరక్షణకు గర్వకారణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.