శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 28th, 03:35 pm
ఈ రోజు ఈ పవిత్ర సందర్భంలో నా మనసు శాంతితో నిండిపోయింది. సాధువులు, మహర్షుల సమక్షంలో కూర్చోవడం ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఉండటం శతాబ్దాల నాటి ఈ మఠం శక్తిని మరింత బలోపేతం చేస్తుంది. ఈ వేడుకలో మీ మధ్య ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి రాకముందు, రామాలయం... వీర్ విఠల్ ఆలయాల్లో పూజలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఇక్కడి శాంతి, ప్రశాంత వాతావరణం ఈ వేడుక ఆధ్యాత్మిక సారాన్ని మరింతగా పెంచాయి.గోవాలో జరిగిన శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
November 28th, 03:30 pm
“శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవాన్ని చేసుకుంటోంది. ఇది చాలా చారిత్రాత్మక సందర్భం. గత 550 సంవత్సరాలలో ఈ మఠం అనేక కల్లోల పరిస్థితులను ఎదుర్కొంది. తరాలు మారినా, కాలాలు మారినా.. దేశంతో పాటు సమాజంలో అనేక పరివర్తనలు వచ్చినా మఠం ఎప్పుడూ దిశను కోల్పోలేదు. దీనికి బదులు ఈ మఠం ప్రజలకు మార్గదర్శక కేంద్రంగా మారింది. మఠానికి ఉన్న గొప్ప గుర్తింపు ఏంటంటే.. చరిత్రతో గట్టిగా పాతుకుపోయి ఉన్నప్పటికీ కాలంతో పాటు మారుతూ ముందుకు కదులుతూనే ఉంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మఠం స్థాపించటంలో ఉన్న స్ఫూర్తి ఈ రోజు కూడా అదే విధంగా సజీవంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ స్ఫూర్తే సాధనను సేవతో, సంప్రదాయాన్ని ప్రజా సంక్షేమంతో మిలితం చేస్తోందన్నారు. ‘జీవితానికి స్థిరత్వం, సమతుల్యత, విలువలను అందించడం’ అనే ఆధ్యాత్మికతకు ఉన్న నిజమైన భావనను తరతరాలుగా మఠం తెలియజేస్తోందని ప్రధాని అన్నారు. కష్ట సమయాల్లో కూడా సమాజాన్ని నిలబెట్టే బలానికి మఠం చేసిన 550 సంవత్సరాల ప్రయాణమే నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ, కమిటీలోని సభ్యులందరూ, ఈ వేడుకతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.The energy here today, especially among the youth, says it all - ‘Phir Ek Baar, NDA Sarkar’: PM Modi in Nawada, Bihar
November 02nd, 02:15 pm
In a public rally in Nawada, PM Modi highlighted the enthusiasm among the women of Bihar whenever he visited the state. He noted that from Jeevika Didis powering the rural economy to Lakhpati Didis setting examples of self-reliance, and to Krishi Sakhis, Bank Sakhis and Namo Drone Didis, women are leading the Bihar's transformation. Urging the crowd to switch on their mobile flashlights, he gathered support for the NDAPM Modi addresses large public gatherings in Arrah and Nawada, Bihar
November 02nd, 01:45 pm
Massive crowd attended PM Modi’s rallies in Arrah and Nawada, Bihar, today. Addressing the gathering in Arrah, the PM said that when he sees the enthusiasm of the people, the resolve for a Viksit Bihar becomes even stronger. He emphasized that a Viksit Bihar is the foundation of a Viksit Bharat and explained that by a Viksit Bihar, he envisions strong industrial growth in the state and employment opportunities for the youth within Bihar itself.న్యూఢిల్లీలో నిర్వహించిన జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
September 12th, 04:54 pm
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ గారు, విద్యావేత్తలు, సోదరీసోదరులారా!‘జ్ఞాన భారతం’ పోర్టల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
September 12th, 04:45 pm
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన ‘జ్ఞాన భారతం’ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత స్వర్ణయుగ పునరుజ్జీవనానికి విజ్ఞాన్ భవన్ సాక్ష్యంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల కిందటే జ్ఞాన భారతం కార్యక్రమం గురించి తాను ప్రకటించగా, స్వల్ప వ్యవధిలోనే ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుండటం విశేషమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంతో ముడిపడిన పోర్టల్‌ను కూడా ప్రారంభించామని శ్రీ మోదీ వెల్లడించారు. ఇది ప్రభుత్వం లేదా విద్యా వ్యవస్థ సంబంధిత కార్యక్రమం కాదని, భారతీయ సంస్కృతి-సాహిత్యం, చైతన్య గళంగా జ్ఞాన భారతం ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. వేల తరాల సాలోచనా వారసత్వాన్ని ప్రస్తావిస్తూ- మహనీయులైన రుషులు, ఆచార్యులు, పండితుల జ్ఞానం, పరిశోధనలను ఆయన గుర్తుచేశారు. భారతీయ జ్ఞానం, సంప్రదాయాలు, శాస్త్రీయ వారసత్వానికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. మనకు సంక్రమించిన ఈ సుసంపన్న వారసత్వాన్ని జ్ఞాన భారతం కార్యక్రమం ద్వారా డిజిటలీకరిస్తామని శ్రీ మోదీ వెల్లడించారు. దీనిపై ప్రజలకు అభినందించడంతోపాటు ఈ మిషన్ నిర్వహణ బృందం సభ్యులకు, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.మారిషస్‌లోని భారతీయులతో సమావేశంలోప్రధానమంత్రి ప్రసంగం
March 12th, 06:07 am
పదేళ్ల కిందట ఇదే తేదీన నేను మారిషస్ పర్యటనకు వచ్చేనాటికి ఓ వారం ముందే మేం హోలీ పండుగ చేసుకున్నాం. అప్పుడు భారత్ నుంచి హోలీ వేడుకల సంరంభాన్ని నాతో మోసుకొచ్చాను. అయితే, ఈసారి వర్ణరంజిత హోలీ సంరంభాన్ని మారిషస్ నుంచి మన దేశానికి తీసుకెళ్తాను. ఈ నెల 14వ తేదీన హోలీ కాబట్టి.. వేడుకలకు మరొక రోజు మాత్రమే ఉంది.మారిషస్‌లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
March 11th, 07:30 pm
మారిషస్ ప్రధాని శ్రీ నవీన్ చంద్ర రాంగులాంతో పాటు భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మారిషస్‌లోని ట్రాయోన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటైన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని, ఇండియా మిత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వృత్తినిపుణులు, సామాజిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, వ్యాపార రంగ ప్రముఖులు సహా భారతీయ ప్రవాసులు చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే మారిషస్ మంత్రులు అనేక మందితోపాటు పార్లమెంట్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.రామాయణ, మహాభారతాలు అరబిక్ భాషలోకి అనువాదం: శ్రీ అబ్దుల్లా అల్-బరూన్, శ్రీ అబ్దుల్ లతీఫ్ అల్-నసేఫ్‌లకు ప్రధానమంత్రి ప్రశంసలు
December 21st, 07:03 pm
రామాయణాన్ని, మహాభారతాన్ని అరబిక్ భాషలోకి అనువాదం చేసి ప్రచురించినందుకు శ్రీ అబ్దుల్లా అల్-బరూన్, శ్రీ అబ్దుల్ లతీఫ్ అల్-నసేఫ్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
October 27th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా జీవితంలో మరపురాని క్షణాలేవని మీరు నన్ను అడిగితే చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. కానీ చాలా ప్రత్యేకమైన మరపురాని ఒక క్షణం ఉంది- అది గత సంవత్సరం నవంబర్ 15 వ తేదీన జరిగింది. ఆరోజు నేను భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్‌లోని ఆయన జన్మస్థలమైన ఉలిహాతు గ్రామానికి వెళ్ళాను. ఈ యాత్ర నాపై చాలా ప్రభావం చూపింది. ఈ పుణ్యభూమి మట్టిని తలతో తాకే భాగ్యం పొందిన దేశ తొలి ప్రధానమంత్రిని నేనే. ఆ క్షణంలో స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న శక్తి తెలిసిరావడమే కాకుండా ఈ భూ శక్తితో అనుసంధానమయ్యే అవకాశం కూడా వచ్చింది. ఒక సంకల్పాన్ని నెరవేర్చేందుకు చేసే సాహసం దేశంలోని కోట్లాది ప్రజల భవిష్యత్తును ఎలా మార్చగలదో నేను గ్రహించాను.లావో రామాయణ ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధానమంత్రి
October 10th, 01:47 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మక లువాంగ్ రాయల్ థియేటర్- ప్రబాంగ్ లో ప్రదర్శించిన ఫలక్ ఫలం లేదా ఫ్రా లక్ ఫ్రా రామ్ అని పిలిచే లావో రామాయణం ఒక ఎపిసోడ్‌ను వీక్షించారు. లావోస్‌లో రామాయణ ప్రదర్శన నేటికీ కొనసాగుతోంది. ఈ ఇతిహాసం రెండు దేశాల భాగస్వామ్య వారసత్వం, పురాతన నాగరికత సంబంధాన్ని తెలియజేస్తోంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో చాలా వాటిని శతాబ్దాలుగా లావోస్‌లో ఆచరిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. ఇరు దేశాలు తమ భాగస్వామ్య వారసత్వాన్ని వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి. లావోస్‌లోని వాట్ ఫౌ ఆలయం, సంబంధిత స్మారక చిహ్నాలను పునరుద్ధరించే పనిలో భారత పురాతత్వ శాఖ నిమగ్నమైంది. హోం మంత్రి, విద్య, క్రీడల మంత్రి, బ్యాంక్ ఆఫ్ లావో పీడీఆర్ గౌరవ గవర్నర్, వియంటియాన్ మేయర్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.The dreams of crores of women, poor and youth are Modi's resolve: PM Modi
February 18th, 01:00 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.PM Modi addresses BJP Karyakartas during BJP National Convention 2024
February 18th, 12:30 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.రామాయణంలో శబరి ఉదంతంపై మైథిలీ ఠాకూర్ ఆలపించిన భావోద్వేగ గీతాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
January 20th, 09:22 am
రామాయణంలో భక్త శబరి ఉదంతంపై మైథిలీ ఠాకూర్ ఆలపించిన భావోద్వేగ గీతాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు. అయోధ్యలో ప్రతిష్ఠాపన సందర్భంగా భగవాన్ శ్రీరాముని జీవితం, ఆదర్శాల సంబంధిత వివిధ ఉదంతాలను ఈ గీతం ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తున్నదని శ్రీ మోదీ అన్నారు.మహారాష్ట్రలోని షోలాపూర్ లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
January 19th, 12:00 pm
మహారాష్ట్ర గవర్నరు శ్రీ రమేష్ బాయిస్ గారు, ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అజిత్ దాదా పవార్ గారు, మహారాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, శ్రీ నరసయ్య ఆడమ్ గారు, షోలాపూర్ సోదర సోదరీమణులకు నమస్కారం!సుమారు 2,000 రూపాయల విలువ కలిగిన ఎనిమిది అమృత్ ప్రాజెక్టుల కుమహారాష్ట్ర లోని సోలాపుర్ లో శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
January 19th, 11:20 am
సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన ఎనిమిది అమృత్ (అటల్ మిశన్ ఫార్ రిజూవినేశన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేశన్ -ఎఎమ్ఆర్‌యుటి..అమృత్) ప్రాజెక్టులు ఎనిమిదింటి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని సోలాపుర్ లో ఈ రోజు న శంకుస్థాపన చేశారు. పిఎమ్ఎవై-అర్బన్ లో భాగం గా మహారాష్ట్ర లో నిర్మాణ పనులు పూర్తి అయిన 90,000 కు పైగా ఇళ్ళ ను, సోలాపుర్ లో రేనగర్ హౌసింగ్ సొసైటీ కి చెందిన 15,000 గృహాల ను దేశ ప్రజల కు శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు. ఈ ఇళ్ళ లబ్ధిదారుల లో వేల కొద్దీ చేనేత కార్మికులు, విక్రేతలు, మరమగ్గాల శ్రమికులు, వ్యర్థ పదార్థాల ను సేకరించే వారు, బీడీ కార్మికులు, డ్రైవర్ లు.. తదితర వ్యక్తులు ఉన్నారు. ఇదే కార్యక్రమం లో ఆయన పిఎమ్ స్వనిధి తాలూకు 10,000 మంది లబ్ధిదారుల కు ఒకటో కిస్తు మరియు రెండో కిస్తు ల పంపిణీ ని కూడా ప్రారంభించారు.జనవరి 20-21 తేదీలలో తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించనున్న ప్రధాని
January 18th, 06:59 pm
జనవరి 20వ తేదీ ఉదయం 11 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ ఆలయంలో వివిధ పండితులు కంబ రామాయణం నుండి పద్యాలను పఠించడాన్ని కూడా ప్రధాన మంత్రి వింటారు.ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తి కి దగ్గరలో ఉన్నలేపాక్షి లో వీరభద్ర దేవాలయం లో జరిగిన పూజ మరియు దైవ దర్శనం కార్యక్రమాల లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
January 16th, 06:13 pm
ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తి కి దగ్గర లో ఉన్న లేపాక్షి గ్రామం లో గల వీరభద్ర దేవాలయం లో ఈ రోజు న జరిగిన పూజ కార్యక్రమం మరియు దైవ దర్శనం కార్యక్రమాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. తెలుగు లో రంగనాథ రామాయణం నుండి కొన్ని ప్రవచనాల ను శ్రీ నరేంద్ర మోదీ విన్నారు; జటాయు కు సంబంధించిన గాథ ను ఆంధ్ర ప్రదేశ్ లో తోలుబొమ్మలాట గా ప్రసిద్ధమైన కళారూపం మాధ్యం ద్వారా ప్రదర్శించగా, ఆ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి తిలకించారు.శ్రీ సోనాల్ మాతా శతజయంతి కార్యక్రమంలో ప్రధాన మంత్రి వీడియో సందేశం
January 13th, 12:00 pm
ప్రస్తుత ఆధ్యాత్మిక నాయకురాలు (గాదిపతి) పూజ్య కంచన్ మాత, మరియు పరిపాలనాధికారి పూజ్య గిరీష్ అపా! ఈ రోజు, పవిత్రమైన పుష్య మాసంలో, మనమందరం ఆయ్ శ్రీ సోనాల్ మా యొక్క శత జయంతిని జరుపుకుంటున్నాము. సోనాల్ తల్లి ఆశీస్సులతో ఈ పవిత్ర కార్యక్రమంలో పాలుపంచుకోవడం నిజంగా గర్వకారణం. మొత్తం చరణ్ కమ్యూనిటీకి, నిర్వాహకులకు, సోనాల్ మా భక్తులకు అభినందనలు. చరణ్ కమ్యూనిటీకి ఆరాధన, అధికారం, సంప్రదాయాల కేంద్రంగా మదదా ధామ్ కు ప్రత్యేక స్థానం ఉంది. నేను వినమ్రంగా శ్రీ ఆయి పాదాలకు నమస్కరిస్తున్నాను మరియు ఆమెకు నివాళులు అర్పిస్తున్నాను.ఆయి శ్రీ సోనాల్ మాత శతజయంతి సందర్భంగా వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం
January 13th, 11:30 am
సోనాల్ మాత శతజయంతి వేడుకల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఆయి శ్రీ సోనాల్ మాత జన్మశతాబ్ది ఉత్సవం పవిత్ర పుష్య మాసంలో నిర్వహిస్తున్న సందర్భంగా మాత ఆశీస్సులు పొందడంపై కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పవిత్ర కార్యక్రమంలో పాలుపంచుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల నిర్వహణపై చరణ్ సమాజంతోపాటు నిర్వాహకులందర్నీ ప్రధాని మోదీ అభినందించారు. ‘‘మద్దా ధామ్ చరణ సమాజానికి భక్తి, శక్తి, ఆచార-సంప్రదాయాల కూడలిగా ఉంది. నేను శ్రీ ఆయి పాదాలకు ప్రణమిల్లి, నా భక్తిప్రపత్తులను చాటుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.